తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev5 Electric Suv : ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని త్వరలోనే రివీల్​ చేయనున్న కియా!

Kia EV5 electric SUV : ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని త్వరలోనే రివీల్​ చేయనున్న కియా!

Sharath Chitturi HT Telugu

29 July 2023, 13:45 IST

google News
    • Kia EV5 electric SUV : ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని త్వరలోనే రివీల్​ చేయనుంది కియా మోటార్స్​. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
త్వరలోనే ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని రివీల్​ చేయనున్న కియా మోటార్స్​..!
త్వరలోనే ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని రివీల్​ చేయనున్న కియా మోటార్స్​..! (HT AUTO)

త్వరలోనే ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని రివీల్​ చేయనున్న కియా మోటార్స్​..!

Kia EV5 electric SUV : "ఈవీ5" ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కాన్సెప్ట్​ను ఈ ఏడాది మార్చ్​లో ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​. ఇక ఇప్పుడు.. ఈ మోడల్​ను అంతర్జాతీయంగా రివీల్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. చైనాలో వచ్చే నెలలో జరగనున్న చెంగ్డు మోటార్​ షోలో.. ఈ సరికొత్త ఈవీని సంస్థ రివీల్​ చేస్తుందని తెలుస్తోంది. దీని ధర 50 మిలియన్​ యువాన్​లుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే, ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 32.90లక్షలు!

ఈవీ5 ఎలా ఉంటుంది..?

ఈ ఈవీ యుగం కోసం తనని తాను మార్చుకుంటోంది కియా. ఈ మధ్య కాలంలో వాహనాల డిజైన్​పై ఎక్కువగా ఫోకస్​ పెట్టింది. ఈ క్రమంలోనే 'ఆపోజిట్స్​ యునైటెడ్​' అన్న ఫిలాసఫీతో డిజైన్​లు చేస్తోంది. కొత్త లోగోతో ముందుకెళుతోంది. ఫలితంగా కస్టమర్లలో కియా మోడల్స్​పై ఆసక్తి పెరుగుతోంది.

Kia EV5 launch : ఇక కియా ఈవీ5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఫ్రెంట్​లో ఆల్​ న్యూ డిజిటల్​ టైగర్​ ఫేస్​ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న మోడల్స్​లో టైగర్​ నోస్​ గ్రిల్​ డిజైన్​ కనిపించేది. సైడ్ ప్రొఫైల్ చాలా మినిమల్ డిజైన్‍తో ఉంది. చూడడానికి చాలా స్టైలిష్‍గా కనిపిస్తోంది. బ్లాక్ వీల్ ఆర్చీస్ ఈ ఎస్‍యూవీలో ఉన్నాయి. ఇక ఫ్లోటింగ్ సన్‍రూఫ్ కారణంగా దీని లుక్ మరింత క్లాస్​గా మారింది.

ఇదీ చూడండి:- 2023 Kia Seltos price : హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలివే..

ప్రొడక్షన్​ వర్షెన్​లో కాన్సెప్ట్​ వర్షెన్​కు సంబంధించి పలు మార్పులు కనించడం సాధారణమైన విషయమే. అయితే.. ఈ ఈవీ ఎక్స్​టీరియర్​లో పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తోంది.

ప్రస్తుతం కియా ఈవీ6లో 77.4 కేబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంది. ఈవీ5లో దాని కన్నా పెద్ద బ్యాటరీ ప్యాక్​ (82 కేడబ్ల్యూహెచ్​) ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. కొత్త ఎలక్ట్రిక్​ వాహనం రేంజ్​ దాదాపు 600కి.మీలుగా ఉండొచ్చ

టెస్లా మోడల్​ వైకి పోటీగా..

Kia EV5 price India : చైనాలో ఈ మోడల్​ డెలివరీలను ఈ ఏడాది చివరి నాటికి మొదలుపెట్టాలని చూస్తోంది సంస్థ. లాంచ్​ తర్వాత ఈ ఎస్​యూవ.. టెస్లా మోడల్​ వైకి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. చైనాలో మోడల్​ వై ధర 2,63,900 యువాన్​లు. దీని రేంజ్​ 545 కి.మీలు.

చైనా తర్వాత ఈవీ5 మోడల్​.. అంతర్జాతీయ మార్కెట్​లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇండియా లాంచ్​పై ప్రస్తుతం క్లారిటీ లేదు.

తదుపరి వ్యాసం