Kia cars waiting period : ‘కియా’ కార్ల వెయిటింగ్ పీరియడ్‌కి.. మైండ్ పోవాల్సిందే!
09 October 2022, 17:07 IST
- Kia cars waiting period : కియా కారెన్స్, సెల్టోస్, సోనెట్.. ఇలా అన్ని మోడల్స్‌కు భారీగా వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఒక్కోసారి అది 75వారాలుగా ఉండటం గమనార్హం.
కియా కార్ల వెయిటింగ్ పీరియడ్ చూస్తే.. మైండ్ పోవాల్సిందే
Kia cars waiting period : కొవిడ్ సంక్షోభం నుంచి ఆటో రంగం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ల లభ్యత పెరుగుతుండటం సానుకూల విషయం. అయినప్పటికీ.. అనేక వాహనాల వెయిటింగ్ పీరియడ్ చాలా దారుణంగా ఉంటోంది! ముఖ్యంగా ఇండియాలో కియా మోటార్స్ కార్ల వెయిటింగ్ పీరియడ్ గురించి తెలిస్తే మైండ్ పోవాల్సిందే. ఆ సంస్థ తాజాగా లాంచ్ చేసిన కియా కారెన్స్‌కు ఏకంగా 75వారాల వెయిటింగ్ పీరియడ్ నడుస్తుండటం గమనార్హం.
సాధారణంగా.. ఎంపీవీలకు పెద్దగా డిమాండ్ ఉండదు. కానీ ఎంపీవీ అయిన కియా కారెన్స్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా బుక్సింగ్ వెల్లువెత్తుతున్నాయి. కానీ అందుకు తగ్గట్టు డెలివరీలు ఉండటం లేదు. కియా కారెన్స్లోని కొన్ని వేరియంట్లకు 75వారాల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. కియా కారెన్స్ బేస్ వేరియంట్ ధర(ఎక్స్‌షోరూమ్) రూ. 9.6లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 17.70లక్షలు.
కియా కారెన్స్ 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ 74-74వారాల మధ్యలో ఉంది. కియా కారెన్స్ లగ్జరీ, లగ్జరీ ప్లస్ 7 వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ 18-19 వారాల మధ్యలో ఉంది.
కియా సోనెట్ కూడా..
Kia Sonet waiting period : ఇక ఎస్యూవీ సెగ్మెంట్లో దూసుకెళుతున్న సోనెట్ కథ కూడా ఇంతే! కియా సోనెట్ హెచ్‌డీఎక్స్ డీసీటీ ట్రిమ్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ 40-41 వారాల మధ్య నడుస్తోంది. డీజిల్ ఇంజిన్‌తో కూడిన హెచ్‌టీఎక్స్ ఏఈ, హెచ్‌టీఎక్స్ ఏఈ ఏటీ వేరియంట్లు, హెచ్‌టీఎక్స్ డీసీటీ ఏఈ వేరియంట్లకు వెయిటింగ్ పీరియడ్ 13-14 వారాలుగా ఉంది. ఇదే అత్యల్పం కావడం గమనార్హం.
కియా సోనెట్ బేస్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 7.49లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 13.99లక్షలుగా ఉంది.
కియా సెల్టోస్‌కు 14 వారాలు..!
Kia Seltos waiting period : కియాలో బెస్ట్ సెల్లింగ్ మోడెల్‌గా గుర్తింపు పొందిన సెల్టోస్‌కి కూడా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగానే ఉంది. జీటీఎక్స్ ప్లస్, జీటీఎక్స్ఓ, జీటీఎక్స్ ప్లస్ ఏటీ ఎక్స్-లన్, హెచ్టీకే ప్లస్, హెచ్టీకే ప్లస్, హెచ్టీకే ప్లస్ ఐఎంటీ, హెచ్‌టీఎక్స్ ప్లస్ వేరియంట్లకు ఏకంగా 13-14 వారాల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఇక హెచ్‌టీఈ వేరియంట్‌కు అత్యధికంగా 32-33 వారాల డెలివరీ పీరియడ్ ఉంది.
కియా సెల్టోస్ బేస్ వేరియంట్ ధర రూ. 10.49లక్షలుగాను, టాప్ ఎండ్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 18.65లక్షలుగాను ఉంది.
Kia motors : కారెన్స్, సోనెట్, సెల్టోస్తో పాటు కార్నివాల్‌ను కూడా సేల్ చేస్తుంది కియా. ఇది ప్రీమియం ఎంపీవీ మోడల్.
ఇక ఇండియాలో కియా మోటర్స్ అద్భుతంగా రాణిస్తోంది. సెప్టెంబర్‌లో 25,827 యూనిట్లను విక్రయించింది. ఒక నెలలో ఇంత మొత్తంలో కార్లు అమ్మడం కియాకు ఇదే తొలిసారి! వీటిల్లో కియా సెల్టోస్ అత్యధికంగా అమ్ముడుపోయింది.