తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mg Comet Ev Review: ఎంజీ కామెట్ ఈవీ రివ్యూ: ఫొటోలతో..

MG Comet EV Review: ఎంజీ కామెట్ ఈవీ రివ్యూ: ఫొటోలతో..

27 April 2023, 13:44 IST

MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు భారత్ మార్కెట్‍లో అడుగుపెట్టింది. చౌకైన ఎలక్ట్రిక్ కారుగా వచ్చింది. మరి ఈ కారు ఎలా ఉందో రివ్యూను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి. 

  • MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు భారత్ మార్కెట్‍లో అడుగుపెట్టింది. చౌకైన ఎలక్ట్రిక్ కారుగా వచ్చింది. మరి ఈ కారు ఎలా ఉందో రివ్యూను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి. 
ఎంజీ మోటార్ ఇండియా నుంచి భారత్‍లో విడుదలైన రెండో కారు ఎంజీ కామెట్ ఈవీ. ఇది స్మాల్ ఎలక్ట్రిక్ కారుగా వచ్చింది. సిటీల్లో ప్రయాణించేందుకు ఈ కారు సూటవుతుంది. 
(1 / 11)

ఇండియాలో ప్రస్తుతం ఎంజీ కామెట్ ఈవీనే స్మాలెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఈ కారుకు రెండు డోర్లుగా ఉండగా.. లోపల నలుగురు కూర్చొవచ్చు. రెండు డ్యుయల్ టోన్, మూడు సింగిల్ టోన్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఎంజీ కామెట్ ఈవీ అందుబాటులోకి వస్తోంది. 
(2 / 11)

ఫ్రంట్‍లో లైట్ బార్, స్ప్లిట్ హెడ్‍లైట్ యూనిట్‍తో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు డిజైన్ హైలైట్ అవుతోంది. 12 ఇంచుల స్టీల్ వీల్‍లను ఈ కారు కలిగి ఉంది. 
(3 / 11)

ఫ్రంట్‍లో లైట్ బార్‌కు కింద సమీపంలోనే చార్జింగ్ సాకెట్ ఉంది. 
(4 / 11)
ఫ్రంట్‍లో లైట్ బార్‌కు కింద సమీపంలోనే చార్జింగ్ సాకెట్ ఉంది. 
బాక్సీ డిజైన్‍ను ఎంజీ కామెట్ ఈవీ కలిగి ఉంది. ఫ్రంట్‍లో విండోస్ పెద్దగా ఉంటాయి. వెనుక విండోలు పొడవుగా ఉన్నాయి.
(5 / 11)

కామెట్ ఈవీ వెనుక భాగం స్ట్రెచ్డ్ ఎల్ఈడీ లైట్ బార్, ట్విన్ టైల్ లైట్ యూనిట్లతో హైలైట్ అవుతోంది. మొత్తంగా ఈ కారు డిజైన్ కాస్త విభిన్నంగా ఉంది. అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. 
(6 / 11)

ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ క్లీన్ లుక్‍తో క్లాసీగా ఉంది. 12.25 ఇంచుల సైజ్ ఉండే రెండు డిస్‍ప్లే స్క్రీన్ ఉన్నాయి. కంటోల్స్ తో కూడిన స్టీరింగ్‍ ఉంది. డ్యాష్ బోర్డు లేకపోయినా స్టోరేజ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి.
(7 / 11)

స్ట్రైడ్, టంబుల్ ఫంక్షన్‍తో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఉంటుంది. దీంతో వెనుక రో సీట్లకు కూడా స్పేస్ సరిపోయేంత ఉంటుంది. వెనుక సీట్లను స్ల్పిట్ ఫార్మాట్‍లో ఫోల్డ్ చేయకపోతే బూట్ స్పేస్ అసలు ఉండదు.
(8 / 11)

ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీతో వస్తోంది. దీని మోటార్ వెనుక వైపున ఉంటుంది. 41 hp పవర్, 110 Nm టార్క్యూను ఈ కారు జనరేట్ చేస్తుంది. ఈ కారు స్టీరింగ్ చాలా లైట్‍గా ఉంటుంది. మూడు డ్రైవింగ్ మోడ్‍లను ఈ స్మాల్ కారు కలిగి ఉంది. 
(9 / 11)

హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో దాదాపు అన్ని స్పీడ్ బ్రేకర్లను ఓ మోస్తరు స్పీడ్‍తో ఈ ఎంజీ కామెట్ ఈవీ దాటగలదు. ఎక్కువగా ట్రాఫిక్‍లో ఉన్న రోడ్లపై ఈ కారు నడపడం మంచి అనుభూతి ఇస్తుంది. కేవలం 4.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ ఉండడం ఇందుకు తోడ్పడుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 100kmphకు లిమిట్ అయి ఉంటుంది. 
(10 / 11)

ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్‍తో ఎంజీ కామెట్ ఈవీ వచ్చింది. ఈ బ్యాటరీ 7 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.7.98లక్షలు (ఇంట్రడక్టరీ, ఎక్స్-షోరూమ్)గా ఉంది. మే 15న బుకింగ్స్ మొదలవుతాయి. ప్రస్తుతం దేశంలో ఇదే చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. 
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి