Kia EV5 electric SUV : ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలోనే రివీల్ చేయనున్న కియా!
Kia EV5 electric SUV : ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలోనే రివీల్ చేయనుంది కియా మోటార్స్. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Kia EV5 electric SUV : "ఈవీ5" ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాన్సెప్ట్‌ను ఈ ఏడాది మార్చ్‌లో ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ఇక ఇప్పుడు.. ఈ మోడల్‌ను అంతర్జాతీయంగా రివీల్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. చైనాలో వచ్చే నెలలో జరగనున్న చెంగ్డు మోటార్ షోలో.. ఈ సరికొత్త ఈవీని సంస్థ రివీల్ చేస్తుందని తెలుస్తోంది. దీని ధర 50 మిలియన్ యువాన్లుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే, ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 32.90లక్షలు!
ఈవీ5 ఎలా ఉంటుంది..?
ఈ ఈవీ యుగం కోసం తనని తాను మార్చుకుంటోంది కియా. ఈ మధ్య కాలంలో వాహనాల డిజైన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే 'ఆపోజిట్స్ యునైటెడ్' అన్న ఫిలాసఫీతో డిజైన్లు చేస్తోంది. కొత్త లోగోతో ముందుకెళుతోంది. ఫలితంగా కస్టమర్లలో కియా మోడల్స్‌పై ఆసక్తి పెరుగుతోంది.
Kia EV5 launch : ఇక కియా ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఫ్రెంట్లో ఆల్ న్యూ డిజిటల్ టైగర్ ఫేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న మోడల్స్‌లో టైగర్ నోస్ గ్రిల్ డిజైన్ కనిపించేది. సైడ్ ప్రొఫైల్ చాలా మినిమల్ డిజైన్‍తో ఉంది. చూడడానికి చాలా స్టైలిష్‍గా కనిపిస్తోంది. బ్లాక్ వీల్ ఆర్చీస్ ఈ ఎస్‍యూవీలో ఉన్నాయి. ఇక ఫ్లోటింగ్ సన్‍రూఫ్ కారణంగా దీని లుక్ మరింత క్లాస్‌గా మారింది.
ఇదీ చూడండి:- 2023 Kia Seltos price : హైదరాబాద్‌లో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలివే..
ప్రొడక్షన్ వర్షెన్‌లో కాన్సెప్ట్ వర్షెన్కు సంబంధించి పలు మార్పులు కనించడం సాధారణమైన విషయమే. అయితే.. ఈ ఈవీ ఎక్స్టీరియర్లో పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తోంది.
ప్రస్తుతం కియా ఈవీ6లో 77.4 కేబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఈవీ5లో దాని కన్నా పెద్ద బ్యాటరీ ప్యాక్ (82 కేడబ్ల్యూహెచ్) ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. కొత్త ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ దాదాపు 600కి.మీలుగా ఉండొచ్చ
టెస్లా మోడల్ వైకి పోటీగా..
Kia EV5 price India : చైనాలో ఈ మోడల్ డెలివరీలను ఈ ఏడాది చివరి నాటికి మొదలుపెట్టాలని చూస్తోంది సంస్థ. లాంచ్ తర్వాత ఈ ఎస్యూవ.. టెస్లా మోడల్ వైకి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. చైనాలో మోడల్ వై ధర 2,63,900 యువాన్లు. దీని రేంజ్ 545 కి.మీలు.
చైనా తర్వాత ఈవీ5 మోడల్.. అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇండియా లాంచ్‌పై ప్రస్తుతం క్లారిటీ లేదు.
సంబంధిత కథనం