Lava Blaze 2 Pro : బడ్జెట్ ఫ్రెండ్లీ లావా బ్లేజ్ 2 ప్రో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
11 September 2023, 16:51 IST
- Lava Blaze 2 Pro : Lava Blaze 2 Pro : బడ్జెట్ ఫ్రెండ్లీ లావా బ్లేజ్ 2 ప్రో లాంచ్ అయ్యింది. ఈ గ్యాడ్జెట్ ధర, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
బడ్జెట్ ఫ్రెండ్లీ లావా బ్లేజ్ 2 ప్రో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
Lava Blaze 2 Pro : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ అడుగుపెట్టింది. అదే లావా బ్లేజ్ 2 ప్రో. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్స్ ఇవే..
లావా బ్లేజ్ 2 ప్రోలో సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే ఎడ్జెస్ లభిస్తున్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్స్ వస్తున్నాయి.
ఈ కొత్త మొబైల్లో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ (720x1600 పిక్సెల్స్) డిస్ప్లే వస్తోంది. ఈ గ్యాడ్జెట్ బరువు 190గ్రాములు. డైమెన్షన్స్.. 163ఎంఎంx75.2ఎంఎంx8.5ఎంఎం.
ఈ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డ్యూయెల్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 8ఎంపీ కెమెరా లభిస్తోంది.
ఇదీ చూడండి:- Oppo A38 : ఒప్పో ఏ38 లాంచ్.. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంది?
ఈ లావా బ్లేజ్ 2 ప్రో మోడల్లో 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌తో స్టోరేజ్‌ని ఎక్స్‌ప్యాండ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది సంస్థ. ఇక ఈ మోడల్.. ఆండ్రాయిడ్ 12 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జిగ్ సపోర్ట్ దీని సొంతం. ఈ మొబైల్లో యునీఎస్ఓసీ టీ616 చిప్సెట్ వస్తోంది. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, వైఫై, టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి కనెక్టివిటీ ఫీచర్స్‌గా ఉన్నాయి.
కొత్త స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..!
ఈ లావా బ్లేజ్ 2 ప్రో 3 కలర్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అవి థండర్ బ్లాక్, కూల్ గ్రీన్, స్వాగ్ బ్లూ. ఇక ఈ మొబైల్ ధర రూ. 9,999. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఈ గ్యాడ్జెట్.. పోటీని మరింత పెంచుతుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మొబైల్‌కు మంచి డిమాండ్ లభిస్తుందని సంస్థ కూడా ఆశిస్తోంది.