Maruti Suzuki Ignis vs Grand i10 NIOS : ఇగ్నిస్- గ్రాండ్ ఐ10 నియోస్.. ఏది బెటర్?
01 March 2023, 6:43 IST
- Maruti Suzuki Ignis vs Hyundai Grand i10 NIOS : మారుతీ సుజుకీ ఇగ్నిస్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఇగ్నిస్- గ్రాండ్ ఐ10 నియోస్.. ఎది బెటర్?
Maruti Suzuki Ignis vs Hyundai Grand i10 NIOS : 2023 ఇగ్నిస్ని ఇటీవలే లాంచ్ చేసింది మారుతీ సుజుకీ. ధరను కూడా కాస్త పెంచింది. ఈ ప్రైజ్ పాయింట్లో ఈ వెహికిల్.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌కు గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ ఓసారి పోల్చి.. ఏది కొంటే బెటర్? అన్నది తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ ఇగ్నిస్ వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్- లుక్స్..
Maruti Suzuki Ignis on road price Hyderabad : మారుతీ సుజుకీ ఇగ్నిస్లో బానెట్ పెద్దగా ఉంటుంది. క్రోమ్ ఫినీష్డ్ గ్రిల్, డీఆర్ఎల్స్తో కూడిన ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్, ఇండికేటర్- మౌంటెడ్ ఓఆర్వీఎంలు, రూఫ్ స్పాయిలర్, ఆలాయ్ వీల్స్ లభిస్తున్నాయి.
ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో గ్రిల్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్గేట్స్, 15 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
ఇగ్నిస్ (3,700ఎంఎం) కన్నా ఐ10 నియోస్ (3,815ఎంఎం) పొడవు ఎక్కువ. వీల్‌బేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది (2,450ఎంఎం vs 2435ఎంఎం).
మారుతీ సుజుకీ ఇగ్నిస్ వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్- ఇంజిన్..
2023 Maruti Suzuki Ignis : మారుతీ సుజుకీ ఇగ్నిస్లో 1.2 లీటర్, 4 సిలిండర్, వీవీటీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Hyundai Grand i10 NIOS on road price Hyderabad : ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 81.8 హెచ్‌పీ పవర్‌ను, 113.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కాగా.. ఇందులో సీఎన్జీ మోడల్ కూడా ఉంది. ఇది 67.7 హెచ్‌పీ పవర్‌ను, 95.2ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండింట్లోనూ 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ సెటప్ ఆప్షన్స్ ఉన్నాయి.
మారుతీ సుజుకీ ఇగ్నిస్ వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్- ఫీచర్స్..
2023 మారుతీ ఇగ్నిస్ 5 సీటర్ క్యాబిన్లో ఎలక్ట్రానిక్ స్టెబులిటీ ప్రొగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, రేర్ వ్యూ కెమెరా, మల్టీపుల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.
Hyundai Grand i10 NIOS features : హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో 5 సీట్లు, 6 ఎయిర్‌బ్యాగ్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, యూఎస్బీ ఛార్జర్స్, రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి.
మారుతీ సుజుకీ ఇగ్నిస్ వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్- ధర..
మారుతీ సుజుకీ ఇగ్నిస్ ఎక్స్‌షోరూం ధర రూ. 5.82లక్షలు- రూ. 8.01లక్షల మధ్యలో ఉంది. ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎక్స్‌షోరూం ధర రూ. 5.68లక్షలు- రూ. 8.46లక్షల మధ్యలో ఉంది.