తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki Q3 Results, Net Profit Doubles On Strong Passenger Car Demand

Maruti Suzuki Q3 results : క్యూ3లో దూసుకెళ్లిన మారుతీ సుజుకీ.. రెండింతల లాభం నమోదు!

24 January 2023, 13:47 IST

  • Maruti Suzuki Q3 results : ఎఫ్​వై2023 క్యూ3లో మారుతీ సుజుకీ దుమ్మురేపింది. సంస్థ నెట్​ ప్రాఫిట్​ రెండింతలు వృద్ధిచెందింది.

క్యూ3లో దుమ్మురేపిన మారుతీ సుజుకీ.. అంచనాలకు మించి ఫలితాలు నమోదు!
క్యూ3లో దుమ్మురేపిన మారుతీ సుజుకీ.. అంచనాలకు మించి ఫలితాలు నమోదు! (HT_PRINT)

క్యూ3లో దుమ్మురేపిన మారుతీ సుజుకీ.. అంచనాలకు మించి ఫలితాలు నమోదు!

Maruti Suzuki Q3 results : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. 2022-23 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. మారుతీ సుజుకీ క్యూ3 ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి! ప్యాసింజర్​ కార్స్​ సెగ్మెంట్​లో మంచి డిమాండ్​ కనిపిస్తుండటం ఇందుకు కారణం.

ట్రెండింగ్ వార్తలు

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Gold and silver prices today : బంగారం ధర మళ్లీ పెరిగిందా? ఇక్కడ చెక్​ చేయండి..

లాభం రెండింతలు..!

క్యూ3లో మారుతీ సుజుకీ కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్​ రూ. 2,315కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే (రూ. 1,011కోట్లు) అది రెండింతలు ఎక్కువ! సంస్థ నెట్​ ప్రాఫిట్​ రూ. 1,881కోట్లుగా నమోదవుతుందని మార్కెట్​ వర్గాలు అంచనా వేశాయి.

Maruti Suzuki Q3 results 2023 : ఇక దిగ్గజ ఆటో సంస్థ రెవెన్యూ కూడా 25శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ రూ. 23,246కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం అది రూ. 29,044కోట్లుగా నమోదైంది. సంస్థ ఆపరేటింగ్​ ప్రాఫిట్​ రూ. 2,123కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 919కోట్లుగా ఉండేది.

క్యూ3లో మొత్తం 4,65,911 వాహనాలను విక్రయించింది మారుతీ సుజుకీ. వీటిల్లో 4,03,929 యూనిట్లను దేశీయంగాను, 61,982 యూనిట్లను విదేశాల్లో సేల్​ చేసింది. గతేడాది ఇదే త్రైమసికంలో 4,30,668 యూనిట్​లను సేల్​ చేసింది. ఎలక్ట్రానిక్​ కాంపొనెంట్స్​ కొరత కారణంగా మరో 46వేలకుపైగా వాహనాలను డెలివరీ చేయలకేపోయింది.

Maruti Suzuki results : 2022 క్యాలెండర్​ ఇయర్​లో సంస్థ చరిత్రలోనే అత్యధిక సేల్స్​ చేసినట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. ఇండియాలో 19,40,067 యూనిట్​లను విక్రయించగా.. విదేశాలకు 2,63,068 వాహనాలను ఎగుమతి చేసింది.

మారుతీ సుజుకీ షేర్​ ప్రైజ్​..

Maruti Suzuki share price : అంచనాలకు మించి ఫలితాలు వెలువడటంతో మారుతీ సుజుకీ షేర్లు మంగళవారం భారీ లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. మారుతీ సుజుకీ స్టాక్​.. ప్రస్తుతం దాదాపు 3శాతం లాభంతో 8,618 వద్ద ఉంది.

గత ఐదు ట్రేడింగ్​ సెషన్స్​లో మారుతీ సుజుకీ షేర్​ ధర 2శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.89శాతం వృద్ధిని నమోదు చేసింది. నెల రోజుల్లో 4.71శాతం వృద్ధి చెందింది. ఏడాదిలో ఏకంగా 7.4శాతం పెరిగింది.

వాహనాల ధరలు పెంపు..

Maruti Suzuki price hike : మరోవైపు తమ వాహనాల ధరలను ఇటీవలే పెంచింది మారుతీ సుజుకీ. పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చాయి. మోడల్​పై వేరియంట్​కు తగ్గట్టు ధరలను గరిష్ఠంగా 1.1శాతం పెంచింది. పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్​ చేయండి.