Telugu News  /  Photo Gallery  /  Mid Size Sedan Model Skoda Slavia Review In Pics

Skoda Slavia | స్కోడా స్లావియా కారు రివ్యూ

28 February 2022, 12:01 IST HT Telugu Desk
28 February 2022, 12:01 , IST

స్కోడా స్లావియా సెడాన్‌ మోడల్‌ను ఈ మధ్యే తీసుకొచ్చింది. ఈ కారు స్కోడా ర్యాపిడ్‌కు రీప్లేస్‌మెంట్‌ కావడంతోపాటు హోండా సిటీ, హ్యుండాయ్‌ వెర్నా, మారుతి సుజుకి సియాజ్‌ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. స్లావియా రెండు ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తోంది.

స్కోడా తమ MQB ప్లాట్‌ఫామ్‌లో తీసుకొచ్చిన రెండో ప్రోడక్ట్‌ ఈ మిడ్‌సైజ్‌ సెడాన్‌ మోడల్‌ అయిన స్లావియా. ఇంతకుముందు కుషాక్‌ (Kushaq) వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త మోడల్‌ తన ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది.

(1 / 9)

Skoda Slavia ఐదు రంగుల్లో వస్తోంది. బ్రిలియెంట్‌ సిల్వర్‌, కార్బన్‌ స్టీల్‌, క్రిస్టల్‌ బ్లూ, టోర్నడో రెడ్‌, క్యాండీ వైట్‌ రంగుల్లో ఈ కారు వస్తోంది.

(2 / 9)

Skoda Slaviaలో రెండు ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్‌ టీఎస్‌ఐ, 1.5 లీటర్‌ మోటార్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తోంది. డీజిల్‌ ఇంజిన్‌ అందుబాటులో లేదు. అయితే మాన్యువల్‌, ఏటీ, డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు.

(3 / 9)

ఈ రేంజ్‌లో ఉన్న ఇతర కంపెనీల కార్లతో పోలిస్తే Skoda Slavia కాస్త ఎక్కువ వెడల్పు, ఎత్తుతో వస్తోంది. మిడ్‌సైజ్‌ సెడాన్ కార్లలో ఈ స్లావియా గ్రౌండ్‌ క్లియరెన్స్‌ బాగుంది.

(4 / 9)

SKoda Slavia మోడల్‌కు 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, ముందు భాగంలో విశాలమైన గ్రిల్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ ఉన్నాయి.

(5 / 9)

ఇక Skoda Slavia బూట్‌ స్పేస్‌ కూడా చాలా ఎక్కువగా ఉంది. 520 లీటర్ల బూట్‌ స్పేస్‌తో ఈ కారులో భారీ లగేజీని సులువుగా సర్దేయొచ్చు.

(6 / 9)

ఇక స్లావియా క్యాబిన్‌ విషయానికి వస్తే 10 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, 8 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లేతో వస్తోంది.

(7 / 9)

ఇక వేరియెంట్‌, ఇంజిన్‌ ఆప్షన్‌కు తగినట్లుగా స్కోడా స్లావియాలో మల్టీపుల్ స్పీకర్లు, ట్వీటర్లు, సబ్‌ వూఫర్‌, ఆటోమేటిక్‌ హెడ్‌లైట్‌, ఆటో వైపర్స్‌ ఆప్షన్లు ఉన్నాయి.

(8 / 9)

మంచి స్పేస్‌ ఉన్న సెడాన్‌ మోడల్‌ కావాలనుకునే వారికి ఈ Skoda Slavia బెస్ట్ ఆప్షన్‌. వెనుకాల కూర్చునే వారికి, లగేజీకి చాలా స్పేస్‌ ఉంది.

(9 / 9)

ఇతర గ్యాలరీలు