తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Multibaggers: లక్ష రూపాయలను పదేళ్లలో కోటి రూపాయలుగా మార్చిన మ్యాజిక్ స్టాక్స్ ఇవే..

Multibaggers: లక్ష రూపాయలను పదేళ్లలో కోటి రూపాయలుగా మార్చిన మ్యాజిక్ స్టాక్స్ ఇవే..

25 May 2023, 18:10 IST

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఇలాంటి రాబడినిచ్చే మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం వెతుకుతుంటారు. ఈ కింది కంపెనీల స్టాక్స్ కూడా అలాంటివే..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఇలాంటి రాబడినిచ్చే మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం వెతుకుతుంటారు. ఈ కింది కంపెనీల స్టాక్స్ కూడా అలాంటివే..
Tanla Platforms: గత పదేళ్లలో 20378% వృద్ధి సాధించిన స్టాక్ టాన్లా ప్లాట్ ఫామ్స్. 2013 మేలో ఈ కంపెనీ షేర్ విలువ రూ. 3.5. ఇప్పుడు, అంటే పదేళ్ల తరువాత, మే 2023లో ఆ కంపెనీ షేర్ విలువ రూ. 727 కి పెరిగింది. అంటే, 2013 మేలో ఈ కంపెనీ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడవి రూ. 2 కోట్లు అయ్యేవి. అంతేకాదు, గత ఐదేళ్లలో ఈ కంపెనీ షేర్ రూ. 30.5 నుంచి 2287% పెరిగి, రూ. 727 కి చేరింది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ.
(1 / 4)
Tanla Platforms: గత పదేళ్లలో 20378% వృద్ధి సాధించిన స్టాక్ టాన్లా ప్లాట్ ఫామ్స్. 2013 మేలో ఈ కంపెనీ షేర్ విలువ రూ. 3.5. ఇప్పుడు, అంటే పదేళ్ల తరువాత, మే 2023లో ఆ కంపెనీ షేర్ విలువ రూ. 727 కి పెరిగింది. అంటే, 2013 మేలో ఈ కంపెనీ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడవి రూ. 2 కోట్లు అయ్యేవి. అంతేకాదు, గత ఐదేళ్లలో ఈ కంపెనీ షేర్ రూ. 30.5 నుంచి 2287% పెరిగి, రూ. 727 కి చేరింది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ.(https://unsplash.com/photos/lp8ZlyAZjy8)
KEI Industries: జస్ట్ పదేళ్లలో మదుపర్లకు అద్భుత రిటర్న్స్ ను అందించిన మరో మల్టీ బ్యాగర్ కేఈఐ ఇండస్ట్రీస్. 2013 లో ఈ కంపెనీ షేరు ధర రూ. 10.9 కాగా, ఇప్పుడది రూ. 2,000.లకు చేరింది. అంటే, 2013 లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు అవి రూ. 1.8 కోట్లుగా మారేవి. 45 దేశాల్లో వైర్, కేబుల్ సర్వీసెస్ అందిస్తున్న సంస్థ ఈ కృష్ణ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ (KEI Industries).
(2 / 4)
KEI Industries: జస్ట్ పదేళ్లలో మదుపర్లకు అద్భుత రిటర్న్స్ ను అందించిన మరో మల్టీ బ్యాగర్ కేఈఐ ఇండస్ట్రీస్. 2013 లో ఈ కంపెనీ షేరు ధర రూ. 10.9 కాగా, ఇప్పుడది రూ. 2,000.లకు చేరింది. అంటే, 2013 లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు అవి రూ. 1.8 కోట్లుగా మారేవి. 45 దేశాల్లో వైర్, కేబుల్ సర్వీసెస్ అందిస్తున్న సంస్థ ఈ కృష్ణ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ (KEI Industries).(Bloomberg)
JBM Auto: గత పదేళ్లలో ఈ జేబీఎం ఆటో షేర్ వ్యాల్యూ 12934% వృద్ధి చెందింది. 2013 లో రూ. 6 గా ఉన్న ఈ కంపెనీ షేర్ వాల్యూ ఇప్పుడు రూ. 786 కి చేరింది. అంటే, 2013 లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ఇప్పుడు అవి రూ. 1.3 కోట్లుగా మారేవి. ఈ కంపెనీ షీట్ మెటల్ కాంపోనెంట్స్ ను, టూల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.
(3 / 4)
JBM Auto: గత పదేళ్లలో ఈ జేబీఎం ఆటో షేర్ వ్యాల్యూ 12934% వృద్ధి చెందింది. 2013 లో రూ. 6 గా ఉన్న ఈ కంపెనీ షేర్ వాల్యూ ఇప్పుడు రూ. 786 కి చేరింది. అంటే, 2013 లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ఇప్పుడు అవి రూ. 1.3 కోట్లుగా మారేవి. ఈ కంపెనీ షీట్ మెటల్ కాంపోనెంట్స్ ను, టూల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.(REUTERS)
Navin Fluorine: గత పదేళ్లలో ఈ నవీన్ ఫ్లోరైన్ కంపెనీ షేర్ విలువ 12262% పెరిగింది. 2013 లో ఈ సంస్థ షేర్ ధర రూ. 37 గా ఉండగా, ఇప్పుడు రూ. 4,585 కి చేరింది. 2013లో రూ. 1 లక్ష పెట్టుబడిగా పెట్టినవారికి పదేళ్లలో, 2023 నాటికి రూ. 1.2 కోట్లను అందిస్తోంది. గత 12 నెలల్లోనే ఈ కంపెనీ షేర్ 24% పెరిగింది. ఈ కంపెనీ రిఫ్రిజిరేషన్ గ్యాసెస్, కెమికల్స్, ఇనార్గానిక్ బల్క్ ఫ్లోరైడ్స్, స్పెషాలిటీ ఆర్గానో ఫ్లోరైన్స్ ను ఉత్పత్తి చేస్తుంది.
(4 / 4)
Navin Fluorine: గత పదేళ్లలో ఈ నవీన్ ఫ్లోరైన్ కంపెనీ షేర్ విలువ 12262% పెరిగింది. 2013 లో ఈ సంస్థ షేర్ ధర రూ. 37 గా ఉండగా, ఇప్పుడు రూ. 4,585 కి చేరింది. 2013లో రూ. 1 లక్ష పెట్టుబడిగా పెట్టినవారికి పదేళ్లలో, 2023 నాటికి రూ. 1.2 కోట్లను అందిస్తోంది. గత 12 నెలల్లోనే ఈ కంపెనీ షేర్ 24% పెరిగింది. ఈ కంపెనీ రిఫ్రిజిరేషన్ గ్యాసెస్, కెమికల్స్, ఇనార్గానిక్ బల్క్ ఫ్లోరైడ్స్, స్పెషాలిటీ ఆర్గానో ఫ్లోరైన్స్ ను ఉత్పత్తి చేస్తుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి