Infosys share price : ఇన్ఫోసిస్ షేర్లు 10శాతం పతనం.. ఇప్పుడు బై?
17 April 2023, 11:52 IST
- Infosys Q4 results : ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో డీలా పడ్డాయి. లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. మరి ఇప్పుడు బై చేయవచ్చా?
10శాతం పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు.. ఇప్పుడు కొనొచ్చా?
Infosys share price : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఇన్ఫోసిస్ స్టాక్ కారణంగా ఐటీ సెక్టార్లో రక్తపాతం నమోదవుతోంది. క్యూ4 ఫలితాల్లో అంచనాలు మిస్ అవ్వడంతో ఇన్ఫోసిస్ షేర్లు 10శాతం పతనం కాగా.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 6శాతం నష్టాల్లో కొనసాగుతోంది. మరి ఇంత భారీగా పడిన ఇన్ఫోసిస్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా?
క్యూ4 ఫలితాలతో ఇన్ఫీ డీలా..!
స్టాక్ మార్కెట్లు ఓపెన్ అయిన వెంటనే.. ఇన్ఫోసిస్ స్టాక్‌లో విపరీతమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దాదాపు 11.5శాతం మేర నష్టాలతో ఒకానొక దశలో ఈ ఐటీ స్టాక్ రూ. 1,250కి పడిపోయింది. లోయర్ సర్కూట్ టచ్ అవ్వడంతో కొంతసేపు ట్రేడింగ్ ఆగిపోయింది. ఇన్ఫోసిస్ షేర్లు.. ఇంత దారుణంగా పతనమవ్వడం.. రెండేళ్లలో ఇది మొదటిసారి. ఒక్క రోజుల్లో ఇంత నష్టపోవడం 2019 తర్వాత ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 11:20 గంటలకు 11శాతం నష్టాలతో రూ. 1,237 వద్ద ఉంది కొనసాగుతోంది.
Infosys Q4 results 2023 : ఇంత భారీ పతనానికి కారణం ఇన్ఫీ విడుదల చేసిన క్యూ4 ఫలితాలతో పాటు ఔట్లుక్!. గత గురువారం ట్రేడింగ్ సెషన్ ముగిసిన అనంతరం 2023ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్. దాదాపు అన్ని విభాగాల్లోనూ మార్కెట్ అంచనాలను మిస్స్ చేసింది. సంస్థ నెట్ ప్రాఫిట్ 8శాతం వృద్ధితో రూ. 6,128కోట్లకు పెరిగింది. సంస్థ రెవెన్యూ 16శాతం వృద్ధి చెంది రూ. 37,441కు చేరింది. ఈ రెండూ.. నిపుణుల అంచనాల కన్నా చాలా తక్కువగా నమోదయ్యాయి.
ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Infosys share price target : ఇక 2024 ఆర్థిక ఏడాదికి సంబంధించి వీక్ ఔట్లుక్ ఇచ్చింది ఇన్ఫోసిస్. అంతర్జాతీయంగా నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావం తమపై ఉంటుందని వెల్లడించింది.
ఇన్ఫోసిస్ స్టాక్.. ఇప్పుడు బై?
ఇన్ఫోసిస్ స్టాక్‌పై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఇస్తున్న టార్గెట్స్‌ని ఇప్పుడు చూద్దాం..
Infosys share latest news : జెఫ్ఫరీస్:- ఇన్ఫోసిస్ ఫలితాలు షాకింగ్‌గా ఉన్నప్పటికీ.. ఈ బ్రోకరేజ్ సంస్థ బై కాల్నే ఇస్తోంది. టార్గెట్ ప్రైజ్ రూ. 1,570 అని చెబుతోంది. ప్రస్తుతం స్టాక్ పడటంతో అట్రాక్టివ్ జోన్‌కు వచ్చిందని స్పష్టం చేస్తోంది.
నోమురా:- మరో బ్రేకరేజ్ సంస్థ నోమురా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. ఇన్ఫోసిస్ షేర్ ప్రైజ్ టార్గెట్ రూ. 1,290 అని చెబుతోంది.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్:- గతంలో ఇన్ఫీకి బై కాల్ ఇచ్చింది ఈ బ్రోకరేజ్ సంస్థ. క్యూ4 ఫలితాల అనంతరం.. దానిని 'యాడ్'కు మార్చింది. స్టాక్ ప్రైజ్ టార్గెట్ రూ. 1,470 అని పేర్కొంది. అయితే గతంలో ఈ టార్గెట్ రూ. 1,830గా ఉండేది.
ఇన్ఫోసిస్ స్టాక్ ప్రైజ్ హిస్టరీ..
Infosys latest news : గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లో ఇన్ఫోసిస్ స్టాక్ 12.99శాతం మేర పడింది. నెల రోజుల వ్యవధిలో 12.3శాతం మేర పతనమైంది. 6నెలల్లో 16.7శాతం, ఏడాదిలో ఏకంగా 23శాతం పడిపోయింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 19శాతం నష్టపోయింది ఇన్ఫోసిస్ షేరు.