Mahindra Thar Roxx : 5 డోర్​ మహీంద్రా థార్ రాక్స్​​ కొనొచ్చా? ప్లస్​లు- మైనస్​లు ఇవే..-mahindra thar roxx pros and cons you must know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Thar Roxx : 5 డోర్​ మహీంద్రా థార్ రాక్స్​​ కొనొచ్చా? ప్లస్​లు- మైనస్​లు ఇవే..

Mahindra Thar Roxx : 5 డోర్​ మహీంద్రా థార్ రాక్స్​​ కొనొచ్చా? ప్లస్​లు- మైనస్​లు ఇవే..

Sharath Chitturi HT Telugu
Aug 19, 2024 06:40 AM IST

2024లో భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో విడుదల చేసిన అతిపెద్ద కార్లలో ఒకటి మహీంద్రా థార్ రాక్స్. ఈ ఎస్​యూవీని మా బృందం డ్రైవ్​ చేసి ప్లస్​లు, మైనస్​లను లిస్ట్​ చేసింది. థార్​ రాక్స్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారు కచ్చితంగా తెలుసుకోవాలి..

మహీంద్రా థార్​ రాక్స్​ కొనొచ్చా?
మహీంద్రా థార్​ రాక్స్​ కొనొచ్చా?

మహీంద్రా థార్ రాక్స్ ఎట్టకేలకు భారత మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఈ ఎస్​యూవీ మహీంద్రా థార్ 3 డోర్​ మోడల్​కు 5 డోర్​ రీమేక్​గా వస్తుంది. మూడు-డోర్ల థార్ లైఫ్​స్టైల్ ఆఫ్-రోడర్​గా మంచి గుర్తుంపు తెచ్చుకున్నప్పటికీ, థార్ రాక్స్ అదనపు సైడ్ డోర్లు, అధిక స్పేస్​, కంఫర్ట్​తో పాటు ఫీచర్ ప్యాక్డ్ క్యాబిన్​తో ఎస్​యూవీ ప్రాక్టికాలిటీని మెరుగుపరుస్తుంది.

రూ .12.99 లక్షల నుంచి రూ .18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఇంట్రొడక్టరీ ప్రైజ్​తో విడుదలైన మహీంద్రా థార్ రాక్స్ అనేక వేరియంట్లలో లభిస్తుంది. కొన్ని వేరియంట్ల ధరలను వెల్లడించగా, దేశీయ ఆటో దిగ్గజం వచ్చే నెలలో మిగిలిన వాటి ధరలను ప్రకటిస్తుంది. అక్టోబర్ 3 నుంచి ఈ ఎస్​యూవీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 12 నుంచి టెస్ట్​డ్రైవ్​లు మొదలవుతాయి. దసరా వేళ, అక్టోబర్ 12 నుంచి ఈ ఎస్​యూవీల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఇంతలో హెచ్​టీ ఆటో మహీంద్రా థార్ రాక్స్​ను నడిపింది. 5 డోర్​ ఎస్​యూవీని క్షుణ్ణంగా సమీక్షించింది. ఈ నేపథ్యంలో మహీంద్రా థార్​ రాక్స్​ ప్లస్​లు, మైనస్​లు ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా థార్ రాక్స్: ప్లస్..

మహీంద్రా థార్ రాక్స్ బోల్డ్ స్టైలింగ్​తో వస్తుంది. ఇది మొదటి చూపులోనే దృష్టిని ఆకర్షిస్తుంది. థార్ త్రీ-డోర్​తో విస్తృత శ్రేణి సారూప్యతలను కలిగి ఉన్నప్పటికీ, థార్ ఐదు-డోర్లు దాని విలక్షణమైన డిజైన్ అంశాలకు భిన్నంగా కనిపిస్తాయి. వీటిలో కొత్త డిజైన్ సీ-ఆకారంలో ఎల్​ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, ఎల్​ఈడీ టెయిల్లైట్ల కోసం తాజా లుక్ ఉన్నాయి. అంతేకాకుండా, అదనపు సైడ్ డోర్లు కూడా మహీంద్రా థార్ తో పోలిస్తే విలక్షణమైన రూపాన్ని ఇస్తాయి. బలమైన రహదారి ఉనికితో మొత్తం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

మహీంద్రా థార్ రాక్స్ థార్ 3-డోర్​ కంటే మరింత అప్ మార్కెట్, ప్రాక్టికల్​గా వస్తుంది. మెరుగైన ఇంటీరియర్, ఎక్కువ ఫీచర్లు, ఆచరణాత్మకత మార్పులతో థార్ రాక్స్ ద్వారా అప్ మార్కెట్ లైఫ్​స్టైల్ ఆఫ్​రోడర్ ఆట్రాక్టివ్​ కోషియంట్ పెరిగింది.

మహీంద్రా థార్ రాక్స్ అనేక ఫీచర్లతో కూడిన ఇంటీరియర్​తో వస్తుంది. 9 స్పీకర్ల హర్మన్ కార్డాన్ ఆడియో సిస్టెమ్, పానోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే, ఇది పెద్ద బూట్ స్పేస్​ని పొందుతుంది. ఇది లగేజీకి ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది.

మహీంద్రా థార్ రాక్స్ సమర్థవంతమైన ఇంజిన్​, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్ ఎస్​యూవీకి యాడెడ్​ అడ్వాంటేజ్​. రిఫైన్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు మాన్యువల్- ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఎస్​యూవీ డ్రైవింగ్ ఆనందాన్ని పెంచుతాయి. అలాగే, 4×4 డ్రైవ్ ట్రెయిన్​తో థార్ 5 డోర్​ చాలా ప్రమాదకరమైన భూభాగాల గుండా పెద్దగా ఇబ్బంది లేకుండా వెళ్లిపోతుంది. మహీంద్రా థార్ రాక్స్.. థార్​తో పోలిస్తే చాలా మెరుగైన రైడ్, హ్యాండ్లింగ్, స్టీరింగ్​తో వస్తుంది. విభిన్న డ్రైవ్ మోడ్​లు దాని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.

మహీంద్రా థార్ రాక్స్ లో ఆరు ఎయిర్ బ్యాగులు, లెవల్ 2 ఏడీఏఎస్, ఈఎస్​పీ, హిల్ హోల్డ్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్, అన్ని సీట్లకు మూడు పాయింట్ల సీట్ బెల్ట్, ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా థార్ రాక్స్: మైనస్​లు..

3 డోర్​ థార్​తో పోలిస్తే మహీంద్రా థార్ రాక్స్ రైడ్ క్వాలిటీ గణనీయంగా మెరుగుపడింది కానీ ఈ ఎస్​యూవీ రైడ్ క్వాలిటీ మహీంద్రా ఎక్స్​యూవీ 700 వంటి బ్రాండ్​లోని ఇతర ఎస్​యూవీలతో సరిపోలేదు. అలాగే, ప్రయాణీకులకు తగినంత స్టోరేజ్​ స్పేస్​ లభించదు. ఇది థార్ రోక్స్ వంటి ఐదు డోర్ల ఎస్​యూవీకి మైనస్​.

మహీంద్రా థార్ రాక్స్ లైట్ కలర్ ఇంటీరియర్​ను కలిగి ఉంది. ఇది తెలుపు సీట్లతో వస్తుంది. ఆఫ్-రోడ్ ఫోకస్డ్ వాహనం కావడంతో, ఈ కలయిక ఇంటీరియర్ సులభంగా మురికిగా మారే అవకాశం ఉంది. అంటే యజమాని క్యాబిన్​ని శుభ్రంగా ఉంచడం కష్టమవుతుంది.

మహీంద్రా థార్ రాక్స్​లో మూడొవ వరుస సీట్లు లేవు. ఇది వాహన తయారీదారు దీనిని ఎస్​యూవీకి జోడించాలని ఆలోచిస్తే ఇది ఒక వరం కావచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్, ఎక్స్​యూవీ 700 వంటి మోడళ్లలో మూడొవ వరుస సీట్లు ఉన్నాయి. మహీంద్రా థార్ వంటి కన్వర్టబుల్ సాఫ్ట్ టాప్ లేదా జీప్ రాంగ్లర్​లో కనిపించే రిమూవబుల్ హార్డ్ టాప్ వంటివి లేవు. ఓపెన్ టాప్ డ్రైవింగ్​ను ఇష్టపడేవారికి ఇది నెగిటివ్​!

మహీంద్రా థార్ రాక్స్ ఫీచర్ లోడెడ్ క్యాబిన్​తో వచ్చినప్పటికీ, రీచ్ అడ్జెస్టెబుల్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, రేర్​ విండో షేడ్స్ వంటి కొన్ని ఫీచర్లను మిస్​ అయ్యింది. ఇవి వినియోగదారులకు కారు ఆకర్షణను పెంచే ప్రాక్టికల్- కన్వీనియన్స్ ఫోకస్డ్ ఫీచర్లను తగ్గించింది.

వాహన తయారీదారు థార్ రాక్స్​ను ప్రాక్టికల్ ఎస్​యూవీగా చేయడానికి ప్రయత్నించినప్పటికీ వృద్ధులకు ఎస్​యూవీ క్యాబిన్​లోకి ప్రవేశించడం, దిగడం వంటివి కష్టతరం చేస్తుంది.

ఇంజిన్​ విషయానికి వస్తే, 4×4 ఆప్షన్ డీజిల్ వేరియంట్​లో మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు, పెట్రోల్ వేరియంట్ రేర్​ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్​తో మాత్రమే లభిస్తుంది. ఇది మహీంద్రా థార్ రాక్స్ వినియోగదారులకు కొంత వరకు ఆకర్షణను పరిమితం చేస్తుంది.

సంబంధిత కథనం