Maruti Suzuki Brezza on road price : విజయవాడలో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Maruti Suzuki Brezza on road price Vijayawada : మారుతీ సుజుకీ బ్రెజా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? విజయవాడలో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తోంది. దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థల ఎస్‌యూవీలు రోడ్డు మీద దూసుకెళుతున్నాయి. వీటిల్లో మారుతీ సుజుకీ బ్రెజాకు ఇటీవల కాలంలో ఆదరణ మరింత పెరిగింది. బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటిగా ఈ మోడల్ నిలిచింది. ఈ నేపథ్యంలో విజయవాడలో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
విజయవాడలో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్‌రోడ్ ప్రైజ్..
మారుతీ సుజుకీ బ్రెజా ఎల్ఎక్స్ పెట్రోల్- రూ. 9.93 లక్షలు
ఎల్ఎక్స్ఐ సీఎన్జీ- రూ. 11.05 లక్షలు
వీఎక్స్ఐ పెట్రోల్- రూ. 11.53 లక్షలు
వీఎక్స్ఐ సీఎన్జీ- రూ. 13.07 లక్షలు
వీఎక్స్ఐ ఏటీ పెట్రోల్- రూ. 13.62 లక్షలు
జెడ్ఎక్స్ఐ పెట్రోల్- రూ. 13.68 లక్షలు
జెడ్ఎక్స్ఐ డీటీ పెట్రోల్- రూ. 13.68 లక్షలు
ఇదీ చూడండి:- ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహీంద్రా థార్ రాక్స్ సరికొత్త రికార్డు.. కేవలం బుకింగ్స్ ద్వారానే 31,730 కోట్లు
జెడ్ఎక్స్ఐ సీఎన్జీ- రూ. 14.83 లక్షలు
జెడ్ఎక్స్ఐ సీఎన్జీ డీటీ- రూ. 14.83 లక్షలు
జెడ్ఎక్స్ఐ ఏటీ పెట్రోల్- రూ. 15.38 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ పెట్రోల్ రూ. 15.42 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ డీటీ పెట్రోల్- రూ. 15.42 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ పెట్రోల్- రూ. 15.42 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ డీటీ పెట్రోల్- రూ. 17.12 లక్షలు
అంటే విజయవాడలో మారుతీ సుజుకీ బ్రెజా ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 9.93 లక్షల నుంచి రూ. 17.12 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మేన్యువల్, ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బ్రెజా డీజిల్ వేరియంట్‌ని సంస్థ ఆఫర్ చేయడం లేదు. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మారుతీ సుజుకీ బ్రెజా జెడ్ఎక్స్ఐ సీఎన్జీ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి.
ఈవీ సెగ్మెంట్లో వెనకపడినప్పటికీ, సీఎన్జీ సెగ్మెంట్లో మారుతీ సుజుకీ బలంగా రాణిస్తోంది. మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీ ఆప్షన్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. అధిక మైలేజ్ వస్తుండటంతో ప్రజలు దీనిపై ఎక్కువ మొగ్గుచూపుతున్నారు.
సాధారణంగా ఏదైనా వెహికిల్‌ని రిలీజ్ చేసే సమయంలో సంస్థ దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తుంది. కానీ ఆ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో అమలయ్యే ట్యాక్స్‌లు ఇందుకు కారణం. అందుకే కారు కొనే ముందు దాని ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను కూడా తెలుసుకుని బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది కాబట్టి, మీరు మీ సమీపంలోని మారుతీ సుజుకీ డీలర్షిప్ షోరూమ్‌కి వెళితే, బ్రెజా ఎస్‌యూవీపై ఏవైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. అది మీకు మరింత ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం