తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : సిట్రోయెన్​ నుంచి కొత్త ఈవీ- ఈసారైనా ‘సేఫ్టీ’ ఉంటుందా?

Electric car : సిట్రోయెన్​ నుంచి కొత్త ఈవీ- ఈసారైనా ‘సేఫ్టీ’ ఉంటుందా?

Sharath Chitturi HT Telugu

29 October 2024, 13:40 IST

google News
    • Citroen Basalt EV : సిట్రోయెన్​ బసాల్ట్​ ఈవీ లాంచ్​కి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది! టెస్ట్​ డ్రైవ్​లో ఉన్న బసాల్ట్​కి సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చాయి. ఇదే, సిట్రోయెన్​ బసాల్ట్​ ఈవీ అని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇదే సిట్రోయెన్​ బసాల్ట్​ ఈవీ,,!
ఇదే సిట్రోయెన్​ బసాల్ట్​ ఈవీ,,! (Facebook/S G N Murthy)

ఇదే సిట్రోయెన్​ బసాల్ట్​ ఈవీ,,!

ఈ ఏడాది ప్రారంభంలో బసాల్ట్​ కూపే ఎస్​యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది సిట్రోయెన్​ ఇండియా. దీనికి ఎలక్ట్రిక్​ వర్షెన్​ కూడా వస్తుందని ఆ సమయంలోనే ప్రకటించింది. ఇక ఇప్పుడు.. బసాల్ట్​కి సంబంధించిన ఒక వెహికిల్​ టెస్ట్​ డ్రైవ్​ అవతారంలో కనిపించింది. ఇదే సిట్రోయెన్​ బసాల్ట్​ ఈవీ వర్షెన్​ని తెలుస్తోంది. అయితే ఇండియాలో ఇప్పటికే సిట్రోయెన్​ ఈసీ3ని సంస్థ విక్రయిస్తోంది. సేఫ్టీలో దీనికి 0 రేటింగ్​ వచ్చింది. మరి ఈసారైనా ‘సేఫ్టీ’ని సంస్థ పట్టించుకుంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సిట్రోయెన్ బసాల్ట్ ఈవీ: డిజైన్ మార్పులు..

సిట్రోయెన్​ బసాల్ట్​ ఈవీ స్పై షాట్స్​ను బట్టి గ్రిల్ లేని రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ ఉందని, ఎయిర్ డ్యామ్ అప్​డేట్ అయిందని తెలుసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఐసీఈ కార్లలో జరుగుతుంది. ఎందుకంటే ఐసీఈ ఇంజిన్​లను చల్లబరచడానికి, పనిచేయడానికి గాలి అవసరం. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాలకు విడిభాగాలను అప్పుడప్పుడు చల్లబరచడానికి మాత్రమే గాలి అవసరం.

ఇరువైపులా, గాలి ప్రవాహాన్ని మరింత మెరుగుపరచడంలో సహాయపడే కొత్త అల్లాయ్ వీల్స్ లేదా ఏరో వీల్ క్యాప్స్ సిట్రోయెన్​ కొత్త ఎలక్ట్రిక్​ కారులో ఉండవచ్చు. ఛార్జింగ్ పోర్ట్​ను వెనుక, ఎడమ ఫెండర్​లో ఉంచవచ్చు.

ఇది కాకుండా, మిగిలిన కారు అలాగే ఉంటుంది! కాబట్టి, హెడ్ ల్యాంప్ డిజైన్, రాప్ రౌండ్ టెయిల్ ల్యాంప్, డోర్ హ్యాండిల్స్, కూపే లాంటి రూఫ్ లైన్, కారు మొత్తం ప్రొఫైల్ మారదు.

సిట్రోయెన్ బసాల్ట్ ఈవీ: స్పెసిఫికేషన్లు..

ప్రస్తుతం భారతదేశంలో సిట్రోయెన్ విక్రయించే ఏకైక ఎలక్ట్రిక్ వాహనం సిట్రోయెన్ ఈసీ3, ఇందులో 29.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కాబట్టి, బసాల్ట్ ఈవీ సుమారు 35 కిలోవాట్ల పెద్ద బ్యాటరీ ప్యాక్​ని పొందే అవకాశం ఉంది. ఈసీ3 ఏఆర్ఏఐ రేటెడ్ డ్రైవింగ్ రేంజ్ 320 కిలోమీటర్లు. కాబట్టి, పెద్ద బ్యాటరీ ప్యాక్​తో, బసాల్ట్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి.

వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సిట్రోయెన్ బసాల్ట్ ఈవీ: ఫీచర్లు..

ఐసీఈ ఆధారిత బసాల్ట్​ కూపే ఎస్​యూవీలోని చాలా ఫీచర్లను బసాల్ట్ ఈవీకి తీసుకెళ్తారు. కాబట్టి, ఇది డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్​తో వస్తుందని ఆశించొచ్చు. కానీ బ్యాటరీ ఛార్జ్, రెజెన్, రేంజ్ వంటి ఈవి సంబంధిత సమాచారాన్ని చూపించడానికి మార్పులు చేయొచ్చు.

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరి సేఫ్టీ పరిస్థితేంటి..?

ఈ ఏడాది తొలినాళ్లల్లో ఈ సిట్రోయెన్​ ఈసీ3 ఎలక్ట్రిక్​ హ్యాచ్​బ్యాక్​పై గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ జరిగింది. ఇందులో పలు షాకింగ్​ ఫలితాలు వెలువడ్డాయి. అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​ విభంగాలో ఈ సిట్రోయెన్​ ఈవీకి 0 రేటింగ్​ లభించింది. చైల్డ్​ ఆక్యుపెంట్​ సేఫ్టీలో 1 స్టార్​ దక్కింది! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అయితే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్​సీఏపీ) కింద పరీక్షించిన సిట్రోయెన్​ బసాల్ట్​ ఐసీఈ ఇంజిన్​ వర్షెన్​.. క్రాష్ టెస్ట్​లో 4 స్టార్​ రేటింగ్​ని సాధించింది. అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​లో 32 పాయింట్లకు గాను బసాల్ట్ 26.19 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​లో 49 పాయింట్లకు గాను 35.90 పాయింట్లు సాధించింది. ఐసీఈ ఇంజిన్​లోని సేఫ్టీ ఫీచర్స్​ ఈవీ వర్షెన్​లోనూ ఉంటే, సేఫ్టీ పరంగా ఇదే రిపీట్​ అయ్యే అవకాశం ఉంది. 

తదుపరి వ్యాసం