MG comet EV vs Citroen eC3 : ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3.. ఏది బెస్ట్?
08 May 2023, 13:25 IST
- MG comet EV vs Citroen eC3 : ఎంజీ కామెట్ ఈవీ ప్లష్ వేరియంట్ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3 లైవ్ వేరియంట్..! ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్?
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3.. ఏది బెస్ట్?
MG comet EV vs Citroen eC3 : భారత ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చింది ఎంజీ కామెట్ ఈవీ. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ పేరు ప్లష్. ఇక ఈ ఎంజీ కామెట్ ఈవీ ప్లష్ వేరియంట్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సిట్రోయెన్ ఈసీ3 బేస్ మోడల్ 'లైవ్'కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెటర్? అన్నది తెలుసుకుందాము..
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3- డైమెన్షన్స్..
ఎంజీ మోటార్ ఈవీ చాలా చిన్నగా ఉంటుంది. పొడవు 2,974ఎంఎం. వెడల్పు 1,505ఎంఎం. వీల్‌బేస్ 2,010ఎంఎం. ప్లష్ వేరియంట్లో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ విత్ ఛార్జింగ్ పోర్ట్ లభిస్తోంది. ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఇండికేటర్ మౌంటెడ్ ఓఆర్వీఎంలు, డిజైనర్ కవర్స్‌తో కూడిన 12 ఇంచ్ స్టీల్ వీల్స్, బంపర్ మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి.
MG comet EV plush on road price Hyderabad : ఇక సిట్రోయెన్ ఈసీ3 లైవ్ వేరియంట్ పొడవు 3,981ఎంఎం. వెడల్పు 1,733ఎంఎం. వీల్‌బేస్ 2,540ఎంఎం. ఇందులో 15 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ కవర్స్, హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, థిక్ బాడీ క్లాడింగ్, రూఫ్ మౌంటెడ్ యాంటీనా లభిస్తున్నాయి.
ఇదీ చూడండి:- MG Comet EV vs Tata Tiago EV : ఎంజీ కామెట్ వర్సెస్ టియాగో ఈవీ.. ఏది బెస్ట్?
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3- ఫీచర్స్..
MG comet EV reviews in Telugu : ఎంజీ కామెట్ ఈవీ ప్లష్ వేరియంట్లోని 4 సీటర్ కేబిన్‌లో మేన్యువల్ ఏసీ, పవర్ విండోస్, 2 టోన్ డాష్‌బోర్డ్, ఫాబ్రిక్ అప్‌హోలిస్ట్రీ, లెథర్ వ్రాప్డ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, 2 స్పీకర్స్, 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ప్లే సపోర్ట్, ఐస్మార్ట్ కనెక్టెడ్ కార్ టెక్నలజీ వంటివి వస్తున్నాయి. సేఫ్టీ కోసం 2 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రేర్ వ్యూ కెమెరా సైతం ఈ వేరియంట్లో ఉన్నాయి.
Citroen eC3 live price : కాగా.. సిట్రోయెన్ ఈసీ3 లైవ్‌లోని 5 సీటర్ కేబిన్‌లో పార్కింగ్ సెన్సార్స్, మేన్యువల్ ఏసీ, సాటిన్ క్రోమ్ యాక్సెంట్స్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫ్రెంట్లో పవర్ విండోస్ వస్తున్నాయి. ఏబీఎస్, ఈబీడీ, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ దీని సొంతం. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ లేదు.
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3- రేంజ్..
MG comet EV range : ఎంజీ కామెట్ ఈవీలో 17.3కేడబ్ల్యూహెచ్ లిథియం- ఐయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 41.4 హెచ్‌పీ పవర్‌ను, 110ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని రెంజ్ 230కి.మీలు.
సిట్రోయెన్ ఈసీ3లో 29.2కేడబ్ల్యూహెచ్ లిథియం- ఐయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 56.2 హెచ్‌పీ పవర్‌ను, 143ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 320కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది.
ఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3- ధర..
Citroen eC3 range : ఎంజీ కామెట్ ఈవీ ప్లష్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.98లక్షలుగా ఉంది. సిట్రోయెన్ ఈసీ3 లైవ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 11.5లక్షలుగా ఉంది.