తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Budget Cars In India : బడ్జెట్​లో దొరుకుతున్న 'బెస్ట్'​ కార్స్​ ఇవే.. ఓ లుక్కేయండి!

Best budget cars in India : బడ్జెట్​లో దొరుకుతున్న 'బెస్ట్'​ కార్స్​ ఇవే.. ఓ లుక్కేయండి!

24 October 2022, 10:43 IST

google News
    • Best budget cars in India : బడ్జెట్​లో మంచి కార్లను చూడాలనుకుంటున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.
టాటా పంచ్​
టాటా పంచ్​ (TATA PUNCH official website)

టాటా పంచ్​

Best budget cars in India : ఓ కారు కొనాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. బడ్జెట్​లో కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. వీరిలో మీరూ ఉన్నారా? బడ్జెట్​లో ది బెస్ట్​ కార్​ ఒకటి తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..

హుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​

Hyundai i20 N Line : సాధారణంగా ఐ20లో 120హెచ్​పీ 1 లీటర్​ త్రీ సిలిండర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. అయితే హుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​లో.. దీనికి తోటు సస్పెన్షన్​ సెటప్​ చాలా పవర్​ఫుల్​గా ఉంది. ఇంజిన్​లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ ఎన్​ లైన్​ వేరియంట్​లో డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇది 7 స్పీడ్​ డీసీటీ, 6స్పీడ్​ ఐఎంటీ గేర్​బాక్స్​ వేరియంట్​లో అందుబాటులో ఉంది. ధర రూ. 10లక్షలు- రూ. 12.11లక్షలు

హోండా సిటీ..

Honda City 1.5 litre iVTECH : హోండా సిటీ 1.5 లీటర్​ ఐవీటీఈసీ ఇంజిన్​.. 121హెచ్​పీని జనరేట్​ చేస్తుంది. 6స్పీడ్​ గేర్​బాక్స్​ ఇందులో ఉంటుంది. ఇందులో 6స్పీడ్​ ఆటోమేటిక్​ ఆప్షన్​ కూడా ఉంది. రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా హోండా సిటీ రైడ్​ సాఫీగా సాగిపోతుంది! అందువల్ల ఈ కార్​ను నడపడం చాలా సులభం. ధర రూ. 11.57లక్షలు- 15.32లక్షలు.

బడ్జెట్​లో ఎలక్ట్రిక్​ కార్లు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్​ చేయండి.

స్కోడా స్లావియా..

Skoda Slavia price : స్కోడా స్లావియాకు అదిరిపోయే డిమాండ్​ ఉంది. 1లీటర్​ టీఎస్​ఐ ఇంజిన్​.. 115హెచ్​పీని జరేట్​ చేస్తుంది. ఇందులో 1.5లీటర్​ టీఎస్​ ఇంజిన్​ వేరియంట్​ కూడా ఉంది. ఇది 150హెచ్​పీ, 250ఎన్ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. స్కోడా స్లావియా 6స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​, 7స్పీడ్​ డీసీజీ యూనిట్​తో అందుబాటులో ఉంది. ధర రూ. 16.79లక్షలు0 18.39లక్షలు

స్లావియాపై దీపావళి డిస్కౌంట్లు ఇస్తోంది స్కోడా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సిట్రోయెన్​న్​ సీ3..

Citroen C3 price : సిట్రోయెన్​ సీ3 1.2లీటర్​ త్రీ సిలిండర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ పర్ఫార్మెన్స్​ చాలా బాగుంటుంది. ఇది 110హెచ్​పీ, 190 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది. ఇందులో రైడ్​ చాలా బ్యాలెన్స్​డ్​గా ఉంటుంది. కానీ కొన్ని ఫీచర్లు ఇందులో మిస్​ అయ్యాయి. ధర రూ. 8.15లక్షలు.

మహీంద్రా ఎక్స్​యూవీ300 టర్బోస్పోర్ట్​..

Mahindra XUV300 TurboSport :ఇందులో 1.2లీటర్​ త్రీ సిలిండర్​ ఎంస్టాలియన్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 131హెచ్​పీ, 230ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఇంజిన్​ పర్ఫార్మెన్స్​ అద్భుతంగా ఉంటుంది. దీని హ్యాండ్లింగ్​ బ్యాలెన్స్​ ఇమ్​ప్రెసివ్​గా ఉంటుంది. ఎస్​యూవీ సెగ్మెంట్​కు కచ్చితంగా నప్పుతుంది. ధర రూ. 10.35లక్షల నుంచి మొదలు.

టాటా పంచ్​ అడ్వెంచర్​ రిథమ్​..

Tata Punch Adventure Rhytm : టాటా పంచ్​లో అడ్వెంచర్​ రిథమ్​ వేరియంట్​.. వాల్యూ ఫర్​ మనీలాగా ఉంటుంది. దీని 1199సీసీ త్రీ సిలిండర్​ ఇన్​లైన్​ ఇంజిన్​ ఉంటుంది. 84బీహెచ్​పీ, 113ఎన్​ఎం టార్క్​ని ఇది జనరేట్​ చేస్తుంది. 5 గేర్​ మేన్యువల్​తో పాటు ఆటోమేటిక్​ వర్షెన్​లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు సేఫ్టీకి పెట్టింది పేరు. క్రాష్​ టెస్ట్​లో ఇది 5స్టార్​ రేటింగ్​ను దక్కించుకుంది. ధర రూ. 7.65లక్షల నుంచి మొదలు.

తదుపరి వ్యాసం