BMW XM Label Red : స్టైలిష్ లుక్‌తో మరో బీఎండబ్ల్యూ కార్.. మోస్ట్ పవర్ఫుల్!
23 October 2022, 17:14 IST
- BMW XM Label Red : స్టైలిష్ లుక్‌తో మరో కార్‌ను ఆవిష్కరించింది బీఎండబ్ల్యూ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు..
స్టైలిష్ లుక్‌తో మరో బీఎండబ్ల్యూ కార్..
BMW XM Label Red : జర్మనీ ఆటోమేకర్ BMWకు చెందిన XM Label Red ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది BMWలోనే ది మోస్ట్ పవర్ఫుల్ కార్గా గుర్తింపు తెచ్చుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ BMW XM Label Red సేల్స్ ప్రారంభంకానున్నాయి.
BMW XM ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యింది. ఇక BMW XM Label Red ఓ ఎస్యూవీ. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా దీని ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది జర్మనీ ఆటోమేకర్. ఈ కార్కు సంబంధించిన మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. BMW XMకు ఎలాంచి మార్పులు చేసి, XM Label Redని తీసుకొచ్చారు అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.
పవర్ఫుల్ కార్..
అయితే.. BMW XM Label Red 738హెచ్‌పీ పవర్, 1000ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుందని తెలుస్తోంది. ఇది స్టాండర్డ్ XM కన్నా చాలా రెట్లు ఎక్కువ! ఇందులో ట్విన్ టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ వీ8 ఇంజిన్- సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
ఇక డిజైన్ విషయానికొస్తే.. BMW XM Label Red ఫ్రంట్ గ్రిల్‌కి రెడ్ ట్రిమ్ చేశారు. విండోస్, వీల్స్‌కి కూడా రెడ్ ట్రిమ్ ఉంది. గ్రిల్ మీద RED XM బ్యాడ్జ్ ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్స్లో అప్‌గ్రేడ్ ఉంటుందని తెలుస్తోంది.
ఈ వార్త విని BMW ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. పూర్తి వివరాలను ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు.
బీఎండబ్ల్యూ ఎం2..
2023 BMW M2 unveiled : బీఎండబ్ల్యూ ఎం2ను ఇటీవలే ఆవిష్కరించారు. ఇందులో డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఈ కొత్త వాహనం.. 2002 టర్బో స్పోర్ట్స్ కూప్నకు, బీఎండబ్ల్యూ 1ఎంకు సక్సెసర్‌గా పిలుస్తున్నారు. ఇందులో ఎస్58 పవర్ యునిట్ ఉంది. 2.0 లీటర్ టర్బోఛార్జ్ ఇన్లైన్- 6 సిలిండర్ ఇంజిన్ దీని సొంతం. ఇది 453 బీహెచ్పీ, 550 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, లేదా 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఇందులో ఉంటుంది.
మేన్యువల్ గేర్ బాక్స్‌లో.. 0-60ఎంపీహెచ్కి వెళ్లేందుకు 4.1 సెకన్లు పడుతుంది. అదే ఆటోమెటిక్లో అయితే 3.9సెక్లనే పడుతుంది. గంటకు 250కి.మీల వేగంతో ఈ బీఎండబ్ల్యూ ఎం2 ప్రయాణిస్తుంది.
ఈ బీఎండబ్ల్యూ ఎం2లో హారిజాంటల్ కిడ్నీ గ్రిల్.. ఫ్రంట్‌లో ఉంటుంది. స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. 19 ఇంచ్ ఫ్రంట్, 20 ఇంచ్ రేర్ వీల్స్ దీనికి ఉన్నాయి.
BMW M2 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాపిక్