Diwali discounts on Skoda cars : ఈ స్కోడా వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్లు..-check out diwali discounts on skoda kushaq and slavia ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali Discounts On Skoda Cars : ఈ స్కోడా వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్లు..

Diwali discounts on Skoda cars : ఈ స్కోడా వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్లు..

Sharath Chitturi HT Telugu
Oct 22, 2022 01:45 PM IST

Diwali discounts on Skoda cars : రెండు వాహనాలపై దివాళీ డిస్కౌంట్లను ప్రకటించింది స్కోడా. ఆ వివరాలు..

స్కోడా వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్లు..!
స్కోడా వాహనాలపై అదిరిపోయే డిస్కౌంట్లు..! (HT AUTO)

Diwali discounts on Skoda cars : పండుగ సీజన్​ నేపథ్యంలో వివిధ ఆటో సంస్థలు.. తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా.. ఈ జాబితాలోకి స్కోడా కూడా చేరింది. ఎస్​యూవీ కుషాక్​, మిడ్​ సైజ్​ సెడాన్​ స్లావియా వేరియంట్స్​పై డిస్కౌంట్లను ప్రకటించింది. 

పండుగ సీజన్​ని ఉపయోగించుకుని సేల్స్​ సంఖ్యను పెంచుకునేందుకు.. ఆయా వేరియంట్లపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది స్కోడా.

స్కోడా కుషాక్​..

Skoda Kushaq : కుషాక్​ ఎస్​యూవీపై మొత్తం మీద రూ. 30వేల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది స్కోడా. ఎక్స్​ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్​, లాయెల్టీ బెనిఫిట్​లను కలుపుకుని రూ. 30వేలు డిస్కౌంట్లు ఇచ్చింది. వీటితో పాటు.. కుషాక్​ కస్టమర్లకు నాలుగేళ్ల పాటు సర్వీస్​ మెయిన్​టేనెన్స్​ ప్యాకేజీని సైతం కాంప్లిమెంటరీగా ఆఫర్​ చేస్తోంది స్కోడా.

కుషాక్​ ఎస్​యూవీ.. ప్రస్తుతం స్కోడాకు బెస్ట్​ సెల్లర్​గా ఉంది. ఇది భారత మార్కెట్​లోకి ప్రవేశించి ఏడాది గడిచిపోయింది. కాగా.. స్కోడా కుషాక్​ ప్రస్తుతం ఇండియా మార్కెట్​లో అత్యంత భద్రమైన ఎస్​యూవీ వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దీనికి 5స్టార్​ రేటింగ్​ లభించింది.

ప్రస్తుతం ఇండియాలో స్కోడా కుషాక్​ ఎస్​యూవీ 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. రూ. 11.29లక్షలు- రూ. 19.49లక్షల(ఎక్స్​షోరూం ధర) మధ్య కుషాక్​ ఎస్​యూవీ లభిస్తోంది. హుందాయ్​ క్రేటా, కియా సెల్టోస్​, వోక్స్​వాగన్​ టైగన్​, ఎంజ్​ ఆస్టర్​కు ఇది గట్టి పోటీనిస్తోంది.

స్కోడా స్లావియా..

Skoda Slavia : మిడ్​ సైజ్​ సెడాన్​ వేరియంట్​ స్లావియాను ఇండియాలో ఈ ఏడాదే లాంచ్​ చేసింది స్కోడా. ఇది హోండా సిటీ, వోక్స్​వాగన్​ వర్టూస్​కు పోటీనిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిస్కౌంట్​, లాయల్టీ బోనస్​తో కలుపుకుని మొత్తం మీద రూ. 25వేల వరకు డిస్కౌంట్​ ఇస్తోంది.

కుషాక్​కు ఇచ్చినట్టుగానే.. స్లావియాపైనా నాలుగేళ్ల పాటు సర్వీస్​ మెయిన్​టేనెన్స్​ ప్యాకేజీని కాంప్లిమెంటరీగా ఆఫర్​ చేస్తోంది స్కోడా.

స్కోడా స్లావియా రెండు ఇంజిన్​ ఆప్షన్లలో వస్తోంది. 1 లీటర్​ పెట్రోల్​ స్లావియా ధర రూ. 10.99లక్షలు(ఎక్స్​షోరూం)గా ఉంది. 1.5లీటర్​ టీఎస్​ఐ ఆటోమేటిక్​ వేరియంట్​ ధర రూ. 18.39లక్షలు(ఎక్స్​షోరూం)గా ఉంది.

సంబంధిత కథనం