Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ లో స్పెషల్ ఫీచర్స్ ఏమేం ఉన్నాయో తెలుసా? ఇక్కడ చూడండి..-review in pics mahindra thar roxx takes direct aim at family oriented suvs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ లో స్పెషల్ ఫీచర్స్ ఏమేం ఉన్నాయో తెలుసా? ఇక్కడ చూడండి..

Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ లో స్పెషల్ ఫీచర్స్ ఏమేం ఉన్నాయో తెలుసా? ఇక్కడ చూడండి..

Aug 17, 2024, 09:45 PM IST HT Telugu Desk
Aug 17, 2024, 09:45 PM , IST

  • థార్ రాక్స్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న థార్ కు ఎక్స్టెండెడ్ వర్షన్ కాదని మహీంద్రా చెబుతోంది. మహింద్రా థార్ రాక్స్ లో థార్ ను మించిన ఫీచర్స్ చాలా ఉన్నాయని, అవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఉత్సాహభరితం చేస్తాయని ఘంటాపథంగా చెబుతోంది. థార్ రాక్స్ లోని ఆ ఫీచర్స్ ఏంటో ఈ ఫొటోస్ లో చూడండి..

మహీంద్రా థార్ రాక్స్ భారత కార్ల మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది, థార్ మూడు డోర్ల ఎస్ యూవీ తన విజయ ప్రయాణాన్ని ప్రారంభించిన మూడు సంవత్సరాల తరువాత, థార్ రాక్స్ ను లాంచ్ చేశారు. భారతీయ ఆటోమోటివ్ రంగంలో థార్ ఒక కల్ట్ హోదాను ఆస్వాదిస్తోంది. థార్ రాక్స్ ఒక కుటుంబ మోడల్ గా మార్కెట్లో నిలవాలని భావిస్తోంది.

(1 / 13)

మహీంద్రా థార్ తో పోలిస్తే మహీంద్రా థార్ రాక్స్ అన్ని డైమెన్షన్స్ పెరిగాయి. ఇది ఇప్పుడు 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది, పొడవైన వీల్ బేస్ ఉండడం వల్ల  వెనుక సీట్ల ప్రయాణీకుల కోసం రెండు డోర్లను జోడించడం వీలైంది. రాక్స్ లో 19-అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి.

(2 / 13)

థార్ రాక్స్ లో చాలా పెద్ద విండోస్ ఉన్నాయి. వెనుక రెండు డోర్లకు హ్యాండిల్ పైకి అమర్చబడింది. వెనుక క్వార్టర్ గ్లాస్ ఇప్పుడు త్రిభుజాకారంలో ఉంది.

(3 / 13)

థార్ రాక్స్ లో థార్ ఐకానిక్ ఫ్రంట్ లుక్ ను కొనసాగించారు. అదనంగా, థార్ రాక్స్ స్పోర్ట్స్ ఎలిమెంట్స్ ను చేర్చారు, ఇవి కొంతవరకు ప్రత్యేకతను ఇస్తాయి. 

(4 / 13)

థార్ రాక్స్ వెనుక ప్రొఫైల్ కూడా థార్ మాదిరిగానే ఉంటుంది, థార్ రాక్స్ లో అప్ డేటెడ్ ఎల్ ఇడి టెయిల్ లైట్లు అదనం.

(5 / 13)

థార్ రాక్స్ లో విశాలమైన వెంటిలేడెడ్ క్యాబిన్ ఉంది విశాలమైన సన్ రూఫ్, లేత-రంగు అప్ హోల్ స్టరీ, పెద్ద పరిమాణంలో ఉన్న విండోస్ అందుకు కారణం.

(6 / 13)

థార్ రాక్స్ రెండో వరుసలో ముగ్గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 

(7 / 13)

థార్ రాక్స్ రెండో వరుసలో ముగ్గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 

థార్ రాక్స్ లో పెద్ద లోపం పరిమిత స్టోరేజ్ స్పేస్.. ఇందులో డోర్స్ కు లోపలివైపు ఉన్న చిన్న బాక్స్ ల్లో స్మార్ట్ ఫోన్స్ ను పెట్టుకోవచ్చు.

(8 / 13)

థార్ రాక్స్ వెనుక భాగంలో ఉన్న కార్గో ప్రాంతం సైజ్ పెరిగింది. వెనుక సీట్లను మడతపెట్టి మరింత స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు.

(9 / 13)

థార్ రాక్స్ లోపల రెండు 10.25 అంగుళాల స్క్రీన్స్ ఉన్నాయి. డ్యాష్ బోర్డులో ఉన్న ప్రధాన ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ను అప్ డేట్ చేశారు. ఇది ఆండ్రీనోఎక్స్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.

(10 / 13)

థార్ రాక్స్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ తో పాటు అధిక శక్తి కలిగిన టైప్-సి ఛార్జింగ్ పాయింట్లు, సాంప్రదాయ యూఎస్బీ పోర్ట్ లను పొందుతుంది.

(11 / 13)

థార్ రాక్స్ లోపల ప్రధాన ఆకర్షణ విశాలమైన పనోరమిక్ సన్ రూఫ్. కానీ దానిని ఆపరేట్ చేసే బటన్ తరచుగా పనిచేయలేదని రివ్యూస్ వచ్చాయి.

(12 / 13)

థార్ రాక్స్ 2.0-లీటర్ ఎంస్టాలియన్ పెట్రోల్ మోటార్, 2.2-లీటర్ ఎంహాక్ డీజల్ ఇంజన్ తో వస్తుంది. ఈ రెండూ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ యూనిట్లతో వస్తాయి, అయితే 4×4 డీజిల్ వెర్షన్ కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డీజల్ ఇంజన్ కూడా రెండు రకాల ట్యూన్లలో, రియర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది. 

(13 / 13)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు