Dacia Bigster : ఎల్​పీజీతో నడిచే ఈ ఎస్​యూవీని చూశారా? రేంజ్​ 1,450 కి.మీలు..-renault duster based dacia bigster unveiled check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dacia Bigster : ఎల్​పీజీతో నడిచే ఈ ఎస్​యూవీని చూశారా? రేంజ్​ 1,450 కి.మీలు..

Dacia Bigster : ఎల్​పీజీతో నడిచే ఈ ఎస్​యూవీని చూశారా? రేంజ్​ 1,450 కి.మీలు..

Sharath Chitturi HT Telugu
Oct 11, 2024 05:57 AM IST

Renault Duster 2024 : రెనాల్ట్​ డస్టర్​ సరికొత్త అవతారంలో ప్రపంచం ముందుకు వచ్చింది. రెనాల్ట్​ బడ్జెట్​ ప్రాండ్​ డాసియా.. బిగ్​స్టర్​ పేరుతో 7 సీటర్​ ఎస్​యూవీని ఆవిష్కరించింది. ఈ వెహికిల్​ ఎల్​పీజీతో కూడా నడుస్తోంది. రేంజ్​ 1,450 కి.మీలు! పూర్తి వివరాల్లోకి వెళితే..

రెనాల్ట్​ డస్టర్​ ఆధారిత డాసియా బిగ్​స్టర్​,,
రెనాల్ట్​ డస్టర్​ ఆధారిత డాసియా బిగ్​స్టర్​,,

రెనాల్ట్​ డస్ట్​ర్​తో భారతీయులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియాలోకి వచ్చిన తొలి తరం ఎస్​యూవీల్లో ఈ డస్టర్​ ఒకటి. కానీ పోటీ తీవ్రమై, సేల్స్​ పడిపోవడంతో ఈ మోడల్​ని సంస్థ డిస్కంటిన్యూ చేసింది. కాగా రెనాల్ట్​ డస్టర్​ని సరికొత్త అవతారంలో తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఎస్​యూవీపై మరో కీలక అప్డేట్​ బయటకు వచ్చింది. రెనాల్ట్​కి చెందిన బడ్జెట్​ బ్రాండ్​ డాసియా.. “బిగ్​స్టర్​” పేరుతో సరికొత్త డస్టర్​ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ బిగ్​స్టర్ ఎస్​యూవీ 7-సీటర్ వర్షెన్. ఈ బిగ్​స్టర్ వర్షెన్ భవిష్యత్తులో భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. భారతదేశంలో గతంలో అమ్మకానికి ఉన్న రెనాల్ట్​ డస్టర్​ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

బిగ్​స్టర్ పొడవు 4.57 మీటర్లు. వెడల్పు 1.81 మీటర్లు. ఎత్తు 1.71 మీటర్లు. వీల్​బేస్ 2.7 మీటర్లు. డస్టర్ కంటే డాసియా బిగ్​స్టర్​ 230 ఎంఎం పొడవు ఎక్కువ. వీల్ బేస్ 43 ఎంఎం ఎక్కువ.

డాసియా బిగ్​స్టర్​: స్పెసిఫికేషన్లు..

డాసియా బిగ్ స్టర్​ని మూడు ఇంజిన్​ ఆప్షన్లతో సంస్థ అందిస్తోంది. ఇందులో మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, ఎల్​పీజీ ఉన్నాయి. మైల్డ్-హైబ్రిడ్ బిగ్​స్టర్​ ఎస్​యూవీలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్​ ఉంది. ఇది 140 హార్స్​పవర్​ని అందిస్తుంది, 48 వీ సిస్టమ్​ని కలిగి ఉంది. ఈ ఇంజిన్​ 6-స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. అదనంగా, ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇందులో స్నో, మడ్ / శాండ్, ఆఫ్-రోడ్, నార్మల్, ఎకో, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి వివిధ డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. మరో ఇంజిన్ ఆప్షన్​ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్. ఇది మైల్డ్-హైబ్రిడ్ సహాయంతో ఎల్​పీజీ, పెట్రోల్ రెండింటితో పనిచేస్తుంది. ఇది 140 హార్స్​ పవర్​ని ఉత్పత్తి చేస్తుంది. డాసియా ప్రకారం, బిగ్​స్టర్​ ఎల్​పీజీలో​ 50-లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 49-లీటర్ ఎల్​పీజీ ట్యాంక్​ ఉండటంతో రీఫ్యూయెలింగ్​కి ముందు ఏకంగా 1,450 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది.

హైబ్రిడ్ కాన్ఫిగరేషన్ లో, 107-హార్స్ పవర్, 4 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 1.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మద్దతుతో 50 హార్స్ పవర్​ను ఉత్పత్తి చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి 155 హార్స్ పవర్​కు చేరుకుంటుంది. పెట్రోల్ ఇంజిన్ కోసం 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​, ఎలక్ట్రిక్ మోటార్ కోసం 2-స్పీడ్ ట్రాన్స్​మిషన్​ ద్వారా ఈ పవర్​ ముందు చక్రాలకు వెళుతుంది.

డాసియా బిగ్​స్టర్​: డిజైన్

డిజైన్​ పరంగా.. 2021లో ప్రదర్శించిన కాన్సెప్​లో కనిపించే చాలా డిజైన్ అంశాలను డాసియా బిగ్​స్టర్​ ఎస్​యూవీ నిలుపుకోగలిగింది. ఇది బుచ్ డిజైన్, ఫ్లాట్ బానెట్, వీల్​ఆర్చ్​లను పొందుతుంది. హెడ్ ల్యాంప్స్​తో పాటు టెయిల్ ల్యాంప్స్ వద్ద, క్యాబిన్​లో కూడా వై-యాక్సెంట్స్ ఉన్నాయి.

డాసియా డస్టర్: ఫీచర్లు..

డాసియా డస్టర్ 7 లేదా 10 ఇంచ్​ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​తో వస్తుంది. 10.1 ఇంచ్ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్,​ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్​గేట్, వైర్లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం