Electric car : మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. ‘ఈవీఎక్స్’ లాంచ్ మరింత ఆలస్యం?
01 November 2024, 6:40 IST
- Maruti Suzuki eVX : మారుతీ సుజుకీ నుంచి ఇండియాలో ఇంకా ఒక్క ఈవీ కూడా లాంచ్ అవ్వలేదు. ఇక ఇప్పుడు, మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ వాహనం లాంచ్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే..
మారుతీ సుజుకీ ఈవీఎక్స్
కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారును కొంత కాలం క్రితం ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. 2025 మార్చ్- ఏప్రిల్ నాటికి ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ప్రొడక్షన్ ఫేజ్‌లోకి అడుగుపెడుతుందని సమాచారం. ఈ ఈవీని మొదట 2023 ఆటో ఎక్స్‌పోలో, తరువాత 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. 2024 చివరి నాటికి ఈవీ ఉత్పత్తిని ప్రారంభించాలని ఇంతకు ముందు ప్రణాళిక ఉన్నప్పటికీ, వాహనంలో ఉపయోగించాల్సిన సెల్‌తో కొన్ని సమస్యల కారణంగా, ఉత్పత్తి కాలవ్యవధిని మార్చినట్లు తెలిస్తోంది.
ఈవీ బ్యాటరీ సప్లై విషయంలో మారుతీ సుజుకీ, టయోట మోటార్ కార్పొరేషన్ మధ్య కొలాబొరేషన్ జరిగింది. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అనే హైబ్రిడ్ వాహనాలపై ఇప్పటికే ఈ రెండు సంస్థలు కలిసి పనిచేశాయి.
మారుతీ సుజుకీ నుంచి మొదటి ఈవీ ఇంకా మాస్ ప్రొడక్షన్లోకి ప్రవేశించనప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన అనేక స్పై షాట్లు రాబోయే ఈవీ వివరాలను వెల్లడించింది. వాటి వివరాలు..
మారుతీ సుజుకీ ఈవీఎక్స్: స్పెసిఫికేషన్లు (అంచనా)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఈవీ పొడవు 4,300 ఎంఎం, వెడల్పు 1,800 ఎంఎం, ఎత్తు 1,600 ఎంఎంగా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందించగలదు. అయితే బ్యాటరీ ప్యాక్, రియల్ వరల్డ్ రేంజ్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక లాంచ్ వరకు వేచి చూడాల్సిందే.
అంతేకాకుండా, మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంటుందని ఇప్పుడు ధృవీకరించారు. అంటే అయితే, ప్రస్తుతానికి, ఎలక్ట్రిక్ మోటార్ల పవర్, టార్క్ అవుట్‌పుట్ వివరాలు తెలియదు.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్: ఫీచర్లు (అంచనా)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్, డీఆర్ఎల్ యూనిట్లు, ఎల్ఈడీ లైట్ బార్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రేర్ స్పాయిలర్‌తో పాటు షార్క్‌ఫిన్ యాంటెనా కూడా ఉండనున్నాయి. అయితే, ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్ మాదిరిగా కాకుండా, ప్రొడక్షన్ మోడల్లో కాన్సెప్ట్ మోడల్లో ఉన్న స్టీరింగ్‌కు బదులుగా సాధారణ ఓఆర్వీఎమ్లు, అల్లాయ్ వీల్స్, సరైన స్టీరింగ్ వీల్‌ను పొందొచ్చు.
టోక్యో ఆటో షోలో ప్రదర్శన సందర్భంగా సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ వాహనం క్యాబిన్ గురించి అనేక వివరాలను వెల్లడించింది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు అనుకూలమైన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, ఫ్రెంట్-వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీటు కోసం ఎలక్ట్రిక్ అడ్జెస్ట్మెంట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్విఎమ్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ కారులో రానున్నాయి.