Kia recalls Carens cars: 44,174 క్యారెన్స్ కార్లను వెనక్కి రప్పించిన కియా-kia recalls 44 174 units of carens to inspect airbag control software ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Kia Recalls 44,174 Units Of Carens To Inspect Airbag Control Software

Kia recalls Carens cars: 44,174 క్యారెన్స్ కార్లను వెనక్కి రప్పించిన కియా

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 11:26 AM IST

Kia recalls 44,174 units of Carens: కియా మోటార్స్ తన కారెన్స్ మోడల్ కార్లను వెనక్కి రప్పిస్తోంది.

కియా కారెన్స్ కారు
కియా కారెన్స్ కారు (PTI)

కియా ఇండియా ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను తనిఖీ చేయడానికి, లోపాలు ఉంటే సరిచేయడానికి తన తాజా మోడల్ 'కారెన్స్' కార్లలో 44,174 కార్లను వెనక్కి రప్పించింది.

ట్రెండింగ్ వార్తలు

బాధ్యతాయుతమైన కార్పొరేట్‌ కంపెనీగా తనిఖీ కోసం వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. అవసరమైతే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉచితంగా అందిస్తామని కియా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్వచ్ఛంద రీకాల్ క్యాంపెయిన్ గురించి అప్‌డేట్ చేయడానికి సంబంధిత వాహనాల యజమానులను నేరుగా చేరుకుంటామని కియా తెలిపింది.

బాధిత వాహనాల కస్టమర్లు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి సంబంధిత కియా అధీకృత డీలర్‌లను సంప్రదించవలసి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కియా ఇండియా కారెన్స్‌ మోడల్ కార్లను విడుదల చేసింది. ఇది ఆరు, ఏడు సీటింగ్ ఆప్షన్లతో వస్తుంది.

ఈ కారు 1.5 పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్, 1.5 డీజిల్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో లభిస్తుంది. కియా కారెన్స్ ఈ ఏడాది జనవరి 14న ప్రారంభించిన బుకింగ్ ద్వారా రెండు నెలల్లోనే 50,000 బుకింగ్స్ నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 42 శాతం బుకింగ్స్ టైర్ 3, ఇతర నగరాల నుండి వచ్చాయని తెలిపింది.

WhatsApp channel

టాపిక్