M & M, Kia sales up: ఎం అండ్ ఎం, కియా మోటార్స్ జోరు.. ఆగస్టు సేల్స్‌లో పెరుగుదల-mahindra and mahindra kia motors sales up in august 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mahindra And Mahindra Kia Motors Sales Up In August 2022

M & M, Kia sales up: ఎం అండ్ ఎం, కియా మోటార్స్ జోరు.. ఆగస్టు సేల్స్‌లో పెరుగుదల

HT Telugu Desk HT Telugu
Sep 01, 2022 06:34 PM IST

Mahindra & Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో భారీ పెరుగుదల నమోదైంది.

Mahindra Scorpio-N: ఆగస్టు నెలలో భారీగా పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు
Mahindra Scorpio-N: ఆగస్టు నెలలో భారీగా పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆగస్టులో మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 87 శాతం పెరిగి 29,852 యూనిట్లకు చేరుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 15,973 యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఆగస్టు నెలలో కార్లు, వ్యాన్‌ల విక్రయాలు 336 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఇవి 187 యూనిట్లుగా ఉన్నాయి.

వాణిజ్య వాహనాల విభాగంలో 2022 ఆగస్టులో 21,492 వాహనాలను విక్రయించామని, గత ఏడాది ఇదే నెలలో 8,814 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది.

పోర్ట్‌ఫోలియో అంతటా డిమాండ్ బలంగా ఉందని తెలిపింది. స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్, కొత్త బొలెరో మ్యాక్స్‌ఎక్స్ పిక్-అప్ వంటి కొత్త ఆవిష్కరణలు కూడా వృద్ధిని పెంచడంలో దోహదపడ్డాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ డివిజన్) విజయ్ నక్రా తెలిపారు.

ట్రాక్టర్ల విభాగంలో 2021 ఆగస్టులో అమ్ముడైన 21,360 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో మొత్తం అమ్మకాలు స్వల్పంగా 21,520 యూనిట్లకు పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

దేశీయ ట్రాక్టర్ అమ్మకాలు 19,997 యూనిట్ల నుండి 20,138 యూనిట్లకు పెరిగాయి. అయితే ఆగస్టు 2021లో 1,363 యూనిట్ల నుండి ఎగుమతులు గత నెలలో 1,382 యూనిట్లకు పెరిగాయి.

‘పండుగ సీజన్‌లో ట్రాక్టర్ కొనుగోళ్లు డిమాండ్ పునరుద్ధరణకు దారితీస్తాయని మేం ఆశాభావంతో ఉన్నాం. రైతులు పంటకోత కార్యకలాపాలకు సన్నాహాలు ప్రారంభిస్తారు. పండుగ సీజన్‌లో బలమైన ట్రాక్టర్ డిమాండ్ కోసం మేం సిద్ధం అవుతున్నాం..’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్) హేమంత్ సిక్కా అన్నారు.

కియా సేల్స్ జోరు…

కియా కార్ల తయారీ సంస్థ ఆగస్టులో డీలర్‌లకు చేసిన పంపిణీ (హోల్ సేల్ విక్రయాలు) లో 33 శాతం పెరిగాయని నివేదించింది. ఆగస్టు 2021లో 16,759 యూనిట్లు డీలర్లకు పంపిణీ చేయగా, గత నెలలో కంపెనీ హోల్‌సేల్ విక్రయాలు 22,322 యూనిట్లుగా ఉన్నాయి.

ఈ నెలలో సెల్టోస్ 8,652 యూనిట్లతో కంపెనీ పనితీరులో అగ్రగామిగా ఉండగా, సోనెట్, కారెన్స్, కార్నివాల్ వరుసగా 7,838, 5,558, 274 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని కియా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

‘ఈ సంవత్సరం ప్రారంభం నుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇది భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌కు మంచి సంకేతం’ అని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు.

IPL_Entry_Point

టాపిక్