తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Thar Ev : వావ్​.. ఎలక్ట్రిక్​ అవతారంలో మహీంద్రా థార్​!

Mahindra Thar EV : వావ్​.. ఎలక్ట్రిక్​ అవతారంలో మహీంద్రా థార్​!

Sharath Chitturi HT Telugu

05 August 2023, 13:11 IST

google News
    • Mahindra Thar EV : మహీంద్రా అండ్​ మహీంద్రా నుంచి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. థార్​కు ఈవీ వర్షెన్​ను రూపొందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.
మహీంద్రా థార్​కు ఈవీ టచ్​.. వావ్​!
మహీంద్రా థార్​కు ఈవీ టచ్​.. వావ్​!

మహీంద్రా థార్​కు ఈవీ టచ్​.. వావ్​!

Mahindra Thar EV : మహీంద్రా 'థార్​' లవర్స్​కు క్రేజీ న్యూస్​! థార్​ ఎస్​యూవీకి ఈవీ టచ్​ ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా. ఈ మేరకు ఓ టీజర్​ను లాంచ్​ చేసింది.

థార్​కు ఈవీ టచ్​..

ఆటోమొబైల్​ మార్కెట్​లో మహీంద్రా థార్​కు ప్రత్యేక ఫాన్​ బ్యేస్​ ఉంటుంది. ఏ వేరియంట్​​ లాంచ్​ చేసినా, ఈ ఆఫ్​రోడ్​ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు థార్​ ఈవీ వస్తోందంటే కస్టమర్లలు చాలా ఎగ్జైట్​ అవుతున్నారు. దీనికి 'థార్​.ఈ'అని పేరు పెట్టింది సంస్థ.

సౌతాఫ్రికాలో ఆగస్ట్​ 15న 'ఫ్యూచర్​స్కేప్​' అనే ఈవెంట్​ను నిర్వహిస్తోంది మహీంద్రా అండ్​ మహంద్రా. ఇందులో గ్లోబల్​ ట్రాక్టర్​ ప్లాట్​ఫార్మ్​తో పాటు పలు పికప్​ ట్రక్స్​ను ప్రదర్శించనుంది. ఈ ఈవెంట్​లోనే మహీంద్రా థార్​ ఈవీ కాన్సెప్ట్​ని కూడా సంస్థ ప్రదర్శించనుంది!

Mahindra Thar EV Launch : మహీంద్రా థార్​.ఈకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. థార్​ను రూపొందించే ప్లాట్​ఫార్మ్​నే స్వల్పంగా మార్చి ఈవీ వర్షెన్​ను సిద్ధం చేయొచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న ఈవీ ప్లాట్​ఫార్మ్​ (ఐఎన్​జీఎల్​ఓ)లోనే థార్​ను సరికొత్తగా రూపొందించే అవకాశం ఉంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదీ చూడండి:- 5 డోర్​ మహీంద్రా థార్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

అయితే థార్​ అనేది ఒక ఆఫ్​రోడర్​, 4 వీడ్​ డ్రైవ్​ ఎస్​యూవీ కావడంతో ఈవీ మోడల్​లో డ్యూయెల్​ మోటార్​ సెటప్​ ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు మొదలయ్యాయి.

ఎలక్ట్రిక్​ వాహనాల లైనప్​..

Mahindra Thar EV price : దేశ ఈవీ సెగ్మెంట్​లో మహీంద్రా అండ్​ మహీంద్రాకు ప్రస్తుతం మహీంద్రా ఎక్స్​యూవీ400 మోడల్​ మాత్రమే ఉంది. దీనికి మంచి డిమాండ్​ లభిస్తోంది. కాగా.. బీఈ.05, బీఈ.07 వంటి ఎలక్ట్రిక్​ వాహనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది సంస్థ. వీటి మధ్య మహీంద్రా థార్​ ఈవీ గురించి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

మహీంద్రా థార్​లో ప్రస్తుతం 2.2 లీటర్​ ఎంహాక్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 128 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.0 లీటర్​ ఎంస్టేలన్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 150 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 1.5లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్​ కూడా ఉంది. ఇది 117 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 2డబ్ల్యూడీ మోడల్​ను ఈ ఏడాదిలోనే మార్కెట్​లోకి తీసుకొచ్చింది ఈ సంస్థ. ఇండియాలో థార్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10.54లక్షలుగా ఉంది.

తదుపరి వ్యాసం