తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Sonet Facelift : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చేస్తోంది!

Kia Sonet facelift : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu

08 April 2023, 13:36 IST

google News
    • 2024 Kia Sonet launch : కియా మోటార్స్​కు చెందిన కియా సోనెట్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. ఈ ఏడాది చివర్లో ఈ మోడల్​ను సంస్థ అధికారికంగా లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది.
కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చేస్తోంది..!
కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చేస్తోంది..!

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చేస్తోంది..!

Kia Sonet facelift launch : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో కియా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​​ మోడల్​గా ఉంది సోనెట్​. ఈ వెహికిల్​కి మంచి డిమాండ్​ ఉంది. ఇక ఇప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు సన్నద్ధమవుతున్న కియా మోటార్స్​.. సోనెట్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. 2024 కియా సోనెట్​పై గత కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు.. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ 2023 చివర్లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. 2024 తొలినాళ్లల్లో ఇది ఇండియాలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​- ఇంజిన్​

2024 కియా సోనెట్​ గ్రిల్​కు పియానో బ్లాక్​ ఫినిష్​, నారో హెడ్​లైడ్స్​, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఫాంగ్​ ల్యాంప్​తో కూడిన బంపర్​ను మరింత అట్రాక్టివ్​గా మార్చే అవకాశం ఉంది. రూఫ్​ రెయిల్స్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, 16- ఇంచ్​ అలాయ్​ వీల్స్​ లభించొచ్చు.

2024 Kia Sonet launch date : ఇక కియా సోనెట్​ ఫస్​లిఫ్ట్​ వర్షెన్​లో 1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 82 హెచ్​పీ పవర్​ను, 114 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ 118.3 హెచ్​పీ పవర్​ను, 172 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.5 లీటర్​ 4 సిలిండర్​ డీజిల్​ మోటార్​.. 114.4 హెచ్​పీ పవర్​ను, 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

2024 కియా సోనెట్​- ఫీచర్స్​..

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ 5 సీటర్​ కేబిన్​లో అప్డేటెడ్​ డాష్​బోర్డ్​ కనిపించనుంది. రివైజ్డ్​ సెంట్రల్​ కన్సోల్​, ఆటో క్లైమేట్​ కంట్రోల్​, పార్కింగ్​ సెన్సార్స్​, యూఎస్​బీ ఛార్జర్స్​, వెంటిలేటెడ్​ సీట్స్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​ కనిపించొచ్చు.

Kia Sonet facelift 2023 : ఇక 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ కన్సోల్​ ఉంటుందని తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లేని సపోర్ట్​ చేస్తుంది.

ఇక సేఫ్టీ విషయానికొస్తే.. 6 ఎయిర్​బ్యాగ్స్​, ట్రాక్షన్​ కంట్రోల్​, రేర్​- వ్యూ కెమెరా వంటి ఫీచర్స్​ లభించనున్నాయి.

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​- ధర..

Kia Sonet on road price in Hyderabad : 2024 కియా సోనెట్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. రానున్న కాలంలో కియా వీటిని రివీల్​ చేసే అవకాశం ఉంది. కాగా.. ఇండియాలో ప్రస్తుతం.. కియా సోనెట్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.79లక్షలుగా ఉంది.

లాంచ్​ తర్వాత.. ఈ అప్డేటెడ్​ కియా సోనెట్​ నిస్సాన్​ మాగ్నైట్​, టాటా నెక్సాన్​, మహీంద్రా ఎక్స్​యూవీ300, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ వెన్యూ వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం