MG Comet EV Gamer Edition : ఎంజీ కామెట్ ఈవీ గేమర్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే!
04 August 2023, 7:02 IST
- MG Comet EV Gamer Edition : ఎంజీ కామెట్ ఈవీ గేమర్ ఎడిషన్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ కామెట్ ఈవీ గేమర్ ఎడిషన్ లాంచ్..
MG Comet EV Gamer Edition : ఎంజీ కామెట్ ఈవీ వెహికిల్‌కు ఇండియాలో మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ చిన్న సైజు ఎలక్ట్రిక్ వెహికిల్‌పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కామెట్ ఈవీ గేమర్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది సంస్థ. పేస్, ప్లే, ప్లష్ వేరియంట్స్‌కు ఇది వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
గేమర్ ఎడిషన్ స్పెషాలిటీ ఏంటీ?
గేమర్స్‌ను అట్రాక్ట్ చేసే విధంగా ఈ ఎంజీ కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్ ఉంటుంది. సైడ్ మౌల్డింగ్స్, కార్పెట్ మాట్స్, ఇంటీరియర్ ఇన్సర్ట్స్, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్స్ వంటివి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇవి యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పుకోవాలి.
ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న సైజుతో అందరి దృష్టిని ఆకర్షించింది ఎంజీ కామెట్ ఈవీ. పైగా ఇందులో అనేక స్మార్ట్ ఫీచర్స్ ఉండటం హైలైట్ విషయం. ఇక ఇప్పుడు గేమర్ ఎడిషన్‌తో సేల్స్ పెంచుకోవాలని సంస్థ చూస్తోంది. యునీక్, పర్సనలైజ్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారికి.. ఈ ఎంజీ కామెట్ ఈవీ గేమర్ ఎడిషన్ కచ్చితంగా నచ్చుతుంది!
ఇదీ చూడండి:- MG Comet EV vs Tata Tiago EV : ఎంజీ కామెట్ వర్సెస్ టియాగో ఈవీ.. ఏది బెస్ట్?
ఎంజీ కామెట్ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 7,98,000- రూ. 9,98,000 మధ్యలో ఉంది. సాధారణ మోడల్స్ కన్నా గేమర్ ఎడిషన్ మరో రూ. 64,999 అధికం!
ఇతర వివరాలు..
MG Comet EV Gamer Edition price : ఎంజీ కామెట్ ఈవీ గేమర్ ఎడిషన్‌లో పెద్దగా మార్పులు కనిపించవు. ఇందులో 17.3 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిపై గరిష్ఠంగా 8ఏళ్లు లేదా 1.20లక్షల కి.మీల వారెంటీ లభిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఈవీ 230కి.మీ దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులో ఎలక్ట్రిక్ ఇంజిన్ 41 హెచ్‌పీ పవర్‌ను, 110 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఈవీ స్పీడ్ 100కేఎంపీహెచ్. ఈకో, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.