Car sales in April 2023 : అదిరిన కియా మోటార్స్ కార్ సేల్స్ డేటా- మారుతీ సుజుకీ కూడా!
01 May 2023, 13:46 IST
- Car sales in April 2023 : మారుతీ సుజుకీ, కియా మోటార్స్‌లు ఏప్రిల్ నెలకు సంబంధించిన కార్ సేల్స్ డేటాను ప్రకటించాయి. ఆ వివరాలు..
అదిరిన కియా మోటార్స్ కార్ సేల్స్ డేటా- మారుతీ సుజుకీ కూడా!
Maruti Suzuki car sales data in April 2023 : ఎఫ్వై24 తొలి నెల అయిన ఏప్రిల్‌కు సంబంధించిన కార్ సేల్స్ డేటాను ప్రకటించింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. ఏప్రిల్‌లో మొత్తం మీద 1,60,529 యూనిట్లను విక్రయించింది. 2022 ఏప్రిల్‌లో ఈ నెంబర్ 1,50,661గా ఉండేది. ఈ 1,60,529 యూనిట్లలో 1,39,519 కార్లను దేశీయం విక్రయించగా.. 4,039 ఓవీఎంలు, 16,971 ఎగుమతులు ఉన్నాయి. ఈ మేరకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతీ సుజుకీ పేర్కొంది.
సెమీకండక్టర్ చిప్స్ కొరత గత నెల కూడా మారుతీ సుజుకీని వెంటాడింది! ఫలితంగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. అయితే.. ఈ ప్రభావం తక్కువగా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు ఆటోమొబైల్ సంస్థ చెప్పింది.
Maruti Suzuki sales in April : మారుతీ సుజుకీ సేల్స్‌లో చిన్న కార్ల హవా మరింత తగ్గినట్టు కనిపిస్తోంది. ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో వంటి కార్లు.. 2022 ఏప్రిల్‌లో 17,137 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈసారి కేవలం 14,110 మాత్రమే సేల్ అయ్యాయి. అయితే యుటిలిటీ వెహికిల్స్ అంచనాలకు మించి రాణిస్తుండటం సంస్థకు కలిసి వస్తోంది. మిని- కాంపాక్ట్ సెగ్మెంట్లో ఈసారి 90,062 వెహికిల్స్ అమ్ముడుపోయాయి. గతేడాది ఈ నెంబర్ 76,900గా ఉండేది.
మారుతీ సుజుకీ సైతం మార్కెట్లో ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే బ్రెజా, గ్రాండ్ విటారాలను ప్రమోట్ చేస్తోంది. ఇక కొత్త ఫ్రాంక్స్‌ను లాంచ్ చేసింది. ఈ వెహికిల్‌కి ఇప్పటికే మంచి ఆర్డర్ బుక్ ఉంది. రానున్న కాలంలో ఈ నెంబర్లు యాడ్ అవుతాయి. పైగా బలెనో, బ్రెజా నుంచి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వరకు వాహనాలను సంస్థ అప్డేట్ కూడా చేసింది. ఫలితంగా మంచి బజ్ నడుస్తోంది.
ఇదీ చూడండి:- Upcoming cars in May 2023 : మే నెలలో లాంచ్ అవుతున్న కార్లు ఇవే..!
కియా క్రేజీ డేటా..!
Kia motors car sales data in April 2023 : ఎప్పటిలాగానే ఈసారి కూడా కియా మోటార్స్ దుమ్మురేపింది. ఏప్రిల్‌లో సంస్థ విక్రయాలు 22శాతం పెరిగాయి! గత నెలలో 23,216 యూనిట్లను విక్రయించినట్టు ప్రకటించింది కియా. సోనెట్, సెల్టోస్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోందని చెప్పింది. సంస్థ సేల్స్‌కు సంబంధించి ఈ రెండు కలిపే సగానికిపైగా ఎక్కువ అమ్ముడుపోయాయని స్పష్టం చేసింది. సోనెట్ 9,744 యూనిట్లు అమ్ముడుపోయాయి. సెల్టోస్‌కు సంబంధించి 7,214 యూనిట్లను విక్రయించింది కియా మోటార్స్. మూడో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న క్యారెన్స్ వాహనాలు 6,107 అమ్ముడుపోయాయి. దేశంలో ఉన్న 3 రో వెహికిల్ మోడల్స్‌లో ఇది అత్యధికం!
దేశంలో 7లక్షల సేల్స్ మార్క్‌ను అందుకున్నట్టు కియా ప్రకటించింది.
Kia motors sales in April : "నాలుగేళ్ల కన్నా తక్కువ సమయంలో.. లీడింగ్ ప్రీమియం ఆటోమోటివ్ కంపెనీగా ఎదగడమే కాకుండా, న్యూ ఏజ్ బ్రాండ్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాము. 7లక్షలకుపైగా కస్టమర్ల నమ్మకం మాకు ఇప్పుడు ఉంది. క్వాలిటీ సర్వీస్, స్ఫూర్తిదాయకమైన ఇన్నోవేషన్స్‌ను చేస్తూ ఉండేందుకు మేము నిత్యం కృషిచేస్తామని," అని కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.