తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kotak Mahindra Bank Q3 Results: కొటక్ బ్యాంక్ లాభాల్లో 31 శాతం వృద్ధి

Kotak Mahindra Bank Q3 results: కొటక్ బ్యాంక్ లాభాల్లో 31 శాతం వృద్ధి

HT Telugu Desk HT Telugu

21 January 2023, 15:37 IST

  • Kotak Mahindra Bank Q3 results: ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra bank) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను (Q3 results) విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Aniruddha Chowdhury/Mint)

ప్రతీకాత్మక చిత్రం

Kotak Mahindra Bank Q3 results: కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra bank) ఈ Q3 లో మెరుగైన ఫలితాలను సాధించింది. డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3) లో బ్యాంక్ రూ. 11,099 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 లో కోటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra bank) రూ. 8,260 కోట్ల ఆదాయం పొందింది.

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

Kotak Mahindra Bank Q3 results: 31% వృద్ధి

కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra bank) ఈ Q3 (Q3 results) లో రూ. 2,792 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం Q3 కన్నా 31% అధికం. గత ఆర్థిక సంవత్సరం Q3 (Q3 results) లో బ్యాంక్ (Kotak Mahindra bank) రూ. 2,131 కోట్ల నికర లాభాలను పొందింది. నికర వడ్డీ ఆదాయం (net interest income NII) లో మెరుగైన ఫలితాలను బ్యాంక్ సాధించింది.

బ్యాంక్ (Kotak Mahindra bank) ఈ Q3FY23 లో రూ. 5,653 కోట్ల నికర వడ్డీ ఆదాయం (net interest income NII) పొందింది. ఇది గత ఆర్థిక సంవత్సరం Q3 కన్నా 30% అధికం. గత ఆర్థిక సంవత్సరం Q3 లో బ్యాంక్ (Kotak Mahindra bank) రూ. 4,334 కోట్ల నికర లాభాలను పొందింది. ఈ Q3 (Q3 results) లో బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా మెరుగుపడి 5.4 శాతానికి చేరింది.

ఆస్తుల నిర్వహణలోనూ బ్యాంక్ (Kotak Mahindra bank) మెరుగైన పనితీరును కనబర్చింది. ఈ Q3 (Q3 results) లో ఎన్పీఏ ((Non-Performing Assets NPA) ల విలువ 1.9% తగ్గింది.

టాపిక్

తదుపరి వ్యాసం