Budget Smart Phones : రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ కూడా సూపరేనండి
Smart Phone Discounts : తక్కువ ధరలో ఫోన్ కొనుక్కోవాలని మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే అందులో ఫీచర్స్‌ను కూడా చూస్తుంటారు. అలాంటి వారి కోసం బడ్జెట్ ఫోన్‌లు ఉన్నాయి. రూ.15 వేలు పెడితే మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి. తక్కువ ధరలో దొరికే ఫోన్ల గురించి చూద్దాం..
ప్రతి వారం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. అయితే తక్కువ ధరలో ఏది కొనాలా అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక మధ్యతరగతి వారికి బడ్జెట్ ధరలో ఫీచర్స్ ఉండాలి. అందుకే రూ .15,000 లోపు టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకు చేశాం. ఇందులో శాంసంగ్, నథింగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్ల పరికరాలు ఉన్నాయి. బడ్జెట్ ధరలో ఫోన్లు ఏవో.. మీకు నచ్చినది ఏదో ఇక్కడ డిసైడ్ చేసుకోండి.
సీఎంఎఫ్ ఫోన్ 1
సీఎంఎఫ్ ఫోన్ 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. అయితే జూలై 12న జరిగిన తొలి సేల్‌లో రూ.1,000 డిస్కౌంట్‌తో ధర రూ.14,999కు తగ్గింది. మొట్టమొదటి సీఎంఎఫ్ ఫోన్ 4 ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనులను నిర్వహించడానికి మాలి జి 615 ఎంసి 2 జీపీయుతో జతచేశారు. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
పోకో ఎం6 ప్లస్
పోకో ఎం6 ప్లస్‌లో 6.79 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి. డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ (450 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్) కలిగి ఉంది. ఇది లేటెస్ట్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎఇ చిప్ సెట్ తో పనిచేస్తుంది. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ లను నిర్వహించడానికి అడ్రినో ఎ 613 జీపీయుతో జతచేశారు.
6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 5,030 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ లో 33వాట్ ఛార్జర్ ను ఉపయోగించి ఫాస్ట్ ఛార్జ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్ 2 ఏళ్ల ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
మోటరోలా జీ64
మోటరోలా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ ధర రూ .14,999, 12 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ ధర రూ .16,999గా నిర్ణయించారు. మోటరోలా జీ64 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీసీ ఎల్ సీడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. బాక్స్ లోపల 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ
4 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉండగా, గెలాక్సీ ఎఫ్15 5జీలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సామోలెడ్ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 15 5జీ మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్ విస్తరణకు మద్దతు ఇస్తుంది.
వివో టీ3ఎక్స్
వివో టీ3ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్మూత్ విజువల్స్ ఉన్నాయి. 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిన టి3ఎక్స్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ఓసితో పనిచేస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజ్‌ను అందించి, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ లో 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.