తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Most Affordable Cng Cars : దేశంలో అత్యంత చౌకైన సీఎన్​జీ కార్లు ఇవే..

Most affordable CNG cars : దేశంలో అత్యంత చౌకైన సీఎన్​జీ కార్లు ఇవే..

Sharath Chitturi HT Telugu

14 April 2023, 11:20 IST

google News
    • Most affordable CNG cars in India : మీరు ఓ సీఎన్​జీ కారును తీసుకోవాలని చూస్తున్నారా? దేశంలో అందుబాటులో ఉన్న చౌకైన సీఎన్​జీ మోడల్స్​ లిస్ట్​ను ఇక్కడ చూడండి..
అత్యంత చౌకైన సీఎన్​జీ వాహనాలు ఇవే..
అత్యంత చౌకైన సీఎన్​జీ వాహనాలు ఇవే..

అత్యంత చౌకైన సీఎన్​జీ వాహనాలు ఇవే..

Most affordable CNG cars in India : సీఎన్​జీ ధరలు ఇటీవలే తగ్గాయి. ఇప్పటికే మంచి డిమాండ్​ ఉన్న సీఎన్​జీ వాహనాల మోడల్స్​కు ఇది మరో సానుకూల విషయం. ఈ నేపథ్యంలో మీరు కూడా ఓ సీఎన్​జీ కారును తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? దేశంలో అత్యంత చౌకైన సీఎన్​జీ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ ఆల్టో 800 సీఎన్​జీ..

Maruti Suzuki Alto 800 CNG price : ఆల్టో 800 ప్రొడక్షన్​ను మారుతీ సుజుకీ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే సీఎన్​జీ మోడల్​ స్టాక్​ ఉన్నంత కాలం కొనుగోలు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.13లక్షలు. దీని మైలేజ్​ కేజీకి 30కి.మీలు. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న సీఎన్​జీ మోడల్స్​లో ఈ రేంజ్​ మైలేజ్​ ఇస్తున్న అతి తక్కువ వాహనాల్లో ఈ మోడల్​ ఒకటి. ఈ ఇంజిన్​ 40 బీహెచ్​పీ పవర్​ను, 60 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

మారుతీ సుజుకీ ఎస్​-ప్రెస్సో సీఎన్​జీ..

Maruti Suzuki S Presso CNG on road price in Hyderabad : మారుతీ సుజుకీ నుంచి మరో చౌకైన సీఎన్​జీ కారు ఈ ఎస్​-ప్సెస్సో. ఇందులో న్యూ జెన్​ సీఎన్​జీ కిట్​ ఉంటుంది. ఎల్​ఎక్స్​ఐ వేరియంట్​లో సీఎన్​జీ అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.0 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 56 బీహెచ్​పీ పవర్​ను 82 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. కేజీకి 32కి.మీల మైలేజ్​ దీని సొంతం. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు.

మారుతీ సుజుకీ ఆల్టో కే10..

Alto K10 CNG price : కే10 హ్యచ్​బ్యాక్​కు సీఎన్​జీ టచ్​ ఇచ్చింది మారుతీ సుజుకీ. ఇందులో 1.0 లీటర్​ కే10 సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 56 బీహెచ్​పీ పవర్​ను, 82ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. కేజీకి 34కి.మీల మైలేజ్​ ఇస్తుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 5.96లక్షలు.

మారుతీ సుజుకీ వాగన్​ఆర్​..

WagonR CNG on road price in Hyderabad : దేశంలో మంచి డిమాండ్​ ఉన్న హ్యాచ్​బ్యాక్​ మోడల్స్​లో వాగన్​ఆర్​ ఒకటి. దీని సీఎన్​జీ మోడల్​కు అదే విధంగా దూసుకెళుతోంది. ఇందులో 1.0 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 56 బీహెచ్​పీ పవర్​ను, 82ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. కేజీకి 34.05కి.మీల మైలేజ్​ ఇస్తుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.43లక్షలు.

టాటా టియాగో ఐసీఎన్​జీ..

Tata Tiago iCNG mileage : టాటా టియాగో ఐసీఎన్​జీలో 1.2 లీటర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 72 బీహెచ్​పీ పవర్​ను, 95 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. కేజీకి 26.49కి.మీల మైలేజ్​ దీని సొంతం. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.44లక్షలు.

తదుపరి వ్యాసం