2023 Skoda Kodiaq launched : సరికొత్త స్కోడా కోడియాక్​ లాంచ్​.. ధర ఎంతంటే!-2023 skoda kodiaq launched at 37 99 lakhs check features and full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Skoda Kodiaq Launched : సరికొత్త స్కోడా కోడియాక్​ లాంచ్​.. ధర ఎంతంటే!

2023 Skoda Kodiaq launched : సరికొత్త స్కోడా కోడియాక్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
May 05, 2023 07:35 AM IST

2023 Skoda Kodiaq launched : 2023 స్కోడా కోడియాక్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ధర, ఫీచర్స్​తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సరికొత్తగా స్కోడా కోడియాక్​ లాంచ్​..
సరికొత్తగా స్కోడా కోడియాక్​ లాంచ్​..

2023 Skoda Kodiaq launched : కోడియాక్​ ఫ్లాగ్​షిఫ్​ ఎస్​యూవీని ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో లాంచ్​ చేసింది స్కోడా ఆటో ఇండియా. ఈ 7 సీటర్​ ఎస్​యూవీకి చెందిన స్టైల్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 37.99లక్షలుగా ఉంది. స్పోర్ట్​లైన్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 39.39లక్షలు, ఎల్​ అండ్​ కే ఎక్స్​షోరూం ధర రూ. 41.39లక్షలుగా ఉంది.

2017లో తొలిసారిగా కోడియాక్​ ఎస్​యూవీని ఇండియాలో లాంచ్​ చేసింది స్కోడా. కోడియాక్​ను లిమిటెడ్​గా సేల్​ చేస్తూ వస్తోంది. ఇక 2023 స్కోడా కోడియాక్​ ఎస్​యూవీని సైతం ప్రతి త్రైమాసికంలో కేవలం 750 యూనిట్​లనే విక్రయిస్తుంది సంస్థ.

2023 Skoda Kodiaq price : 2023 స్కోడా కోడియాక్​ ఇప్పుడు బీఎస్​6 స్టేజ్​ 2 కంప్లైంట్​. ఇందులోని 2.0 లీటర్​ టీఎస్​ఐ ఈవీఓ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 187 బీహెచ్​పీ పవర్​ను, 320 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. గత మోడల్​తో పోల్చుకుంటే.. కొత్తగా లాంచ్​ యిన స్కోడా కోడియాక్​తో మైలేజ్​ 4.2శాతం పెరుగుతుందని సంస్థ చెబుతోంది! ఈ మోడల్​ 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 7.8 సెకన్లలో అందుకుంటుంది. ఈకో, కంఫర్ట్​, నార్మల్​, స్పోర్ట్​, ఇండివీడ్జ్యువల్​, స్నో వంటి 6 డ్రైవింగ్​ మోడ్స్​ సైతం లభిస్తున్నాయి.

ఇదీ చదవండి:- Hyundai Exter SUV : ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్న హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇదే..!

ఈ కోడియాక్​లో డోర్​- ఎడ్జ్​ ప్రొటెక్టర్స్​, ఎయిర్​ఫ్లోను మెరుగుపరిచే విధంగా రేర్​ స్పాయిలర్​, పాదాల కోసం లాంజ్​ స్టెప్​, 2వ రేలో ఔటర్​ హెడ్​రెస్ట్స్​ వంటివి కొత్తగా వస్తున్నాయి.

2023 Skoda Kodiaq on road price Hyderabad : ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ ఎస్​యూవీలో ప్రొగ్రెసివ్​ స్టీరింగ్​, డైనమిక్​ ఛాసిస్​ కంట్రోల్​, యాంబియెంట్​ లైటింగ్​, కాంటాన్​ 625 డబ్ల్యూ 12 స్పీకర్​ ఆడియో సిస్టెమ్​, సబ్​వూఫర్​ వంటివి వస్తున్నాయి. రిమోట్​తో ఓపెన్​- క్లోజ్​ అయ్యే విండో, డోర్​ మిర్రర్స్​, పానారోమిక్​ సన్​రూఫ్​ ఆప్షన్స్​ కూడా వస్తున్నాయి.

"ఇండియాలో మా తొలి ఫుల్​- సైజ్​ ఎస్​యూవీ ఈ కోడియాక్​. ఇండియాతో పాటు అంతర్జాతీయంగా మంచి విజయం సాధించిన మోడల్​ ఇది. లగ్జరీ 4X4 సెగ్మెంట్​లో దీనికి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. కస్టమర్లకు అందుబాటులో ఉండేందికి ఎస్​యూవీ యూనిట్​లను పెంచాము. సేఫ్టీ, లగ్జరీ, వాల్యూ ఫర్​ మనీ, ఆఫ్​ రోడ్​ స్టెబులిటీ పరంగా ఈ కోడియాక్​ ది బెస్ట్​ అని చెప్పాలి," అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్​ డైరక్టర్​ పీటర్​ సాల్క్​ అభిప్రాయపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం