MG Comet EV vs Tata Tiago EV : ఎంజీ కామెట్ వర్సెస్ టియాగో ఈవీ.. ఏది బెస్ట్?
MG Comet EV vs Tata Tiago EV : ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ టాటా టియాగో ఈవీ! ఈ రెండిట్లో మీరు ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ రెండు ఈవీల్లో ఏది బెస్ట్ అంటే..
MG Comet EV vs Tata Tiago EV : ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చింది ఎంజీ కామెట్ ఈవీ. ఈ ఈవీకి మంచి రివ్యూలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే డిమాండ్ కూడా కనిపిస్తోంది! ఈ నేపథ్యంలో సేల్స్ పరంగా దూసుకెళుతున్న టాటా టియాగో ఈవీకి.. ఈ ఎంజీ కామెట్ గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ టాటా టియాగో ఈవీ- డైమెన్షన్స్..
ఎంజీ కామెట్ ఈవీ అన్నది చిన్న కారు అని ఫస్ట్ లుక్‌లోనే తెలిసిపోతుంది. దీని పొడవు 2974ఎంఎం. వెడల్పు 1505ఎంఎం. ఎత్తు 1640ఎంఎం. వీల్‌బేస్ 2010ఎంఎం.
MG Comet EV price Hyderabad : మరోవైపు టాటా టియాగో ఈవీ పొడవు 3769ఎంఎం. వెడల్పు 1677ఎంఎం. ఎత్తు 1536ఎంఎం. వీల్ బేస్ 2400ఎంఎం.
ఒక్క హైట్ విషయంలో తప్ప.. ఎంజీ కామెట్ ఈవీ కన్నా టియాగో ఈవీనే పెద్దది. టాటా టియాగో ఈవీలో 240 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఎంజీ కామెట్ ఈవీ దీని కన్నా తక్కువే ఉండనుంది.
ఇదీ చదవండి:- Citroen eC3 vs Tiago EV vs Tigor EV : ఈ మూడింట్లో.. బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీ ఏది?
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ టాటా టియాగో ఈవీ- బ్యాటరీ ప్యాక్..
MG Comet EV range : ఎంజీ కామెట్ ఈవీలో 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. 3.3 కేడబ్ల్యూ ఛార్జర్‌తో 0-100శాతం ఛార్జింగ్ 7 గంటల్లో పూర్తవుతుంది. దీనికి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కేపబులిటీ లేదు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 42 పీఎస్ పవర్‌ను, 110 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Tata Tiago EV price Hyderabad : ఇక టియాగో ఈవీలో 19.2 కేడబ్ల్యూహెచ్/ 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి దాని రేంజ్ 250కి.మీలు. రెండో బ్యాటరీ ప్యాక్ రేంజ్ 315కి.మీలు. వీటిని 10-100శాతానికి ఛార్జ్ (15ఏ ఛార్జర్) చేసేందుకు 6.9 గంటలు/ 8.7 గంటల సమయం పడుతుంది. వీటికి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కేపబులిటీ ఉంది. ఫలితంగా 10-80శాతం ఛార్జింగ్ కేవలం 58 నిమిషాల్లో అయిపోతుంది! ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్(రెండు బ్యాటరీ ప్యాక్‌లకు).. 61 పీఎస్/ 75 పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 110 ఎన్ఎం/ 114ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ టాటా టియాగో ఈవీ- ధర..
టియాగో ఈవీలో 7 వేరియంట్లు ఉన్నాయి. ఈ ఈవీ ఎక్స్‌షోరూం ధర రూ. 8.69లక్షల నుంచి రూ. 11.99లక్షల మధ్యలో ఉంటుంది.
MG Comet EV price : ఇక ఎంజీ కామెట్ ఈవీలో మూడు వేరియంట్లు ఉన్నాయి. పేస్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.98లక్షలు. ప్లే ఎక్స్‌షోరూం ధర రూ. 9.28లక్షలు. ప్లష్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.98లక్షలుగా ఉంది.
సంబంధిత కథనం