Israel Iran war : ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది? పూర్తి వివరాలు..-why iran launched drones and missiles attack on israel explained ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Israel Iran War : ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది? పూర్తి వివరాలు..

Israel Iran war : ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది? పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu
Apr 14, 2024 11:38 AM IST

Israel Iran war upates : ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్​కు మద్దతు పలికింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కానుంది.

ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది?
ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది?

Israel Iran tensions : మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ.. ఇజ్రాయెల్​పై డ్రోన్​లు, క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్​. రిపోర్టులు, ప్రపంచ దేశాల ఆందోళనలను నిజం చేస్తూ.. శనివారం రాత్రి.. 200కుపైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయెల్​పై దాడి చేసింది. ఫలితంగా.. ఈ రెండు దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం జరుగుతుందా? అన్న సందేహాలు మరింత బలపడ్డాయి. అసలు.. ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది?

ఇజ్రాయెల్​పై ఇరాన్ దాడి- ఎందుకు?

ఇజ్రాయెల్-హమాస్ మధ్య గతేడాది అక్టోబర్​ నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గాజాలో ఇజ్రాయెల్​ దళాలు దండయాత్ర చేస్తున్నారు. కాగా.. లెబనాన్​లోని హిజ్బుల్లా ఫైటర్లకు ఇరాన్​ మద్దతు ఇస్తోంది. ఇరాన్​ సాయంతోనే.. హిజ్బుల్లా ఫైటర్లు తమపై దాడి చేస్తున్నారని ఇజ్రాయెల్​ ఆరోపిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్​ కూడా బలంగా ప్రతిఘటిస్తోంది.

Israel Iran live updates : అయితే.. ప్రధాని బెంజమిన్​ నేతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్​.. గతంలో డమాస్కస్ రాయబార కార్యాలయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓవర్సీస్ ఖుడ్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్​తో సహా తమ అధికారులను చంపిందని ఇరాన్​ ఆరోపించింది. అందుకు ప్రతీకారంగా.. ఏప్రిల్ 13 న, ఇరాన్ ఇజ్రాయెల్​పై డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల దాడి చేసింది.

ఇజ్రాయెల్​పై ఇరాన్​ దాడి- తాజా పరిస్థితి..

ఇరాన్​ దాడిని సమర్థవంతంగా అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్​ చెబుతోంది. ఇందుకు.. అమెరికా కూడా ఇజ్రాయెల్​కు సాయం చేసినట్టు కనిపిస్తోంది. అమెరికా దళాలు దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులను కాల్చివేయడం ద్వారా ఇజ్రాయెల్​కు మద్దతు తెలిపాయి.

ఇరాన్​ తాజా చర్యలపై జీ7 సమావేశాన్ని నిర్వహిస్తామని అమెరికా చెబుతోంది.

Iran missile attack on Israel : తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్​ చేశారు. “ఇజ్రాయెల్​పై ఇరాన్ దాడుల విషయంలో అప్డేట్ కోసం నేను నా జాతీయ భద్రతా బృందాన్ని కలిశాను. ఇరాన్, దాని ప్రాక్సీల బెదిరింపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత పట్ల మా నిబద్ధతను చూపిస్తాము,” అని జో బైడెన్​ చెప్పుకొచ్చారు.

ఇజ్రాయెల్​పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు (జీఎంటీ) ఈ సమావేశం జరగనుంది.

ఇరాన్ దాడిని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు ఇప్పటికే ఖండించి ఇజ్రాయెల్​కు మద్దతిస్తామని ప్రతిజ్ఞ చేశాయి.

Iran Israel conflict : మరోవైపు.. ఉద్రిక్తతలను మరింత పెంచే విధంగా.. ఇరాన్ సుప్రీం లీడర్​ అయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. తమ దేశ అధికారి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. “మా అధికారి హత్యలో తమ ప్రమేయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు, అదే సమయంలో ఖండించలేదు కూడా. ఈ రోజు, ఇరాన్ డ్రోన్ దాడిని ఇజ్రాయిల్ చేసిన నేరాలకు శిక్షగా భావించండి,” అని ఇరాన్​ చెబుతోంది పేర్కొంది.

“ఇజ్రాయిల్ ప్రభుత్వం మరొక తప్పు చేస్తే, ఇరాన్ ప్రతిస్పందన గణనీయంగా తీవ్రంగా ఉంటుంది. ఇది ఇరాన్​కు, దుర్మార్గమైన ఇజ్రాయెల్ పాలనకు మధ్య జరుగుతున్న సంఘర్షణ. దీనికి అమెరికా దూరంగా ఉండాలి,” అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ మిషన్ హెచ్చరించింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.