Citroen eC3 launched : సిట్రోయెన్​ ఈసీ3 లాంచ్​.. టియాగో ఈవీ కన్నా ఎక్కువ ధరతో!-citroen ec3 launched in india check price features an full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Citroen Ec3 Launched In India Check Price Features An Full Details Here

Citroen eC3 launched : సిట్రోయెన్​ ఈసీ3 లాంచ్​.. టియాగో ఈవీ కన్నా ఎక్కువ ధరతో!

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 04:22 PM IST

Citroen eC3 launched in India : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిట్రోయెన్​ ఈసీ3.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. టాటా టియాగో ఈవీ గట్టిపోటీనిస్తూ.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఇండియాలోకి అడుగుపెట్టేసింది. దీని ధరతో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇండియాలో సిట్రోయెన్​ ఈసీ3 లాంచ్​.. ధర ఎంతంటే!
ఇండియాలో సిట్రోయెన్​ ఈసీ3 లాంచ్​.. ధర ఎంతంటే!

Citroen eC3 launched in India : ఫ్రెంచ్​ కార్​ మేకర్​ సిట్రోయెన్​.. ఇండియాలో తొలి ఎలక్ట్రిక్​ వాహనాన్ని అధికారికంగా లాంచ్​ చేసింది. ఈ ఏడాది జనవరిలో సిట్రోయెన్​ సంస్థ ఆవిష్కరించిన ఈసీ3.. ఎట్టకేలకు సోమవారం లాంచ్​ అయ్యింది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 11.50లక్షలుగా ఉంది. లైవ్​, ఫీల్​, ఫీల్​ వైబ్​ ప్యాక్​, ఫీల్​ డ్యూయెల్​ టోన్​ వైబ్​ ప్యాక్​ వంటి నాలుగు వేరియంట్లలో ఈ సిట్రోయెన్​ ఈసీ3 అందుబాటులో ఉండనుంది. టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.43లక్షలుగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

టాటా టియాగో ఈవీకి గట్టి పోటీ..!

ప్రస్తుతం మార్కెట్​లో లాంచ్​ అయిన ఈసీ3.. ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉన్న సిట్రోయెన్​ సీ3 ఐసీఈ ఇంజిన్​తో పోలి ఉంటుంది. ఇక ఈ ఈసీ3 బుకింగ్స్​ గత నెలలోనే ప్రారంభం అవ్వగా.. రానున్న కొన్ని రోజుల్లో డెలివరీలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Citroen eC3 on road price in Hyderabad : ఇండియా మార్కెట్​లో చౌకైన ఎలక్ట్రిక్​ వాహనంగా టాటా టియాగో ఈవీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ టాటా టియాగో ఈవీకి సిట్రోయెన్​ ఈసీ3 గట్ట పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. టాటా టియాగో ఈవీ ఎక్స్​షోరూం ధరలు రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల మధ్యలో ఉంటుంది. వాస్తవానికి.. టియాగో ఈవీకి సమీపంలోనే సిట్రోయెన్​ ఈసీ3 ధరలు కూడా ఉంటాయని మార్కెట్​ వర్గాలు భావించాయి. కానీ టాటా టియాగో ఈవీ కన్నా కాస్త ఎక్కువ ధరతోనే సిట్రోయెన్​ ఈసీ3 లాంచ్​ అయ్యింది.

ఈసీ3 వేరియంట్లు- ధరల వివరాలు..

ఇక సిట్రోయెన్​ ఈసీ3 లైవ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 11.50లక్షలు. ఫీల్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.13లక్షలు. ఫీల్​ వైబ్​ ప్యాక్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.28లక్షలు. చివరిగా.. ఫీల్​ డ్యూయెల్​ టోన్​ వైబ్​ ప్యాక్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.43లక్షలుగా ఉంది.

Citroen eC3 launch : సిట్రోయెన్​ ఈసీ3లో 29.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 320కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్​ మోటార్​ 57 పీఎస్​ పవర్​ను, 143 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-60 కేఎంపీహెచ్​ను 6.8 సెకన్లలో అందుకోగలుగుతుంది. దీని టాప్​ స్పీడ్​ 107 కేఎంపీహెచ్​. ఇందులో ఉన్న డీసీ ఫాస్ట్​ ఛార్జర్​తో 10-80శాతం ఛార్జింగ్​ను 57 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. 15ఏ పవర్​ సాకెట్​తో 10-100శాతం ఛార్జింగ్​ 10.5 గంటల్లో పూర్తవుతుంది.

Citroen eC3 on road price : ఇక ఈ సిట్రోయెన్​ ఈసీ3 డిజైన్​.. స్టాండర్డ్​ సీ3తోనే పోలి ఉంటుంది. అదనంగా 'ఈ' బ్యాడ్జ్​ వస్తుంది. ఇంటీరియర్​లో కూడా పెద్దగా మార్పులు లేవు. 3 స్పోక్​ ఫ్లట్​ బాటమ్​ మల్టీఫంక్షన్​ స్టీరింగ్​ వీల్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీ, 35 కనెక్టెడ్​ కార్​ ఫీచర్స్​ వంటివి లభిస్తున్నాయి.

WhatsApp channel