Brezza CNG vs Brezza petrol : బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ పెట్రోల్​ వేరియంట్​.. ఏది కొంటే బెటర్​?-brezza cng vs brezza petrol check price mileage and detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Brezza Cng Vs Brezza Petrol : బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ పెట్రోల్​ వేరియంట్​.. ఏది కొంటే బెటర్​?

Brezza CNG vs Brezza petrol : బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ పెట్రోల్​ వేరియంట్​.. ఏది కొంటే బెటర్​?

Sharath Chitturi HT Telugu
Mar 22, 2023 02:03 PM IST

Brezza CNG vs Brezza petrol : మారుతీ సుజుకీ బ్రెజాలో ఇప్పుడు పెట్రోల్​, సీఎన్​జీ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ ఓసారి పోల్చి.. ఏది కొంటే బెటర్​ అన్నది తెలుసుకుందాము.

బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ పెట్రోల్​ వేరియంట్​.. ది బెస్ట్​ ఏది?
బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ పెట్రోల్​ వేరియంట్​.. ది బెస్ట్​ ఏది? (Maruti Suzuki)

Brezza CNG vs Brezza petrol : దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలతో పాటు సీఎన్​జీ మోడల్స్​పైనా దృష్టిపెట్టాయి ఆటోమొబైల్​ సంస్థలు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక మోడల్స్​ మార్కెట్​లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయంలో దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ ముందువరుసలో ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఏకంగా 14 సీఎన్​జీ మోడల్స్​ మార్కెట్​లో లాంచ్​ అయ్యాయి. బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​ బ్రెజా​కు కూడా సీఎన్​జీ వర్షెన్​ను ఇటీవలే తీసుకొచ్చింది మారుతీ సుజుకీ. బ్రెజా​ పెట్రోల్​- సీఎన్​జీ వేరియంట్లలో ఏది తీసుకోవాలి? అని కస్టమర్లు ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి చూసి, ఏది కొంటే బెటర్​ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ పెట్రోల్​ వేరియంట్​- ధర..

Maruti Suzuki Brezza on road price Hyderabad : మారుతీ సుజుకీ బ్రెజా​ అప్డేటెడ్​ వర్షెన్​ 2022 జూన్​లో లాంచ్​ అయ్యింది. ఇది మరింత బోల్డ్​గా, మరింత స్టైలిష్​గా ఉంది. అప్డేటెడ్​ వర్షెన్​కు మంచి డిమాండ్​కు లభిస్తోంది. లాంచ్​ సమయంలో దీని ఎక్స్​షోరూం ధర రూ. 8లక్షలు- రూ. 14లక్షల వరకు ఉంది. మేన్యువల్​లో టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.46లక్షలు. కాగా.. బ్రెజాపై పలుమార్లు ప్రైజ్​ హైక్​ తీసుకుంది మారుతీ సుజుకీ.

ఇక మారుతీ సుజుకీ బ్రెజా ఇటీవలే బయటకొచ్చింది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 9.14లక్షలు. టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.05లక్షలుగా ఉంది. ఇవన్నీ మేన్యువల్​ వేరియంట్​లే.

బ్రెజా​ సీఎన్​జీ వేరియంట్స్​- ఎక్స్​షోరూం ధరలు

Maruti Suzuki Brezza CNG on road price : ఎల్​ఎక్స్​ఐ సీఎన్​జీ ఎంటీ- రూ. 9.14లక్షలు

ఎల్​ఎక్స్​ఐ ఎంటీ- రూ. 8.19లక్షలు

వీఎక్స్​ఐ సీఎన్​జీ ఎంటీ- రూ. 10.49లక్షలు

వీఎక్స్​ఐ ఎంటీ - రూ. 9.54లక్షలు

జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ ఎంటీ రూ. 11.89లక్షలు

జెడ్​ఎక్స్​ఐ ఎంటీ - రూ. 10.95లక్షలు

జెడ్​ఎక్స్​ఐ డ్యూయెల్​ టోన్​ సీఎన్​జీ ఎంటీ- రూ. 12.05లక్షలు

జెడ్​ఎక్స్​ఐ డ్యూయెల్​ టోన్​ ఎంటీ- రూ. 11.11లక్షలు

మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్​జీ వర్సెస్​ పెట్రోల్​ వేరియంట్​- మైలేజ్​..

Maruti Suzuki Brezza CNG price : మారుతీ సుజుకీ బ్రెజా పెట్రోల్​ మేన్యువల్​ వేరియంట్​.. లీటరుకు 20.15 కి.మీల మైలేజ్​ ఇస్తోంది. అంటే నెలకు 1000 కి.మీల ప్రయాణం చేసేవారు 50లీటర్ల పెట్రోల్​ కొట్టించాలి. ప్రస్తుతం హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 109.66. అంటే.. నెలకు సుమారు రూ. 5,500 ఖర్చు అవుతుంది. ఇక బ్రెజా సీఎన్​జీ మోడల్​.. కిలో ఫ్యూయెల్​కు 25.50 కి.మీలు ప్రయాణిస్తుంది. హైదరాబాద్​లో సీఎన్​జీ ధర రూ. 97గా ఉంది. అంటే.. రూ. 4,850 ఖర్చు అవుతుంది. అయితే.. సీఎన్​జీ వాహనాలు కాస్ట్​ ఎఫెక్టివ్​ అని అంటుంటారు. వాహనాలను నడిపే కొద్ది.. కాస్ట్​ ఎకనామిక్స్​ తగ్గుతుంటాయి.

* పైన చెప్పిన మైలేజ్​.. కంపెనీ వెల్లడించినది. భారత రోడ్ల మీద మైలేజ్​లో మార్పులు ఉంటాయన్న విషయం గమనించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం