Kia Seltos: 6 ఎయిర్ బ్యాగ్స్‌తో రానున్న కియా సెల్టోస్
Kia Seltos: కియా సెల్టోస్ ఇకపై 6 ఎయిర్ బ్యాగ్స్‌తో రానుంది.
కియా ఇండియా తన మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా అందించనున్నట్లు బుధవారం తెలిపింది.
సేఫ్టీపై మరింత దృష్టి పెట్టడం ద్వారా మోడల్ అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఈ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ ఇప్పటికే దాని మోడల్ కారెన్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా అందిస్తోంది.
‘మా ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురావడం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం..’ అని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కియాకు భారతదేశం ఒక ముఖ్యమైన మార్కెట్ అని, సెల్టోస్ చాలా ముఖ్యమైన ఉత్పత్తి అని ఆయన తెలిపారు.
దేశంలోని కంపెనీ మొత్తం అమ్మకాలలో సెల్టోస్ వాటా దాదాపు 60 శాతానికి చేరుకుంది.
అక్టోబరు 1 నుంచి ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు కార్ల తయారీదారులు ఎనిమిది మంది వరకు ప్రయాణించే మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికుడి ముందు ఎయిర్ బ్యాగ్ తెరుచుకుని గాయాలు కాకుండా అడ్డుగోడగా ఓపెన్ అవుతుంది.
టాపిక్