Skoda Kushaq New Edition | స్కోడా కుషాక్ కొత్త ఎడిషన్ వచ్చేసింది: ఏం మారిందంటే!
Skoda Kushaq New Onyx Edition: కుషాక్ ఎస్‍యూవీకి నయా ఎడిషన్‍ను స్కోడా తీసుకొచ్చింది. ఓనిక్స్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. లుక్‍తో పాటు ఫీచర్ల అప్‍గ్రేడ్లతో వచ్చింది.
Skoda Kushaq Onyx Edition: స్కోడా కుషాక్ ఎస్‍యూవీకి నయా ఎడిషన్ లాంచ్ అయింది. కుషాక్ ఓనిక్స్ (Kushaq Onyx) ఎడిషన్‍ను భారత మార్కెట్‍లోకి సోమవారం తీసుకొచ్చింది స్కోడా. యాక్టివ్, యాంబిషన్ వేరియంట్లకు మధ్య ఈ కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ కారు నిలుస్తోంది. ప్రస్తుతం స్కోడా కుషాక్ లైనప్‍లో 20 విభిన్న వేరియంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఓనిక్స్ ఎడిషన్ కూడా యాడ్ అయింది. కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ పరిమిత యూనిట్లే అందుబాటులోకి వస్తాయని స్కోడా పేర్కొంది. స్కోడా కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ ఎస్‍యూవీ పూర్తి వివరాలు ఇవే.
మార్పులు ఇవే
Skoda Kushaq Onyx Edition: కొన్ని కాస్మోటిక్ లుక్ మార్పులు, కొత్త ఫీచర్లతో స్కోడా కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ వచ్చింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. డీఆర్ఎల్‍లతో క్రిస్టలైన్ ఎల్ఈడీ హెడ్‍లైట్ యూనిట్లను ఈ నయా ఓనిక్స్ ఎడిషన్ ఎస్‍యూవీ కలిగి ఉంది. కార్నరింగ్ ఫంక్షన్‍తో ఫ్రంట్ ఫాగ్ లైట్లు, వెనుక డీఫాగర్, ఓనిక్స్ బ్యాడ్జింగ్ ఉన్నాయి. ఈ ఎస్‍యూవీ సైడ్లకు డెకాల్ చాలా మార్పులతో ఉంది. డిఫరెంట్ స్ట్రైకింగ్ ఉంది. మొత్తంగా ఈ కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ కాంపాక్ట్ ఎస్‍యూవీ మంచి స్పోర్టీ లుక్‍ను ఇస్తోంది. వీల్ కవర్స్ కూడా చాలా కొత్త డిజైన్‍తో ఉన్నాయి. 7.0 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ కంట్రోల్ ఫీచర్లను ఈ నయా స్కోడా కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ ఎస్‍యూవీ కలిగి ఉంది.
Skoda Kushaq Onyx Edition: స్కోడా కుషాక్ ఓనిక్స్ కారు 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్‍తో వస్తోంది. 114 bhp గరిష్ట పవర్, 178 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేయగలదు. సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‍ను కుషాక్ ఓనిక్స్ కలిగి ఉంది.
Skoda Kushaq Onyx Edition: ఇండియాలో ఉత్పత్తి అవుతున్న ఒకానొక సేఫెస్ట్ కారుగా స్కోడా కుషాక్ ఉంది. గ్లోబల్ ఎన్‍సీఏపీ క్రాష్ టెస్టులో కుషాక్.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‍ను సాధించింది. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‍లు, టీపీఎంఎస్, ఈఎస్‍సీ సహా మరిన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో స్కోడా కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ వస్తోంది.
స్కోడా కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ ధర
Skoda Kushaq Onyx Edition Price: స్కోడా కుషాక్ ఓనిక్స్ ధర రూ.12.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఓనిక్స్ ఎడిషన్‍కు సంబంధించి పరిమిత యూనిట్లనే అమ్మకానికి తీసుకురానున్నట్టు స్కోడా వెల్లడించింది.
ఇక స్కోడా కుషాక్ ఎస్‍యూవీ ధరలు వేరియంట్లను బట్టి ప్రస్తుతం రూ.11.29 లక్షల నుంచి రూ.19.89లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. సుమారు 20 కుషాక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మోంటో కార్లో ఎడిషన్ టాప్ స్పెక్ వేరియంట్‍గా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా.. ఈ స్కోడా కుషాక్‍కు పోటీగా ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్