Maruti Suzuki Ignis : కొత్త ఫీచర్స్​తో మారుతీ సుజుకీ ఇగ్నిస్​.. ధర పెంపు-maruti suzuki ignis gets new feature an price hiked check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Ignis : కొత్త ఫీచర్స్​తో మారుతీ సుజుకీ ఇగ్నిస్​.. ధర పెంపు

Maruti Suzuki Ignis : కొత్త ఫీచర్స్​తో మారుతీ సుజుకీ ఇగ్నిస్​.. ధర పెంపు

Sharath Chitturi HT Telugu
Feb 25, 2023 08:08 AM IST

Maruti Suzuki Ignis new features : మారుతీ సుజుకీ ఇగ్నిస్​లో కొన్ని కొత్త సేఫ్టీ ఫీచర్స్​ యాడ్​ చేశారు. ఫలితంగా ధర కూడా పెరిగింది. ఆ వివరాలు మీకోసం..

కొత్త ఫీచర్​తో మారుతీ సుజుకీ ఇగ్నిస్
కొత్త ఫీచర్​తో మారుతీ సుజుకీ ఇగ్నిస్

Maruti Suzuki Ignis new features : ప్రిమియం హ్యాచ్​బ్యాక్​ మోడల్​ ఇగ్నిస్​కు కొత్త సేఫ్టీ ఫీచర్స్​ను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. దీనితో పాటు ఈ మోడల్​ ధరను కూడా పెంచింది. పూర్తి వివరాలు మీకోసం..

కొత్త సేఫ్టీ ఫీచర్స్​..

ఇగ్నిస్​లో హిల్​ హోల్డ్​ అసిస్ట్​ ఫీచర్​ను అన్ని వేరియంట్లకు స్టాండర్డ్​గా తీసుకొస్తున్నట్టు ప్రకటించింది మారుతీ సుజుకీ. పైగా.. ఆర్​డీఈ (రేర్​ డ్రైవింగ్​ ఎమిషన్​) కంప్లైంట్​ని కూడా యాడ్​ చేసింది. ఇక మారుతీ సుజుకీ ఇగ్నిస్​ ఇప్పుడు ఈ20 ఫ్యూయెల్​ కేపబులిటీ కూడా పొందింది. ఫలితంగా ఇగ్నిస్​పై రూ. 27వేల ప్రైజ్​ హైక్​ తీసుకుంది ఈ ఆటోమొబైల్​ సంస్థ. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఇగ్నిస్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 5.55లక్షలకు పెరిగింది.

Maruti Suzuki Ignis on road price in Hyderabad : "కొత్త ఫీచర్స్​ యాడ్​ చేయడంతో ఇగ్నిస్​ ధరను పెంచాల్సి వచ్చింది. హిల్​ హోల్డ్​ అసిస్ట్​తో పాటు ఈఎస్​పీ (ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ ప్రోగ్రామ్​)ని కూడా యాడ్​ చేశాము. ఏబీఎస్​, ఐఎస్​ఓఎఫ్​ఐఎక్స్​ వంటి చైల్డ్​ సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఇప్పుడు ఇగ్నిస్​లో ఉన్నాయి," అని రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది మారుతీ సుజుకీ.

మారుతీ సుజుకీ ఇగ్నిస్​- ఇంజిన్​..

మారుతీ సుజుకీ ఇగ్నిస్​లో 1.2 లీటర్​ 4 సిలిండర్​ వీవీటీ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇందులో స్టార్ట్​/ స్టాప్​ టెక్నాలజీ లేదు. ఇది 81 హెచ్​పీ పవర్​ను, 113 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేయగలదు. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​, 4 స్పీడ్​ ఆటో గేర్​బాక్స్​ సెటప్​ ఉంది.

మారుతీ సుజుకీ ఇగ్నిస్- ఫీచర్స్​..

Maruti Suzuki Ignis price : ఇగ్నిస్​ పొడవు 3,700 ఎంఎం, వెడల్పు 1690, ఎత్తు 1,595గా ఉంటుంది. ఫ్రెంట్​లో క్రోమ్​ గ్రిల్​, భారీ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, డీఆర్​ఎల్​ యూనిట్స్​ వస్తున్నాయి. 15 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, ఫ్రెంట్​ అండ్​ రేర్​లో స్కిడ్​ ప్లేట్స్​ కూడా లభిస్తున్నాయి.

Maruti Suzuki Ignis features : మారుతీ సుజుకీ ఇగ్నిస్​లో మొత్తం 7 వేరియంట్లు ఉండటం విశేషం. 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ స్మార్ట్​ప్లే స్టూడియో ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో, ఎంఐడీ విత్​ టీఎఫ్​టీ స్క్రీన్​, స్ట్రీంగ్​ మౌంటెడ్​ కంట్రోల్స్​, 4 స్పీకర్స్​తో పాటు ఇతర ఫీచర్స్​ దీని సొంతం.