TCS Q4 results: ఈ క్యూ 4 లో 11 వేల కోట్ల నికర లాభాలను ఆర్జించిన టీసీఎస్
12 April 2023, 19:47 IST
TCS Q4 results: ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY 23)లో సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టీసీఎస్ ఆకర్షణీయ లాభాలను ఆర్జించింది.గత Q4 తో పోలిస్తే 12% అధిక నికర లాభాలను సాధించింది.
ప్రతీకాత్మక చిత్రం
TCS Q4 results: టాటా కన్సల్టెన్సీ అండ్ సర్వీసెస్ (Tata Consultancy and Services TCS) ఈ ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY 23) ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికం (Q4FY 23)లో గత ఆర్థిక సంవత్సరం Q4 కన్నా 12% అధికంగా నికర లాభాలను ఆర్జించినట్లు వెల్లడించింది.
TCS Q4 results: రూ. 11,436 కోట్లు..
ఈ Q4 (Q4FY 23) లో టీసీఎస్ (TCS) రూ. 11,436 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q4 లో టీసీఎస్ నికర లాభాలు రూ. 9,959 కోట్లు. అలాగే సంస్థ మొత్తం ఆదాయం కూడా గత సంవత్సరం Q4 (Q4FY 22) కన్నా ఈ సంవత్సరం Q4 (Q4FY 23) లో 16.94% పెరిగింది. ఈ Q4 లో టీసీఎస్ (TCS) ఆదాయం రూ. 59,162 కోట్లు కాగా, గత సంవత్సరం Q4 లో సంస్థ ఆదాయం రూ. 50, 591 కోట్లు. అలాగే, డిసెంబర్ తో ముగిసే ఈ Q3 లో టీసీఎస్ (TCS) రూ. 58,229 కోట్ల ఆదాయాన్ని పొందింది.
TCS Q4 results: పన్ను అనంతర లాభం
గత ఆర్థిక సంవత్సరం Q3 లో టీసీఎస్ పన్ను అనంతర లాభం (Profit After Tax) రూ. 10,846 కోట్లు గా ఉన్నాయి. ఈ సమయంలో టీసీఎస్ (TCS) దాదాపు 2,197 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ తరువాత గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కొత్తగా 821 మంది ఉద్యోగులకు తీసుకుంది. మార్చి 31, 2023 నాటికి టీసీఎస్ (TCS) మొత్తం ఉద్యోగుల సంఖ్య 614,795 గా ఉంది. ఇటీవల టీసీఎస్ తమ షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్ గా రూ. 24 లను ప్రకటించింది. టీసీఎస్ (TCS) షేర్ వాల్యూ ఏప్రిల్ 12వ తేదీన బీఎస్ఈ (BSE) లో రూ. 3,242.10 గా ఉంది.