Electric Car : ఎలక్ట్రిక్ కారు కొనే ముందు ఈ 4 విషయాలు చూడండి.. లేదంటే తర్వాత బాధపడుతారు
30 October 2024, 9:30 IST
- Electric Car Buying Tips : ఎలక్ట్రిక్ కార్లకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కొన్ని విషయాలు చూసిన తర్వాత ఈవీని కొంటే మంచిది.
ఎలక్ట్రిక్ కారు కొనేందుకు చిట్కాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కూడా కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. మీ కొత్త ఈవీ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే కొన్ని విషయాలు పరిశీలంచాలి. ముందుగా ఈ విషయాలు డిసైడ్ అయిన తర్వాతే షోరూమ్ వెళ్లండి..
బడ్జెట్ చెక్ చేయండి
కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు ముందుగా మీ బడ్జెట్‌ను చూసుకోండి. కారును కొనుగోలు చేసేటప్పుడు అదే మొత్తాన్ని ఖర్చు చేయండి లేదా డౌన్ పేమెంట్ ఇవ్వడం ద్వారా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోండి. దీనిద్వారా ఇతర ముఖ్యమైన ఖర్చులు ప్రభావితం అవ్వకుండా ఉంటాయి. చాలా సార్లు అనేక మంది ముందస్తు ఆలోచన లేకుండా కారు లోన్ తీసుకుంటారు. దీని కారణంగా భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కొంటారు.
మోడల్ సెలక్ట్ చేసుకోండి
బడ్జెట్‌ను నిర్ణయించిన తర్వాత కొత్త కారు ఏది కొనాలో డిసైడ్ చేసుకోవాలి. మీకు సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ కారు కావాలంటే ఎలక్ట్రిక్ సెడాన్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అన్ని రకాల రోడ్లపై నడిపేందుకు చాలా బాగుంటుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ లేదా హ్యాచ్‌బ్యాక్‌ని ఎంచుకోవచ్చు.
రేంజ్ చూడండి
మీ బడ్జెట్‌ని నిర్ణయించిన తర్వాత వివిధ వాహనాలను చూడాలి. బడ్జెట్‌లో అత్యుత్తమ శ్రేణి, ఫీచర్లతో మీరు కొనే ఎలక్ట్రిక్ కారును ఎంచుకోండి. డీలర్‌షిప్ దగ్గరకు వెళ్తే.. అనేక స్కీములు మిమ్మల్ని టెంప్ట్ చేసేలా ఉంటాయి. అయితే మీ ఇష్టప్రకారం ఈవీని ఎంచుకోండి. మీ అవసరాలకు అనుగుణంగా రేంజ్ అధికంగా ఇచ్చే కారు కొనండి. తక్కువ రేంజ్ ఇచ్చే కారుతో భవిష్యత్తులో ఇబ్బందుల ఎదుర్కోవలసి ఉంటుంది.
ఛార్జింగ్ సౌకర్యం
కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం కంటే మెరుగైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందించడం చాలా కష్టం. మీ ఇంటికి సమీపంలో ఛార్జింగ్ స్టేషన్ ఉంటే, అది చాలా బాగుంటుంది. అయితే ఇది కూడా డబ్బు సమస్యను సృష్టిస్తుంది. మీరు ప్రతిరోజూ కారును బయట ఛార్జ్ చేస్తే ఖరీదు అవుతుంది. నిరంతర ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బ్యాటరీ ప్యాక్‌ను త్వరగా దెబ్బతీస్తుంది. ఇది కాకుండా ఇంట్లో ఛార్జర్‌ను ఇన్‌స్టాల్ చేయించండి. అన్ని విధాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది.