Suzuki Hustler : సుజుకీ నుంచి మైక్రో ఎస్​యూవీ.. హస్ట్లర్​ ఇండియా లాంచ్​ ఎప్పుడు?-suzuki hustler spied testing in india will this micro suv launch here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Suzuki Hustler : సుజుకీ నుంచి మైక్రో ఎస్​యూవీ.. హస్ట్లర్​ ఇండియా లాంచ్​ ఎప్పుడు?

Suzuki Hustler : సుజుకీ నుంచి మైక్రో ఎస్​యూవీ.. హస్ట్లర్​ ఇండియా లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu
Aug 13, 2024 11:26 AM IST

సుజుకీ హస్ట్లర్ మైక్రో ఎస్​యూవీ భారతదేశంలో కనిపించింది. మారుతీ సుజుకీ మైక్రో ఎస్​యూవీగా ఇది లాంచ్​ అవుతుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. నగరాల్లో ట్రాఫిక్​ ఇబ్బందులకు ఇది పరిష్కారంగా నిలుస్తుంది.

హస్ట్లర్​ ఇండియా లాంచ్​ ఎప్పుడు?
హస్ట్లర్​ ఇండియా లాంచ్​ ఎప్పుడు?

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కి ఉన్న డిమాండ్​ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం. దాదాపు ప్రతి ఆటోమొబైల్​ సంస్థ ఎస్​యూవీ సెగ్మెంట్​పై ఫోకస్​ చేసింది. ఇక ఇప్పుడు జపాన్​లో క్లిక్​ అయిన ‘హస్ట్లర్​’ మైక్రో ఎస్​యూవీని ఇండియాలోకి తీసుకొచ్చేందుకు సుజుకీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో సుజుకి హస్ట్లర్ గురించి చాలా మందికి తెలియనప్పటికీ, వాహన తయారీదారు దేశంలో ఈ వాహనాన్ని పరీక్షించడం ప్రారంభించింది. దిల్లీ సమీపంలో టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించిన ఈ చిన్న ఎస్​యూవీ స్పై షాట్లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఫలితంగా ఇది మారుతీ సుజుకీ బ్యాడ్జ్ కింద భారతదేశానికి రావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

మారుతీ సుజుకీ యుటిలిటీ వాహన విభాగంపై ఎక్కువగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేటగిరీకి ప్రాధాన్యత ఇవ్వడానికి తన ప్రణాళికను వెల్లడించింది. ముఖ్యంగా బ్రెజా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో విజయాన్ని చూసిన తరువాత.. పెద్ద సంఖ్యలో భారతీయ కార్ల కొనుగోలుదారులు చిన్న హ్యాచ్​బ్యాక్​ పట్ల తమ సాంప్రదాయ పక్షపాతాన్ని పక్కనపెట్టి క్రాసోవర్లు, ఎస్​యూవీలను సిద్ధం చేస్తోంది. వివిధ ప్రైజ్​ పాయింట్లలో యుటిలిటీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో, సుజుకీ హస్ట్లర్ భారతదేశంలో టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించండ ఆసక్తికరంగా మారింది.

అయితే మారుతీ సుజుకీ సంస్థ.. సుజుకి హస్ట్లర్ మైక్రో ఎస్​యూవీని భారతదేశంలో వాణిజ్యపరంగా విడుదల చేసే విషయం గురించి ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. భారతదేశంలో టెస్ట్​ డ్రైవ్​లో ఉన్న సుజుకి హస్ట్లర్ ప్రోటోటైప్ కాంపోనెంట్ లేదా హీట్​ వాతావరణ పరీక్ష కోసం కావచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి.

సుజుకీ హస్ట్లర్..

2014లో ప్రపంచ మార్కెట్​కు పరిచయమైన సుజుకీ హస్ట్లర్ ఒక మైక్రో ఎస్​యూవీ. ఇది మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో కంటే చిన్నదిగా ఉంటుంది! సుజుకీ హస్ట్లర్ 3,300 ఎంఎం పొడవు, 2,400 ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంది. ఇది మారుతీ సుజుకీ ఆల్టో కే 10, ఎంజీ కామెట్ ఈవీ మాదిరిగానే ఉంటుంది.

ఈ మైక్రో ఎస్​యూవీని నగరాల్లో, ట్రాఫిక్​ అధికంగా ఉండే ప్రాంతాల్లో వాడుకోవచ్చు. ప్రాక్టికల్ సిటీ కారుగా దీనిని డిజైన్ చేసి నిర్మించారు. ఇది నగరం, చుట్టుపక్కల ప్రయాణించడానికి, రద్దీగా ఉండే పట్టణ ట్రాఫిక్ పరిస్థితుల్లో తనను తాను అమర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సుజుకి హస్ట్లర్ 660సీసీ పెట్రోల్ ఇంజిన్​తో వస్తుంది. ఇది నేచురల్​ ఆస్పిరేటెడ్, టర్బోఛార్జ్డ్ రూపాల్లో లభిస్తుంది. ఈ ఇంజిన్ నేచురల్ ఆస్పిరేషన్ రూపంలో 48బీహెచ్​పీ పవర్, టర్బోఛార్జ్​డ్ వేరియంట్​లో 64 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ట్రాన్స్మిషన్ డ్యూటీ కోసం, హస్ట్లర్ సీవీటీని పొందుతుంది. అయితే మాన్యువల్ గేర్బాక్స్ లేదు. సుజుకీ ఈ కారుకు ఆప్షన్​గా ఏడబ్ల్యూడీ సెటప్​ను అందిస్తుంది.

మరి ఈ సుజుకీ హస్ట్లర్​ ఇండియా లాంచ్​ అవుతుందా? లేదా? కేవలం టెస్ట్​ డ్రైవ్​ కోసమే తీసుకొచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనం