Urban Cruiser Hyryder CNG vs Grand Vitara CNG : ఈ రెండిట్లో బెస్ట్ సీఎన్జీ కారు ఏది?
Urban Cruiser Hyryder CNG vs Grand Vitara CNG : మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్జీ మోడల్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ మోడల్ కొత్తగా వచ్చాయి. వీటిని పోల్చి.. ఈ రెండిట్లో ది బెస్ట్ ఏది? అన్న విషయం ఇక్కడ తెలుసుకుందాము.
Urban Cruiser Hyryder CNG vs Grand Vitara CNG : దేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్జీ మోడల్స్ కూడా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని అటో సంస్థలు.. సీఎన్జీ మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా.. టయోటా అర్బన్ క్రూజర్ హైడర్కు సీఎన్జీ వర్షెన్ వచ్చింది. ఇది.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ వర్షెన్కు గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము.
అర్బన్ క్రూజర్ సీఎన్జీ వర్సెస్ గ్రాండ్ విటారా సీఎన్జీ- స్పెసిఫికేషన్స్..
వాస్తవానికి ఇండియాలో టయోటాకు, మారుతీ సుజుకీకి పార్ట్నర్షిప్ ఉంది. ఈ క్రమంలోనే ఒక కంపెనీకి సంబంధించిన మోడల్లో స్వల్ప మార్పులు చేసి.. వేరే పేరుతో విక్రయిస్తుంది మరో సంస్థ. ఇక మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాకు ఈ టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ రీబ్యాడ్జ్ వర్షెన్! ఈ రెండిట్లో ఆర్కిటెక్చర్, పవర్ట్రైన్ అంశాల్లో ఫీచర్స్ ఒకే విధంగ ఉంటాయి.
Urban Cruiser Hyryder CNG on road price : టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్జీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో దీని మ్యాగ్జిమం పవర్ 103బీహెచ్పీ, మ్యాగ్జిమం టార్క2 136 ఎన్ఎం. సీఎన్జీ మోడ్‌లో మ్యాగ్జిమం పవర్ 88 బీహెచ్పీ, మ్యాగ్జిమం టార్క్ 121 ఎన్ఎం. ఇందులో 5 స్పీడ్ ఎంటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, పవర్, టార్క్ కూడా ఇంతే!
అర్బన్ క్రూజర్ సీఎన్జీ వర్సెస్ గ్రాండ్ విటారా సీఎన్జీ- ధర..
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్జీ.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి డెల్టా, జిటా. డెల్టా వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12.85లక్షలు. జిటా వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 14.84లక్షలు.
టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్జీ వేరియంట్ పూర్తి ఫీచర్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Maruti Suzuki Grand Vitara CNG on road price : ఇక టయోటా అర్బన్ క్రూజర్ హైరడర్ సీఎన్జీ సైతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి ఎస్, జీ. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 13.23లక్షలు, 15.29లక్షలు.
అంటే.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా సీఎన్ కన్నా.. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సీఎన్ఎజీ ధర రూ. 45వేలు అధికంగా ఉంది.