Tata Curvv vs Citroen Basalt : టాటా కర్వ్​ వర్సెస్​ సిట్రోయెన్​ బసాల్ట్​.. ఏ కూపే ఎస్​యూవీ బెస్ట్​?-tata curvv vs citroen basalt which coupe suv costs how much ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Curvv Vs Citroen Basalt : టాటా కర్వ్​ వర్సెస్​ సిట్రోయెన్​ బసాల్ట్​.. ఏ కూపే ఎస్​యూవీ బెస్ట్​?

Tata Curvv vs Citroen Basalt : టాటా కర్వ్​ వర్సెస్​ సిట్రోయెన్​ బసాల్ట్​.. ఏ కూపే ఎస్​యూవీ బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Sep 03, 2024 10:15 AM IST

Tata Curvv petrol : టాటా కర్వ్​ వర్సెస్​ సిట్రోయెన్​ బసాల్ట్​ కూపే ఎస్​యూవీ.. ఏది వాల్యూ ఫర్​ మనీ? ఏది తక్కువ ధర? ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి.

టాటా కర్వ్​ వర్సెస్​ సిట్రోయెన్​ బసాల్ట్​ కూపే ఎస్​యూవీ
టాటా కర్వ్​ వర్సెస్​ సిట్రోయెన్​ బసాల్ట్​ కూపే ఎస్​యూవీ

టాటా మోటార్స్, సిట్రోయెన్ అకస్మాత్తుగా తమ కూపే ఎస్​యూవీలను ప్రవేశపెట్టడం ద్వారా భారత మార్కెట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా కర్వ్​తో తాజాగా మార్కెట్​లోకి అడుగుపెట్టగా, ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రోయెన్ బసాల్ట్​ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు లగ్జరీ కార్ల విభాగ పరిమితమైన కూపే ఎస్​యూవీ సెగ్మెంట్​.. టాటా కర్వ్- సిట్రోయెన్ బసాల్ట్ వల్ల మాస్-మార్కెట్ వినియోగదారులకు మంచి ఆప్షన్స్​గా మారనున్నాయి.

టాటా కర్వ్​ ఈవీ ఆగస్ట్​లో లాంచ్​ అయిన విషయం తెలిసిందే. ఇక టాటా కర్వ్ ఐసీఈ వేరియంట్ ధరను సెప్టెంబర్ 2న వాహన తయారీ సంస్థ ప్రకటించింది. మరోవైపు, సిట్రోయెన్ బసాల్ట్ ఆగస్టు 9 న మాస్-మార్కెట్ ఐసీఈ-పవర్డ్ కూపే ఎస్​యూవీని విడుదల చేసిన భారతదేశంలో మొదటి కార్ల తయారీదారుగా ప్రయోజనాన్ని పొందింది.

ఈ నేపథ్యంలో ఈ రెండు కూపే ఎస్​యూవీలను పోల్చి వత్యాసాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా కర్వ్ వర్సెస్ సిట్రోయెన్ బసాల్ట్: ధర..

టాటా కర్వ్ ధర 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 17.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ ధర అక్టోబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు, సిట్రోయెన్ బసాల్ట్ ధర రూ .7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ .13.62 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

టాటా కర్వ్ వర్సెస్ సిట్రోయెన్ బసాల్ట్: డైమెన్షన్స్​..

టాటా కర్వ్ పొడవు 4,308 ఎంఎం, వెడల్పు 1,810 ఎంఎం. ఈ ఎస్​యూవీ పొడవు 1,630 ఎంఎం- వీల్ బేస్ 2,560 ఎంఎం. టాటా కర్వ్​లో 500-లీటర్ల సామర్థ్యం గల బూట్ స్టోరేజ్, 44-లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. ఇది 18 ఇంచ్​ వీల్స్​తో నడుస్తుంది.

మరోవైపు, సిట్రోయెన్ బసాల్ట్ పొడవు 4,352 ఎంఎం, వెడల్పు 1,765 ఎంఎం. దీని ఎత్తు 1,593 ఎంఎం, వీల్ బేస్ 2,651 ఎంఎంగా ఉంది. ఇది 16 ఇంచ్​ చక్రాలతో నడుస్తుంది. బసాల్ట్​లో 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 470 లీటర్ల బూట్ స్టోరేజ్ ఉన్నాయి.

టాటా కర్వ్ సిట్రోయెన్ బసాల్ట్ కంటే 45 ఎంఎం వెడల్పు- 37 ఎంఎం ఎత్తుగా ఉండగా, ఫ్రెంచ్ కూపే ఎస్​యూవీ మొత్తం మీద 44 ఎంఎం పొడవు- 91 ఎంఎం పొడవైన వీల్​బేస్​ను కలిగి ఉంది. రెండు కూపే ఎస్​యూవీలు ఒకే పరిమాణంలో ఇంధన ట్యాంకులను కలిగి ఉన్నాయి. అయితే టాటా కూపే ఎస్​యూవీ బూట్ స్పేస్- వీల్ సైజుల పరంగా ఎడ్జ్​ను కలిగి ఉంది.

టాటా కర్వ్ వర్సెస్ సిట్రోయెన్ బసాల్ట్: ఇంజిన్​..

టాటా కర్వ్ కూపే ఎస్​యూవీ రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. కర్వ్​లోని 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ 118బీహెచ్​పీ పవర్, 170ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ - 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ యూనిట్​తో లభిస్తుంది. మరొక పెట్రోల్ మోటార్ 1.2-లీటర్ హైపరియన్ యూనిట్. ఇది కూడా అదే గేర్ బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజిన్ 123బీహెచ్​పీ పవర్- 225ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా కర్వ్​లో డీజిల్ ఇంజన్ కూడా లభిస్తుంది. ఇది అదే గేర్ బాక్స్ ఆప్షన్స్​తో వస్తుంది.

సిట్రోయెన్ బసాల్ట్ రెండు పెట్రోల్ మోటారు ఆప్షన్స్​తో లభిస్తుంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, టర్బోఛార్జ్డ్ యూనిట్. బసాల్ట్ 1.2-లీటర్ ఎన్​ఏ ఇంజిన్​ని పొందుతుంది. ఇది 80 బీహెచ్​పీ పీక్​ పవర్​, 115 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్​తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ మోటారు 1.2-లీటర్ ఇంజిన్, ఇది 6రు-స్పీడ్ మాన్యువల్- ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్లతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 108బీహెచ్​పీ పవర్ - 205ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా కర్వ్​- సిట్రోయెన్ బసాల్ట్ కంటే ఎడ్​తో వస్తుంది. ఎందుకంటే ఇది విస్తృతమైన ఇంజిన్ ఆప్షన్స్​తో లభిస్తుంది. అన్ని ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్స్​తో వస్తాయి.

సంబంధిత కథనం