Citroen Basalt : సిట్రోయెన్ బసాల్ట్ కొంటున్నారా? ఈ కూపే ఎస్యూవీ సేఫ్టీ రేటింగ్ చెక్ చేశారా?
Citroen Basalt safety rating : సరికొత్త సిట్రోయెన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరి ఈ సిట్రోయెన్ బసాల్ట్ సేఫ్టీ రేటింగ్ ఎంతో తెలుసా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయిన సిట్రోయెన్ బసాల్ట్ ఎస్యూవీ కూపేని కొనాలని చూస్తున్నారా? అయితే.. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఎంత సేఫ్టీ రేటింగ్ సాధించిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సిట్రోయెన్ బసాల్ట్ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ రిజల్ట్..
భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్సీఏపీ) కింద పరీక్షించిన సిట్రోయెన్ బసాల్ట్ క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్‌ని సాధించింది. అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్‌లో 32 పాయింట్లకు గాను బసాల్ట్ 26.19 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు గాను 35.90 పాయింట్లు సాధించింది.
టాప్-స్పెక్ టర్బో మ్యాక్స్ వేరియంట్‌ని ఆగస్టు నెలలో క్రాష్ టెస్టులు నిర్వహించారు. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి.
ఫ్రంటల్ ఆఫ్ సెట్ డిఫార్మెబుల్ బారియర్ టెస్ట్‌లో సిట్రోయెన్ బసాల్ట్ 16కు 10.19 పాయింట్లు సాధించింది. ఈ పరీక్షలో డ్రైవర్ ముందు ప్రయాణికుడి తల, మెడకు రక్షణ "గుడ్" అని తేలింది. డ్రైవర్ ఛాతీ, తొడలకు "స్వల్ప" రక్షణను లభించింది. మరోవైపు, ముందు ప్రయాణికుడు ఛాతీకి "సరిపడా" రక్షణ, తొడలకు స్వల్ప రక్షణను చూపించింది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, కొత్త సిట్రోయెన్ బసాల్ట్ సైడ్ మూవెబుల్ డిఫార్మెబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 16 పాయింట్లు సాధించింది.
చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్‌కు సంబంధించి, బసాల్ట్ 18 నెలల పిల్లాడు, మూడు సంవత్సరాల పిల్లాడి రక్షణ రెండింటికీ చైల్డ్ కంట్రోల్ సిస్టమ్‌లను ఉపయోగించడం ద్వారా డైనమిక్ స్కోర్‌లో 24 పాయింట్లకు 19.90 పాయింట్లు సాధించింది.
సిట్రోయెన్ బసాల్ట్ సేఫ్టీ..
ఈ కూపే ఎస్‌యూవీలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్పీ, హిల్ హోల్డ్, ఐసోఫిక్స్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్లు, పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ఉన్నాయి.
సిట్రోయెన్ బసాల్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు..
సిట్రోయెన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ మోటార్ 80బీహెచ్పీ పవర్, 115ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లోయర్ వేరియంట్లలో ఉంటుంది. ఇక హై ఎండ్ వేరియంట్లలో 1.2-లీటర్ 3 సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్త వస్తుంది. ఇది 109 బీహెచ్పీ, 190 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
సిట్రోయెన్ బసాల్ట్ ఫీచర్లు..
కొత్త సిట్రోయెన్ బసాల్ట్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్స్, రేర్ ఏసీ వెంట్స్, రెండో వరుసలో ఉన్నవారికి అడ్జెస్టెబుల్ థై సపోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కూడా ఇందులో ఉంది.
సంబంధిత కథనం