Mahindra XUV300 new variant : ఎక్స్‌యూవీ300లో కొత్త వేరియంట్.. ధర ఎంతంటే!
11 August 2023, 7:17 IST
- Mahindra XUV300 new variant : మహీంద్రా ఎక్స్‌యూవీ300లో కొత్త వేరియంట్ లాంచ్ అయ్యింది. ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎక్స్‌యూవీ300లో కొత్త వేరియంట్.. ధర ఎంతంటే!
Mahindra XUV300 new variant : మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్యూవీ కొత్త వేరియంట్ ఇండియాలో అడుగుపెట్టింది. ఇదొక ఎంట్రీ లెవల్ మోడల్. దీని పేరు "డబ్ల్యూ2". దీని ఎక్స్‌షోరూం ధర రూ. 7.99లక్షలు. ఇప్పటివరకు బేస్ వేరియంట్‌గా ఉన్న డబ్ల్యూ4 కన్నా దీని ధర రూ. 66,000 తక్కువగా ఉంది. అంతేకాకుండా.. డబ్ల్యూ4 లైనప్‌కు పెట్రోల్ టర్బోస్పోర్ట్ టీఎం వేరియంట్‌ను సైతం యాడ్ చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 9.29లక్షలు.
ఎంట్రీ లెవల్ వేరియంట్..
కొత్త ఎంట్రీ లెవల్ డబ్ల్యూ-2 వేరియంట్‌తో ఎక్స్‌యూవీ300 ధర రూ. 8.65లక్షల నుంచి రూ. 7.99లక్షలకు తగ్గింది. ప్రస్తుతం ఇందులోని టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 14.59లక్షల వరకు ఉంది.
Mahindra XUV300 on road price Hyderabad : ఇక కొత్త వేరియంట్ లాంచ్‌తో పాటు డబ్ల్యూ4కు కొన్ని అప్డేట్స్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను యాడ్ చేసింది. ఇప్పటివరకు డబ్ల్యూ6 మోడల్ నుంచే ఈ ఫీచర్ లభించేది.
ఈ ఎస్‌యూవీలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 108 హెచ్‌పీ పవర్‌ను, 200 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 1.2 లీటర్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 130 హెచ్‌పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్.. 115 హెచ్‌పీ పవర్‌ను, 300 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Mahindra XUV400 : మహీంద్రా ఎక్స్‌యూవీ400లో కొత్త ఫీచర్స్..
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఉన్న సెగ్మెంట్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉంటుంది. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ బ్రెజా, టాటా నెక్సాన్ వంటి బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌తో ఎక్స్‌యూవీ300 పోటీపడుతోంది. కాగా.. ఈ మోడల్‌కు కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ లభిస్తోందని సంస్థ చెబుతోంది.
ఎక్స్‌యూవీ500 ఏరో వస్తోందా..?
వరుస లాంచ్‌లకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎక్స్‌యూవీ500 ఏరోకు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. ఈ ఎస్యూవీ-కూపే మోడల్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ తొలిసారి ఇండియా రోడ్లపై దర్శనమిచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో ఈ ఎక్స్‌యూవీ500 ఏరోకు సంబంధించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వీటితో పాటు పలు ఈవీలను సైతం లాంచ్ చేసేందుకు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.