ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహీంద్రా థార్ రాక్స్ సరికొత్త రికార్డు.. కేవలం బుకింగ్స్ ద్వారానే 31,730 కోట్లు-new record in automobile industry mahindra thar roxx receives booking worth 31730 crore rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహీంద్రా థార్ రాక్స్ సరికొత్త రికార్డు.. కేవలం బుకింగ్స్ ద్వారానే 31,730 కోట్లు

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహీంద్రా థార్ రాక్స్ సరికొత్త రికార్డు.. కేవలం బుకింగ్స్ ద్వారానే 31,730 కోట్లు

Anand Sai HT Telugu Published Oct 07, 2024 01:56 PM IST
Anand Sai HT Telugu
Published Oct 07, 2024 01:56 PM IST

Mahindra Thar Roxx Bookings : మహీంద్రా థార్ రాక్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం బుకింగ్స్ ద్వారానే కోట్ల రూపాయలను సంపాదించింది. నిజానికి ఆటో మెుబైల్ ఇండస్ట్రీలో ఇది సరికొత్త రికార్డుగా చెప్పవచ్చు.

మహీంద్రా థార్ రాక్స్ బుకింగ్స్
మహీంద్రా థార్ రాక్స్ బుకింగ్స్

మహీంద్రా కంపెనీ కార్లకు భారతదేశంలో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా తమ కార్లకు అప్‌డేట్‌లు ఇస్తూ ఉంటుంది ఈ కంపెనీ. ఈ కారణంగానే మహీంద్రా కంపెనీకి చెందిన కార్లు రోజురోజుకు భారీగా అమ్ముడుపోతున్నాయి. కొత్తగా విడుదల చేసిన మహీంద్రా థార్ రాక్స్‌కు కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

మహీంద్రా థార్ రాక్స్ కొద్ది రోజుల క్రితమే బుకింగ్ ప్రారంభించింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. కేవలం 60 నిమిషాల్లోనే 1,76,218 థార్ రాక్స్ ఎస్‌యూవీలను ఆర్డర్ చేశారు. దీంతో మహీంద్రా ఆటోమొబైల్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఇటీవల మహీంద్రా థార్ రాక్స్ 4WD వేరియంట్‌ల ధరను వెల్లడించింది. ఇది ప్రత్యేకంగా డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు టాప్-ఎండ్ 4WD ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 22.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

తాజాగా దీనికి సంబంధించిన బుకింగ్స్ రికార్డు సృష్టించాయి. ఈ బుకింగ్‌లో క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది మహీంద్రా. అదేంటంటే.. కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 1.76 లక్షల బుకింగ్‌లు జరిగి ఆటోమెుబైల్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం బుకింగ్స్ ద్వారానే 31,730 కోట్లు వసూలు అయ్యాయి.

మహీంద్రా థార్ రాక్స్ దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని నిరూపించింది. రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. ఇది వివిధ వేరియంట్లలో, అనేక ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో కూడా దొరుకుతుంది. ఈ SUV శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. 2-లీటర్ టర్బో పెట్రోల్ అండ్ 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఇది 6-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది RWD (రియర్ వీల్ డ్రైవ్), 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీని కలిగి ఉంది. దాదాపు 12.4 నుండి 15.2 కేఎంపీఎల్ మైలేజీని ఇవ్వగలదు.

మహీంద్రా థార్ రాక్స్‌లో ఐదుగురు వ్యక్తులు హాయిగా వెళ్లవచ్చు. సెలవు దినాల్లో ఎక్కువ లగేజీని తీసుకువెళ్లేందుకు 447 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25-అంగుళాల), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్‌తో సహా చాలా ఫీచర్లను కలిగి ఉంది. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)తో సహా వివిధ భద్రతా లక్షణాలతో వస్తుంది.

Whats_app_banner