Mahindra Thar Roxx on road price Hyderabad : హైదరాబాద్​లో మహీంద్రా థార్​ రాక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..-mahindra thar roxx on road price in hyderabad revealed check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Thar Roxx On Road Price Hyderabad : హైదరాబాద్​లో మహీంద్రా థార్​ రాక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Mahindra Thar Roxx on road price Hyderabad : హైదరాబాద్​లో మహీంద్రా థార్​ రాక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Sharath Chitturi HT Telugu
Aug 27, 2024 10:38 AM IST

Mahindra Thar Roxx on road price : 5 డోర్​ మహీంద్రా థార్​ రాక్స్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే హైదరాబాద్​లో మహీంద్రా థార్​ రాక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

మహీంద్రా థార్​ రాక్స్
మహీంద్రా థార్​ రాక్స్

ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ ఎస్​యూవీల్లో ఒకటైన 5-డోర్​ మహీంద్రా థార్​ రాక్స్​ని సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. 3 డోర్​ థార్​కి మంచి డిమాండ్​ ఉన్న నేపథ్యంలో ఈ థార్​ రాక్స్​పై కస్టమర్ల ఆసక్తి పెరిగింది. మీరు కూడా థార్​ రాక్స్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో 5 డోర్​ మహీంద్రా థార్​ రాక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో మహీంద్రా థార్​ రాక్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

థార్​ రాక్స్​ ఎంఎక్స్1​ పెట్రోల్​ ఎంటీ- రూ. 16.24 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​1 డీజిల్​ ఎంటీ- రూ. 17.46 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​3 పెట్రోల్​ ఏటీ- రూ. 18.68 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​3 డీజిల్​ ఎంటీ- రూ. 19.94 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​5 పెట్రోల్​ ఎంటీ- రూ. 20.55 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​3 ఎల్​ డీజిల్​ ఎంటీ- రూ. 21.16 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​5 డీజిల్​ ఎంటీ- రూ. 21.77 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​5 పెట్రోల్​ ఏటీ- రూ. 22.38 లక్షలు

థార్​ రాక్స్​ ఎంఎక్స్​5 డీజిల్​ ఏటీ- రూ. 22.99 లక్షలు

థార్​ రాక్స్​ ఏఎక్స్​7 ఎల్​ డీజిల్​ ఎంటీ- రూ. 23.60 లక్షలు

థార్​ రాక్స్​ ఏఎక్స్​5 ఎల్​ డీజిల్​ ఏటీ- రూ. 23.60 లక్షలు

థార్​ రాక్స్​ ఏఎక్స్​7 ఎల్​ పెట్రోల్​ ఏటీ- రూ. 24.81 లక్షలు

థార్​ రాక్స్​ ఏఎక్స్​7 ఎల్​ డీజిల్​ ఏటీ- రూ. 25.63 లక్షలు

ఇదీ చూడండి:- Tata Curvv EV on road price in Hyderabad : హైదరాబాద్​లో టాటా కర్వ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

వీటితో పాటు మహీంద్రా థార్​ రాక్స్​ ఎంఎక్స్​5 డీజిల్​ ఎంటీ, ఏఎక్స్​5 ఎల్​ డీజిల్​ ఏటీ, ఏఎక్స్​7 ఎల్​ డీజిల్​ ఎంటీ, ఏఎక్స్​7 ఎల్​ డీజిల్​ వేరియంట్లు కూడా ఉన్నాయి. కానీ వీటి ధరలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టాప్​ ఎండ్​ మోడల్స్​ ధరలను సంస్థ ప్రకటించనుంది.

5 డోర్ మహీంద్రా​ థార్​ రాక్స్​ పెట్రోల్​, డీజిల్​ వేరియంట్లలో లభిస్తోంది. వీటికి మేన్యువల్​ (ఎంటీ), ఆటోమెటిక్​ (ఏటీ) ట్రాన్స్​మిషన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇది కస్టమర్స్​కి మంచి ఆప్షన్స్​ లభిస్తున్నట్టే!

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు కేవలం ఎక్స్​షోరూం ధరలే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటుంది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి. సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్​పై ఏవైనా ఆఫర్స్​ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం