Maruti Brezza CNG vs Grand Vitara CNG : ఈ రెండు సీఎన్జీ కార్లలో ఏది బెటర్?
23 March 2023, 16:43 IST
Maruti Brezza CNG vs Grand Vitara CNG : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ, బ్రెజ్ సీఎన్జీల్లో ఏది కొనాలో మీకు అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే..
మారుతీ బ్రెజా సీఎన్జీ వర్సెస్ గ్రాండ్ విటారా సీఎన్జీ.. ఏది బెటర్?
Maruti Brezza CNG vs Grand Vitara CNG : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. సీఎన్జీ లాంచ్‌లతో దూసుకెళుతోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే 10కిపైగా సీఎన్జీ మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సీఎన్జీ సెగ్మెంట్లో మారుతీ సుజుకీ లాంచ్ చేసిన గ్రాండ్ విటారా మోడల్.. తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. ఇక తొలి సీఎన్జీ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీగా మారుతీ బ్రెజా నిలిచింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీని మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ మోడల్‌తో పోల్చి.. ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీ వర్సెస్ గ్రాండ్ విటారా సీఎన్జీ- ఇంజిన్..
Maruti Brezza CNG on road price in Hyderabad : మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88పీఎస్ పవర్‌ను, 121.5 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ ఎంటీ గేర్‌బాక్స్ ఉంటుంది.
Maruti Grand Vitara CNG on road price Hyderabad : ఇక మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీలో 1.5 లీటర్ మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 87.83 పీఎస్ పవర్‌ను, 121.5 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ ఎంటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది.
మారుతీ బ్రెజా సీఎన్జీ కేజీకి 25.52 కి.మీల మైలేజ్ ఇస్తుండగా.. మారుతీ గ్రాండ్ విటారా కేజీ ఫ్యూయెల్‌తో 26.6 కి.మీల దూరం ప్రయాణిస్తుంది (ఇవి కంపెనీ చెప్పిన లెక్కలు. వాస్తవంలో మైలేజ్ మారే అవకాశం ఉంటుంది.)
మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీ వర్సెస్ గ్రాండ్ విటారా సీఎన్జీ- ఫీచర్స్..
Maruti Brezza CNG price : ఈ రెండు సీఎన్జీ మోడల్స్‌లోనూ 9 ఇంచ్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, క్రూజ్ కంట్రోల్, ఆటోమెటిక్ ఎయిర్ కండీషనింగ్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. బ్రెజ్ సీఎన్జీ టాప్ ఎండ్ మోడల్లో డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్‌తో పాటు సింగిల్ పేన్ సన్‌రూఫ్ కూడా లభిస్తోంది.
మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీ వర్సెస్ గ్రాండ్ విటారా సీఎన్జీ- ధరలు..
Maruti Grand Vitara CNG mileage : మారుతీ బ్రెజా సీఎన్జీ మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుండగా.. గ్రాండ్ విటారా సీఎన్జీ మోడల్ కేవలం 2 వేరియంట్లలోనే అందుబాటులో ఉంది.
మారుతీ బ్రెజా ఎల్ఎక్స్ఐ సీఎన్జీ ధర రూ. 9.14లక్షలు. వీఎక్స్ఐ సీఎన్జీ ధర రూ. 10.50లక్షలు. జెడ్ఎక్స్ఐ సీఎన్జీ ధర రూ. 11.90లక్షలు. జెడ్ఎక్స్ఐ సీఎన్జీ డీటీ ధర రూ. 12.06లక్షలు.
Maruti Brezza CNG mileage : మరోవైపు మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా డెల్టా సీఎన్జీ ధర రూ. 12.85లక్షలు. జెటా సీఎన్జీ ధర రూ. 14.84లక్షలు
* పైన చెప్పిన ధరలు ఎక్స్‌షోరూం ప్రైజ్‌లు.