తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Ioniq 5 Vs Kia Ev6 : ఐయానిక్​ 5 వర్సెస్​ కియా ఈవీ6.. ది బెస్ట్​ ఏదంటే!

Hyundai Ioniq 5 vs Kia EV6 : ఐయానిక్​ 5 వర్సెస్​ కియా ఈవీ6.. ది బెస్ట్​ ఏదంటే!

25 December 2022, 11:36 IST

google News
    • Hyundai Ioniq 5 vs Kia EV6 : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ ఇటీవలే మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న కియా ఈవీ6కి ఇది గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. వీటిని పోల్చి.. ఏది బెస్ట్​ అనేది ఇప్పుడు చూద్దాం..
హ్యుందాయ్​ ఐయానిక్​ 5
హ్యుందాయ్​ ఐయానిక్​ 5 (AP)

హ్యుందాయ్​ ఐయానిక్​ 5

Hyundai Ioniq 5 vs Kia EV6 : దేశంలో ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ లిస్ట్​లోకి హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ కూడా వచ్చి చేరింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ ఈవీని గతవారమే ఇండియాలో ఆవిష్కరించింది హ్యుందాయ్​. రేంజ్​తో పాటు స్టైలిష్​ లుక్స్​తో మార్కెట్​లో అంచనాలు పెంచేసింది ఈ ఈవీ. అయితే.. ఈ హ్యుందాయ్​ ఐయానిక్​ 5.. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న కియా ఈవీ6కి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ ఓసారి పోల్చి, వీటిల్లో ‘ది బెస్ట్​’ ఏది అనేది తెలుసుకుందాము..

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ వర్సెస్​ కియా ఈవీ6- డైమెన్షన్స్​..

డైమెన్షన్స్హ్యుందాయ్ ఐయానిక్​ 5​ (ఎంఎం)కియా ఈవీ6 (ఎంఎం)
పొడవు46354695
వెడల్పు18901890
ఎత్తు16251570
వీల్​బేస్​30002900

Hyundai Ioniq 5 specifications : దీని ప్రకారం చూసుకుంటే.. కియా ఈవీ6 కన్నా హ్యుందాయ్​ ఎత్తు, వీల్​ బేస్​ ఎక్కువగా ఉంటుంది. వెడల్పు ఒకే విధంగా ఉంటుంది. లెన్త్​లో మాత్రం కియా ఈవీ6 పెద్దగా ఉంటుంది.

Tata Harrier vs MG Hector లో ది బెస్ట్​ ఏది? అనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ వర్సెస్​ కియా ఈవీ6- పర్ఫార్మెన్స్​..

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీలో సింగిల్​ మోటార్​ ఆర్​డబ్ల్యూడీ ఇంజిన్​ ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 72.6కేడబ్ల్యూహెచ్​. ఇది 217పీఎస్​ పవర్​ను, 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సంస్థ ప్రకారం.. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 631కి.మీల దూరం ప్రయాణిస్తుంది! పూర్తిగా ఛార్జ్​(11కేడబ్ల్యూతో) అవ్వడానికి 6 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. అదే 50కేడబ్ల్యూ ఛార్జింగ్​తో అయితే.. 57 నిమిషాలు పడుతుంది.

Kia EV6 features : ఇక కియా ఈవీ6లో డ్యూయెల్​ మోటార్​ ఏడబ్ల్యూడీ ఇంజిన్​ ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 77.4కేడబ్ల్యూహెచ్​. ఇది 325పీఎస్​ పవర్​ను, 605ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సంస్థ ప్రకారం.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ కియా ఈవీ6 708కి.మీల దూరం ప్రయాణిస్తుంది. పూర్తిగా ఛార్జ్​(7.2కేడబ్ల్యూతో) అవ్వడానికి 7 గంటల 20నిమిషాల సమయం పడుతుంది. అదే 50కేడబ్ల్యూ ఛార్జింగ్​తో అయితే 73 నిమిషాలు పడుతుంది.

దీని బట్టి చూసుకుంటే.. హ్యుందాయ్​ ఐయానిక్​ 5లో బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉంది. కియా ఈవీ6తో పోల్చుకుంటే రేంజ్​ కూడా తక్కువగానే ఉంది. కానీ బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉండటంతో.. హ్యుందాయ్​ ఐయానిక్​ 5 తొందరగా ఛార్జ్​ అవుతుంది!

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ వర్సెస్​ కియా ఈవీ6- ఫీచర్స్​..

Hyundai Ioniq 5 price Hyderabad : హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఎక్స్​టీరియర్​లో.. పారామెట్రిక్​ పిక్సెల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​- టెయిల్​ ల్యాంప్స్​, పాప్​- అప్​ ఫ్లష్​ డోర్​ హ్యాండిల్స్​, యాక్టివ్​ ఎయిర్​ ఫ్లాప్​, పానారోమిక్​ సన్​రూఫ్​ ఉంటాయి. ఇక ఇంటీరియర్​లో ఈకో ఫ్రెండ్లీ లెథర్​ అప్​హోలిస్ట్రీ, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​ సెటప్​, వీ2ఎల్​, పవర్డ్​ టెయిల్​గేట్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, హీటెడ్​ సీట్స్​, 12.3 ఇంచ్​ ఇంటిగ్రేటెడ్​ డ్యూయెల్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 8- స్పీకర్​ బాష్​ ప్రీమియం సౌండ్​ సిస్టెమ్​ ఉంటాయి.

కియా ఈవీ6 ఎక్స్​టీరియర్​లో అడాప్టివ్​ డ్రైవింగ్​ బీమ్​తో కూడిన డ్యూయెల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, పాప్​ అప్​ ఫ్లష్​ డోర్​ హ్యాండిల్స్​, సింగిల్​ పేన్​ సన్​రూఫ్​ ఉంటాయి. ఇక ఇంటీరియర్​లో వేగన్​ లెథర్​ అప్​హోలిస్ట్రీ, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, వీ2ఎల్​, పవర్డ్​ టెయిల్​గేట్​, హీటెడ్​ అండ్​ వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​ ఉంటాయి. ఇంటీగ్రేటెడ్​ డిస్​ప్లే ఫర్​ డ్యూయెల్​ 12.3 ఇంచ్​ స్క్రీన్స్​(ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​- ఇన్​ఫోటైన్​మెంట్​), 14 స్పీకర్​ మేరీడియన్​ ఆడియో సిస్టెమ్​ ఉంటాయి.

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ వర్సెస్​ కియా ఈవీ6- సేఫ్టీ..

Kia EV6 range : సేఫ్టీ ఫీచర్స్​ కింద హ్యూందాయ్​ ఐయానిక్​ 5 ఈవీలో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఏడీఏఎస్​ టెక్​, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.

అదే కియా ఈవీ6లో 8 ఎయిర్​బ్యాగ్స్​, ఏడీఏఎస్​ టెక్​, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.

హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీ వర్సెస్​ కియా ఈవీ6- ధర..

Kia EV6 price Hyderabad : ప్రస్తుతం కియా ఈవీ6 ఎక్స్​షోరూం ధర రూ. 59.95లక్షలు- 64.95లక్షల మధ్యలో ఉంది. హ్యుందాయ్​ ఐయానిక్​ 5 ఈవీకి సంబంధించిన ధరను ఆ సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఈ ఈవీ ప్రారంభ ధర రూ. 50లక్షలుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం