Maruti Suzuki Cars Price Hike: మారుతీ సుజుకీ స్విఫ్ట్, డిజైర్, సెలెరియో సహా మరిన్ని కార్ల ధరలు పెంపు: వివరాలివే..
11 April 2023, 10:30 IST
- Maruti Suzuki Cars Price Hike: కార్ల ధరలను మారుతీ సుజుకీ పెంచింది. ఇప్పటికే ఈ ధరలు అమలులోకి వచ్చాయి.
Maruti Suzuki Cars Price Hike: మారుతీ సుజుకీ స్విఫ్ట్, డిజైర్, సెరెలియా సహా మరిన్ని కార్ల ధరలు పెంపు (Photo: HT Auto)
Maruti Suzuki Cars Price Hike: ఆరు కార్ల ధరలను ప్రముఖ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki ) పెంచింది. మారుతీ సుజుకీ స్విఫ్ట్, సెలెరియో, వాగన్ఆర్, డిజైర్, సియాజ్, ఎక్స్ఎల్6 కార్ల ధరలు పెరిగాయి. రూ.1,500 నుంచి రూ.15,000 వరకు రేట్లు అధికమయ్యాయి. పెంపు తర్వాత కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Maruti Suzuki XL6: మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6 కారు ధర రూ.15,000 వరకు పెరిగింది. దీంతో ఎక్స్ఎల్6 ప్రారంభ ధర రూ.11.41 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది.
Maruti Suzuki Ciaz: మారుతీ సుజుకీ సియాజ్ ధర రూ.11,000 వరకు అధికమైంది. వేరియంట్‍ను బట్టి ఈ కాంపాక్ట్ సెడాన్ ధర పెంపు ఉంది. సిగ్మా, ఆల్ఫా, ఆల్ఫా ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ.10,500 పెరిగింది. జెటా, జెటా ఆటోమేటిక్ మోడల్స్ రేటు రూ.11,000 అధికమైంది. డెల్టా, డెల్టా ఆటోమేటిక్ రూ.6,500 పెరిగింది. దీంతో మారుతీ సుజుకీ సియాజ్ కారు ధరలు రూ.9.30లక్షల నుంచి రూ.12.29లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
Maruti Suzuki WagonR: బెస్ట్ సెల్లింగ్ మోడల్‍గా ఉన్న మారుతీ సుజుకీ వాగన్ఆర్ ధర రూ.1,500 వరకు పెరిగింది. దీంతో ఈ కారు ప్రారంభ ధర రూ.5.54లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. టాప్ మోడల్ ధర రూ.7.40లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
Maruti Suzuki Celerio:మారుతీ సుజుకీ సెలెరియో కారు ధర కూడా రూ.1,500 పెరిగింది. దీంతో ఈ హ్యాచ్‍బ్యాక్ కారు ప్రారంభ ధర రూ.5.36లక్షల(ఎక్స్-షోరూమ్)కు చేరింది. టాప్ మోడల్ రేటు రూ.7.14లక్షల(ఎక్స్-షోరూమ్)కు పెరిగింది.
Maruti Suzuki Swift: స్విఫ్ట్ కారు ధరను రూ.5,000 పెంచింది మారుతీ సుజుకీ. దీంతో బేస్ వేరియంట్ ధర రూ.5.99లక్షలకు చేరింది. టాప్ వేరియంట్ రేటు రూ.8.97లక్షలు(ఎక్స్-షోరూమ్)కు పెరిగింది.
Maruti Suzuki Dezire: మారుతీ సుజుకీ డిజైర్ సెడాన్ కారు ధర రూ.7,500 వరకు అధికమైంది. దీంతో ఈ కారు ప్రారంభ ధర రూ.6.51లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.
ఇటీవల టాటా మోటార్స్, హ్యుండాయ్, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ మోటార్స్, కియా సహా కారు తయారీ సంస్థలన్నీ ధరలను అధికం చేశాయి. బీఎస్6 ఫేజ్-2 ఎమిషన్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‍లను అప్‍డేట్ చేయటంతో రేట్లను పెంచాయి.