తెలుగు న్యూస్ / ఫోటో /
Kia EV5 Electric Car: కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసిన కియా.. అదిరిపోయే డిజైన్‍తో..
Kia EV5 Electric Car: ఈవీ5 కాన్సెప్ట్‌ను కియా ఆవిష్కరించింది. తదుపరి తీసుకురానున్న ఈ ఎలక్ట్రిక్ కారు ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ చైనాలో లాంచ్ కానుంది. వివరాలివే..
(1 / 8)
కియా ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కాన్సెప్ట్‌ను కియో ఆవిష్కరించింది. ఈ ఏడాదిలోనే చైనాలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లాంచ్ కానుంది.
(2 / 8)
రేడియేటర్ గ్రిల్‍కు క్లోజ్డ్ ప్యానెల్ ఉంది. దీంతో లుక్‍పరంగా చూడడానికి ఫ్రంట్ డిజైన్ ఈవీ9లా ఈ కియా ఈవీ5 కనిపిస్తుంది. స్లీక్ ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్స్ ఉన్నాయి.
(3 / 8)
కియా ఈవీ5 సైడ్ ప్రొఫైల్ చాలా మినిమల్ డిజైన్‍తో చూడడానికి చాలా స్టైలిష్‍గా కనిపిస్తోంది. బ్లాక్ వీల్ఆర్చెస్ ఈ ఎస్‍యూవీకి ఉన్నాయి. ఇక ఫ్లోటింగ్ సన్‍రూఫ్ వల్ల దీని లుక్ చాలా క్లాస్‍గా ఉంది.
(4 / 8)
కియా ఈవీ5 వెనుక సీ షేప్‍లో ఎల్ఈడీ టైల్‍లైట్ ఉంది. ఇది దాదాపు మొత్తం టైల్‍గేట్ వెడల్పును కవర్ చేస్తోంది. చంకీ స్కిడ్ ప్లేట్ కూడా కనిపిస్తోంది.
(5 / 8)
కియా ఈవీ5 క్యాబిన్‍లో ఫ్లోటింగ్ డాష్‍ట్యాప్ ఇన్ఫోటైన్‍మెంట్ స్క్రీన్‍తో సగం డ్యాష్‍బోర్డు కవర్ అయింది. ఇక స్లీక్ బటన్‍లతో ఒక్టాగోనల్ స్టీరింగ్ ఈ కారుకు ఉంటుంది.
(6 / 8)
కియో ఈవీ9 మాదిరే స్వివెల్లింగ్ సీట్లతో ఈవీ5 రానుంది. అంటే సీట్లను 360 డిగ్రీలుగా తిప్పవచ్చు. ఈ సీట్ల వల్ల కారులో లాంజ్ ఫీలింగ్ ఉంటుంది.
(7 / 8)
కియా ఈవీ5 ఎస్‍యూవీ క్యాబిన్‍లో ఫ్రంట్ సీట్ల మధ్య సెంట్రల్ కన్సోల్ ఉండదు. సీట్ల ముందు స్టోరేజ్ స్పేస్ ఉంది.
ఇతర గ్యాలరీలు